The new notes
-
బ్రోకర్ అవతారంలో డాక్టర్
పాత నోట్లమార్పిడికినల్లకుబేరులతో ఒప్పందం రూ. 47 లక్షల కొత్త నోట్లతో చిక్కిన డాక్టర్ శిరీష్ నగరంలో నర్సింగ్ హోం నిర్వహణ తల్లిదండ్రులు కూడా డాక్టర్లే.. గౌరవప్రదమైన వైద్య వృత్తిలో ఉన్నాడు.. తల్లిదండ్రులూ డాక్టర్లే కావడంతో జీవితంలో బాగానే స్థిరపడ్డాడు. సిటీలో కీలక ప్రాంతంలో కుటుంబంతో నర్సింగ్ హోం నిర్వహిస్తున్నాడు. డబ్బు బాగానే వెనకేశాడు. కానీ ఏం లాభం? అక్రమంగా వచ్చే డబ్బు కోసం ఆలోచనలు పెడదారి పట్టి అత్యాశకు పోయి పోలీసుల చేత చిక్కాడు. నగరంలోని శంకరమఠం రోడ్డు చేరువలో నివసిస్తున్న అన్నె శిరీష్ కథ ఇది. పెద్ద నోట్ల రద్దు తర్వాత సిటీలో చోటు చేసుకుంటున్న దిగ్భ్రాంతికర పరిణామాలకు మచ్చు తునకలాటి ఉదాహరణ ఇది. నోట్ల రద్దు తర్వాత తమ దగ్గర భారీ ఎత్తున పేరుకుపోయిన నల్లధనాన్ని కొందరు బ్రోకర్ల ద్వారా కమీషన్ చెల్లించి తెల్ల ధనంగా మార్చుకున్న శిరీష్ మాస్టర్ ప్లాన్ వేశాడు. తానే బ్రోకర్ అవతారమెత్తాడు. కొందరు నల్ల కుబేరులతో అవగాహన కుదుర్చుకున్నాడు. రూ. 5 కోట్లు మార్చేందుకు ఒప్పందం పెట్టుకుని వాళ్లకు ముందస్తుగా ఇవ్వడానికి అపార్ట్మెంట్లో రూ. 47 లక్షలు పెట్టుకుని రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అతని అనుచరులు కూడా పట్టుబడ్డారు. ఈ సంఘటనపై సీబీఐ, ఐటీ అధికారులు దృష్టి సారించారు. విశాఖపట్నం: నోట్ల రద్దు తర్వాత నల్లధనాన్ని తెల్లధనంగా బడా బాబులు ఎలా మార్చుకుంటున్నారో నగరంలో వెలుగు చూస్తున్న ఉదంతాలు బయటపెడుతున్నాయి. తాజాగా ఓ డాక్టర్ నల్లధనం మార్పిడిలో కీలకంగా వ్యవహరించి టాస్క్‌ఫోర్స్‌కు చిక్కడం సంచలనమైంది. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర మఠం రోడ్డు సమీపంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర శ్రీపవన్ ఎస్టేట్‌లోని ప్లాట్ నెంబర్ 401లో డాక్టర్ అన్నె శీరిష్ నివసిస్తున్నారు. ఆయన కదలికలపై అనుమానం రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొంత కాలంగా నిఘా ఉంచారు. ఈ క్రమంలో రూ.47 లక్షల కొత్త, పాత నోట్లు తన ప్లాట్‌లో ఉంచాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే టాస్క్‌ఫోర్స్ ఏసీపీ చిట్టిబాబు నేతృత్వంలో ఎస్ఐలు సతీష్, మూర్తి, సిబ్బంది దాడి చేసి డాక్టర్ శిరీష్‌తో పాటు, మరో ఇద్దరు బ్రోకర్లు మజ్జి సూర్యప్రసాద్‌రెడ్డి, బొడ్డేపల్లి శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. శిరీష్ ఉంటున్న అపార్ట్మెంట్ యజమాని సూర్యప్రసాద్‌రెడ్డి. వారి వద్ద నుంచి రూ.46 లక్షలు రెండు వేల నోట్లు, రూ.