Lack of retailers
-
దళారీ రాజ్యం..
నగర మార్కెట్లలో మోసపోతున్న కూరగాయల రైతులు చిల్లర కొరత..అధిక ఉత్పత్తి సాకుగా చూపి అడ్డంగా దోపిడీ తక్కువ ధరకు కొని.. రిటైల్‌లో డబుల్ రేట్లకు విక్రయిస్తున్న దళారీలు.. lదిగుబడి ఉన్నా అన్నదాతకు నష్టాలే.. నగర మార్కెట్లలో అన్నదాత నిలువునా దోపిడీకిగురవుతున్నాడు. వానలు బాగా కురిసి..పంటలు బాగా పండి..మంచి దిగుబడి చేతికొచ్చినా అటు రైతన్నకు సరైన ఫలితం దక్కడం