లక్ష వంద నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని, నాలుగో పట్టణ పోలీసులకు అప్పగించారు. మార్పిడి అలా మొదలైంది అన్నె శీరిష్‌తో పాటు ఆయన తండ్రి శివాజీ, తల్లి కూడా వైద్యులే. వీరంతా కలిసి ద్వారకానగర్ మూడో లైన్లో అన్నపూర్ణ ఆస్పత్రి నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వారి వద్ద ఉన్న నల్లధనాన్ని పెద్ద నోట్లు రద్దు చేయడంతో ఏం చేయాలనే సమస్య ఎదురైంది. అదే సమయంలో నగరంలో నోట్ల మార్పిడి మూఠాల విషయం తెలుసుకుని వారిని శిరీష్ కలుసుకున్నాడు. తన వద్ద ఉన్న దాదాపు రూ.60 లక్షల నల్ల ధనాన్ని వారి సాయంతో తెల్లధనంగా మార్చుకున్నారు. దీనికోసం 30శాతం కమిషన్‌ను నోట్ల మార్పిడి ముఠాకు ఇచ్చారు. అయితే శిరీష్ అక్కడితో అగలేదు. ఈ పనేదో బాగుందని అపార్ట్మెంట్ యజమానితో కలిసి తానే బ్రోకర్‌గా మారాడు. అప్పటి నుంచి నగరంలో నల్లధనం మార్చడం ప్రారంభించారు. రూ.15 కోట్లు మార్చాలని శిరీష్ ముఠా నోట్ల మార్పిడిని భారీ ఎత్తున చేయడం మొదలుపెట్టింది. తమకున్న పరిచయాలను ఉపయోగించుకుని నల్ల కుబేరులను సంప్రదించి వారి పాత నోట్లు మార్చుతుండేవారు. ఈ నేపథ్యంలో ఐదుగురు నల్లకుబేరుల నుంచి రూ.15 కోట్లు మార్చేందుకు చర్చలు జరిపారు. తొలుత రూ.5 కోట్ల నోట్లు మార్చేందుకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే దీనికోసం రూ.50 లక్షలు ముందుగా (షోయింగ్ అమౌంట్) ఇచ్చిపుచ్చుకుంటారు. తమ ముఠాపై నమ్మకం కలిగించేందుకు ఇలా చేస్తుంటారు. ఆ సొమ్ము ఆదివారం తీసుకువచ్చారు. ఆ క్రమంలో పోలీసులకు చిక్కారు. శిరీష్‌కు చెందిన నాలుగు ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాల్లో రూ.36 లక్షలు సొమ్ము ఉంది. వాటి లెక్కలు తేలాల్సి ఉంది. అయితే నవంబర్ ఎనిమిది తర్వాత తమకు రోగుల నుంచి రావాల్సిన సొమ్ము వచ్చిందని శిరీష్ దొంగలెక్కలు చూపించి కొంత సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేశాడని టాస్క్‌ఫోర్స్ ఏసీబీ చిట్టిబాబు ’సాక్షి’కి వెల్లడించారు. కొత్త నోట్లు వచ్చిందిలా పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చేందుకు నగరంలో చాలా ముఠాలు పుట్టుకొచ్చాయి. ఎవరికీ అసలు బాస్ ఎవరో తెలియదు. ఎవరికి వారు తమ పాత్ర వరకూ పూర్తి చేస్తుంటారు. అయితే వారికి బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పనిచేసే సిబ్బంది సహకారం ఎక్కువగా ఉంటుంది. ఎవరికి ఇవ్వాల్సిన కమిషన్ వారికి వెళ్లిపోతుంది. నగరంలోని చిన్నా చితకా వ్యాపారాలు, రోడ్డు పక్కన బళ్లు నడుపుకునే వారే వీరి టార్గెట్. వారికి కమీషన్ ఆశచూపి వారి కరెంట్ అకౌంట్లో డబ్బులు వేశారు. కరెంట్ అకౌంట్లో రోజుకి రూ.50వేలు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. అందుకే వీరు ప్రతి డీల్‌కు వారం నుంచి పది రోజుల గడువు తీసుకునేవారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసి తర్వాత విత్‌డ్రా చేసుకుని తెల్లధనంగా మార్చుకున్నారు. ఇంతవరకూ 5 కేసులు నల్లధనం మార్పిడి విషయంలో నగరంలో ఇప్పటి వరకూ ఐదు కేసులు వెలుగు చూశాయి. వాటిలో 22 మందిని అరెస్ట్ చేసి రూ.1.46 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో తాజా కేసు పెద్దది కావడంతో సీబీఐ, ఐటీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ రెండు విభాగాలు జరపనున్నాయి. వీరికి కొత్త నోట్లు ఎలా వచ్చాయి. పోస్టాఫీసు, బ్యాంకుల పాత్రపై వారు లోతుగా ఆరా తీయనున్నారు. -
తెల్లబోయిన నల్లధనం
కరెన్సీ మార్చే క్రమంలో విజయవాడ ముఠా ఘరానా మోసం పాత నోట్లకు బదులు కొత్త నకిలీ నోట్లు నగరానికి చెందిన వ్యాపారికి రూ.15లక్షలు టోకరా హన్మకొండ చౌరస్తా : నగరంలోకి నకిలీ కరెన్సీ వస్తోంది. విజయవాడ నుంచి నకిలీ రూ.2000 నోట్లు వస్తున్నట్టు తెలుస్తోంది. పాత నోట్ల మార్పిడికి కమీషన్‌పై కొత్త నోట్లు ఇస్తామని నమ్మబలుకుతూ స్థానికులను ముగ్గులోకి దించుతున్నారు. వీరి మాటలు నమ్మి ఇప్పటికే పలువురు ఈ ముఠా ఉచ్చులో చిక్కుకున్నారు. ఇందుకు తాజాగా జరిగిన సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. కరెన్సీ మార్పిడి విషయమై నగరానికి చెందిన ఓ వ్యాపారితో విజయవాడకు చెందిన ఏజెంట్ చర్చలు జరిపాడు. పాత రూ.500, రూ.1000 నోట్లు ఇస్తే కొత్త రూ.2000 నోట్లు ఇస్తానని నమ్మబలికాడు. దీంతో సదరు వ్యాపారి రూ.20 లక్షల రూపాయలు ఆ ఏజెంట్‌కు సమర్పించాడు. బదులుగా రూ.2000 నోట్లతో 15లక్షల రూపాయల నగదు అందింది. తన బ్లాక్‌మనీ వైట్‌గా మారిందనే సంతోషం ఆ వ్యాపారికి ఎంతో సేపు లేదు. కమీషన్ ఏజెంట్ అందించిన రూ.2000 నోట్లు పూర్తిగా నకిలీవి. కలర్ జిరాక్స్ ద్వారా కొత్త రూ.2000 నోట్లను పోలిన నకిలీ నోట్లు అందించినట్లు గ్రహించాడు. తాను మోసానికి గురైన విషయం ఎవరికీ చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్నాడు. ఈ విషయం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ముఠా వలలో ఇంకా పలువురు వ్యాపారులు చిక్కుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పెద్ద నోట్ల రద్దుతో వరంగల్ నగరంలో చాలా మంది వ్యాపారుల వద్ద పెద్ద మొత్తంలో నగదు పేరుకుపోరుుంది. బ్యాంకుల నుంచి మార్చుకుందామంటే ఐటీ శాఖ ఇబ్బందులు ఉండటంతో అడ్డదారులను ఆశ్రరుుస్తున్నారు. -
నోట్ల కోసం పడిగాపులు
► ఇంకా తెరుచుకోని ఏటీఎంలు ► సామాన్యులకు తప్పని అవస్థలు పళ్లిపట్టు: కేంద్ర ప్రభుత్వ పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో జనాలు ఒక్కసారిగా బ్యాంకులకు చేరుకుని తమ వద్ద ఉన్న నగదును (రూ.500,రూ.1000 నోట్లు)బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. ఈ క్రమంలో మూడో రోజూ ఖాతాదారులు బ్యాంకుల వద్ద బారులు తీరారు. గంటల తరబడి నిరీక్షించి తమఖాతాలో పెద్ద నోట్లను జమచేశారు. ఇదిలా ఉండగా శనివారం సైతం ఏటీఎం సేవలు అందుబాటులోకి రాకపోవడంతో సామాన్యులకు చిల్లర కష్టాలు తప్పలేదు. నిత్యావసర వస్తువుల కోనుగోలుకు సైతం ప్రజలు ఇబ్బందులు ఎదుక్కొంటున్నారు. పళ్లిపట్టు, పొదటూరుపేట, ఆర్కేపేట, అత్తిమాంజేరిపేట ప్రాంతాల్లోని బ్యాంకుల్లో శనివారం సైతం ఖాతాదారుల రద్దీ ఎక్కువగా కనిపించింది. కిక్కిరిసిన జనాలను అదుపు చేసేందుకు బ్యాంకు అధికారులు పోలీసుల సహాయం కోరారు. పోలీసులు పరిస్థితులను చక్కదిద్ది భారీ క్యూలైన్లు ఏర్పాటు చేసి పాత నోట్ల డిపాజిట్‌కు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టారు. ఖాతాదారులు దాదాపు మూడు గంటలు వేచి ఉండి తమ వద్ద ఉన్న పాత నోట్లను ఖాతాలో జమచేయడంతో పాటు రూ.4వేలు(కొత్త నోట్లు /రూ.100 నోట్లు) పొందారు. ఏటీఎంలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే మళ్లీ మూతపడడంతో సామాన్యులు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. పొదటూరుపేటలోని ఇండియన్ బ్యాంకు వద్ద వందలాది మంది మహిళలు డిపాజిట్ చేసేందుకు రావడంతో పోలీసులు ప్రత్యేక క్యూ పద్ధతి పాటించి బ్యాంకులోకి అనుమతించారు. బ్యాంకు సిబ్బంది పాత నోట్లు డిపాజిట్ చేసుకోవడంతో సరిపెడుతున్నారని కొత్త నోట్లు లేవని చేతులెత్తేస్తున్నట్లు వాపోయారు. తిరుత్తణిలోని అన్ని బ్యాంకుల్లో శనివారం ఖాతాదారుల సంఖ్య భారీగా కనిపించింది. పూర్తి స్థారుులో ఏటీఎంలు పనిచేయకపోవడంతో పాటు రూ.100, 500 అందుబాటులోకి రాకపోవడంతో సామాన్యుల పరిస్థితి అధ్వానంగా మారింది. -
నేటి నుంచి నోట్ల మార్పిడి
జిల్లాకు చేరిన కొత్త నోట్లు ఉదయం 10 నుంచి శ్రీకారం బ్యాంకుల ప్రత్యేక ఏర్పాట్లు ► చుక్కలు చూపించిన చిల్లర కొరత ► బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల మూత ► చేతులెత్తేసిన పెట్రోల్ బంకులు ► పెద్ద నోట్లను తిరస్కరించిన రిటైలర్లు, మెడికల్ షాపులు ► రూ.400కు పడిపోయిన రూ.500 విలువ ► జోరుగా సాగిన కమీషన్ వ్యాపారం ► నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. రియల్ వ్యాపారాలు ► చిరు వ్యాపారాలు వెలవెల.. మాల్స్ మాత్రం కళకళ ► రవాణా కార్యకలాపాలకూ అంతరాయం నర్సీపట్నం నుంచి పేషెంట్‌ను తీసుకొని కేజీహెచ్‌కు వచ్చాను. రూ.500 నోటు ఇస్తే బయటెక్కడా తీసుకోలేదు. ఉదయం నుంచీ టిఫిన్ చేయలేదు. భోజనం కూడా దొరికే పరిస్థితి లేదు.. ఓ వ్యక్తి ఆవేదన ఉదయం పాలకోసం వెళ్లాను.. కిరాణా షాపునకు వెళ్లాను.. చివరికి పెట్రోల్ బంకుకు వెళ్లాను.. చిల్లర లేదన్నారు.. రూ.500 మొత్తానికి పెట్రోల్ కొట్టించుకోమన్నారు... ఓ మెడికో ఆందోళన రూ.500 నోటుతో కేజీహెచ్‌కు వచ్చాను. ఎవరూ తీసుకోకపోవడంతో చివరికి రూ.500 నోటును రూ. 400తో మార్చుకున్నాను. వంద నష్టపోయాను... ఓ కార్పెంటర్ వ్యధ ప్రతి వాళ్లు పెద్ద నోట్లే తీసుకొస్తున్నారు.. మేం మాత్రం ఎక్కడి నుంచి చిల్లర నోట్లు తేగలం.. చిల్లర కొరతతో వ్యాపారాలు కోల్పోతున్నాం.. ఓ చిరు వ్యాపారి నిస్సహాయత.. ఇలా ఒకరేమిటి.. అన్ని వర్గాల ప్రజలు కరెన్సీ కల్లోలంలో చిక్కుకున్నారు. చిరు వ్యాపారాలు చిన్నబోయాయి. చిన్న, మధ్యతరగతి ప్రజలు చిల్లర కోసం చుక్కలు చూశారు. ఇదే అదనుగా కమీషన్ వ్యాపారులు విజృంభించారు. కాసుల పంట పండించుకున్నారు. నోట్ల మార్పిడి పేరుతో రూ.500 దగ్గర రూ.100 కమీషన్ గుంజుకున్నారు. సాధారణంగా మార్కెట్లలో వందకు 5 రూపాయలు కమీషన్‌తో చిల్లర వ్యాపారం చేసే వారు, కొందరు తెలివైన వ్యక్తులు చిల్లర సమస్యను అవకాశంగా తీసుకొని ఒక్కరోజులోనే వేల రూపాయలు గడించారు. బ్యాంకులు, ఏటీఎంలు మూతపడటం వల్ల జిల్లాలో సుమారు రూ.150 కోట్ల ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. ఇవి కాకుండా రిజిస్ట్రేషన్లు, రవాణా సేవలు, అనకాపల్లి బెల్లం మార్కెట్ లావాదేవీలు, బంగారం వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడింది.మందుల షాపులు, ఆస్పత్రులు, పెట్రోల్ బంకుల్లో 11వ తేదీ వరకు పెద్ద నోట్లు తీసుకుంటారని ప్రభుత్వం ప్రకటించినా వంద నోట్ల కొరత ఆ ప్రకటనను పరిహసించింది. చిల్లర లేదంటూ వినియోగదారులను చాలా చోట్ల తిప్పి పంపారు.టోల్గేట్ల వద్ద ఇదే చిల్లర సమస్యతో వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరాయి. శుక్రవారం వరకు టోల్ ఫీజు మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా టోల్‌ప్లాజాల నిర్వాహకులు దాన్ని అమలు చేయలేదు. మొత్తం మీద పెద్దనోట్ల రద్దు ప్రకంపనలు రేపితే.. చిల్లర కొరత కరెన్సీ కల్లోలం సృష్టించింది. విశాఖపట్నం : ‘ధనమేరా అన్నిటికి మూలం..ఆ ధనం విలువ తెలుసుకొనుట మానవ ధర్మం’ అన్నట్టుగా తయారైంది. నిన్నటి వరకు వంద రూపాయలకు విలువ లేదు.. కానీ ఆ వంద రూపాయలున్న వాడే గొప్పొడు ఇప్పుడు. వాడి చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. రూ.500, రూ.1000 చలామణి రద్దు నోట్ల కావడంతో వంద నోటు కోసం పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. పాల ప్యాకెట్ల నుంచి మొదలైన చిల్లర ఝంజాటం పొద్దుపోయే వరకు కొనసాగుతూనే ఉంది. తమ వద్దనున్న పెద్దనోట్లు మార్చుకునేందుకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మరో పక్క వీరి బలహీనతను ఆసరాగా చేసు కుని కమిషన్ వ్యాపారం జోరందుకుంది. స్తంభించిన లావాదేవీలు.. వెలవెలబోరుున మార్కెట్లు పెద్దనోట్ల రద్దు ప్రభావం అన్ని వర్గాలపై చూపుతోంది. దైనందిన కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కల్గించింది. వందనోట్ల కొరతతో వర్తక, వ్యాపార, వాణిజ్య రంగాలు ఒక్కసారిగా కుదేలయ్యారుు. కేంద్ర నిర్ణయంతో ఏటీఎంలు మూతపడ్డారుు. పోస్టాఫీసులు, బ్యాంకులు లావాదేవీలు నిలిచిపోయారుు. ఆన్లైన్ లావాదేవీలకు ఇబ్బంది లేకున్నప్పటికీ నగదు లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయారుు. బుధవారం జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు, పోస్టాఫీసులు మూతపడడంతో సుమారు రూ.150 కోట్ల్లకు పైగా లావాదేవీలు స్తంభించినట్టుగా చెబుతున్నారు. మరోపక్క పెద్ద షాపింగ్ మాల్స్, బంగారు దుకాణాల్లో సైతం నగదు ద్వారా కొనుగోళ్లు, అమ్మకాలు నిలిచినప్పటికి స్వైపింగ్ మిషన్ల ద్వారా లావాదేవీలు జరిగారుు. సినిమా హాళ్లు, హోటల్స్, చిరువ్యాపారాలు పూర్తిగా వెలవెలబోయారుు. సుమారు రూ.100 కోట్లకు పైగావ్యాపార లావాదేవీలు నిలిచిపోరుునట్టుగా చెబుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల పాట్లు పెట్రోల్ బంకులు, ఆస్పత్రులు, ఆర్టీసీ, రైల్వేస్టేషన్లు ప్రభుత్వ పాలబూత్ల్లో సైతం పెద్దనోట్లు చలామణి విషయంలో ప్రజలకు ఆయా వర్గాల వారికి మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నారుు. పెట్రోల్ బంకుల్లో పెద్ద నోట్లు తీసుకున్నప్పటికీ వాటికి సరపడా పెట్రోల్, డీజిల్ పోరుుంచుకోవాలే తప్ప చిల్లర ఇవ్వలేమని తెగేసి చెప్పడంతో ఘర్షణలు చోటుచేసుకున్నారుు. విశాఖ ఆర్టీసీ బస్టాండ్‌లో పెద్ద నోట్లు చెల్లుతాయని, అరుుతే చిల్లర మాత్రం ఇవ్వలేమని, టికెట్ వెనుక రాస్తాం...ఆ తర్వాత వచ్చి తీసుకోవాలని లౌడ్ స్పీకర్లలో ప్రకటించారు. ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్లలో సిబ్బంది, కండక్టర్లతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగడంతో గందర గోళం నెలకొంది. రైల్వే స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్లో ఇదే పరిస్థితి కన్పించింది. అక్కడ చిల్లర లేదని..సరిపడా సొమ్ములిస్తేనే టికెట్లు ఇస్తామని సిబ్బంది తెగేసి చెప్పడంతో ప్రయాణికుల పరిస్థితి అయోమయంగా తయారైంది. విజయవాడ వెళ్లే ప్రయాణి కులు ఐదొందల నోటు ఇచ్చి కనీసం చెన్నై వరకు టికెట్ ఇవ్వమన్నా చిల్లర ఇవ్వలేమని సిబ్బంది చెప్పడంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. చిల్లర ఇవ్వకపోవడంతో పెద్ద నోట్లు ఇవ్వలేక.. చాలా మంది ప్రయాణాలను రద్దు చేసుకుని వెనుదిరిగారు. జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయారుు. ఎక్కడా పెద్ద నోట్లు తీసు కోబోమని చెప్పడంతో క్రయ విక్రయదారులు రిజిస్ట్రేషన్లను వారుుదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎక్కడా పట్టుమని పది కూడా జరగలేదని రిజిస్ట్రేషన్ అధికారులే చెబుతున్నారు. ఎన్‌హెచ్-16పై అగనంపూడి, నక్కపల్లి వద్ద ఉన్న టోల్‌ప్లాజాల వద్ద చిల్లర కష్టాలు తప్పలేదు. టోల్ ప్లాజా సిబ్బంది పెద్దనోట్లు తీసుకునేందుకు నిరాకరించడంతో వందల సంఖ్యలో వాహనాలు గంటల తరబడి బారులుతీరి కన్పించారుు. చివరకు 11వ తేదీ అర్థరాత్రి వరకు ప్లాజాల్లో ఎలాంటి రుసుములు వసూలు చేయరని కేంద్రం ప్రకటించినప్పటికీ తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదనే సాకుతో సాయంత్రం వరకు వసూళ్లు కొనసాగించారు. పలు ప్రైవేటు ఆస్పత్రులతో పాటు కేజీహెచ్‌లో కూడా పెద్దనోట్లు అనుమతించక పోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దూరప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి బంధువులు చాలా ఇబ్బందులపడ్డారు. సెవెన్‌హిల్స్ వంటి కార్పొరేట్ ఆస్పత్రుల్లో పెద్దనోట్లను తీసుకోకపోవడంతో సిబ్బందికి రోగులకు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నారుు. మరో పక్క రూ.500కు రూ.300, రూ.1000 నోటుకు రూ.600 నుంచి రూ.700కు ఇచ్చే కమీషన్ వ్యాపారాలు జోరందుకున్నారుు. కొంత మంది బ్రోకర్లు రంగంలోకి దిగి కమీషన్ వ్యాపారం జోరుగా సాగించారు. బుధవారం ఒక్కరోజే ఈ రకంగా సుమారు కోట్లాది రూపాయలు చేతులు మారినట్టుగా చెబుతున్నారు.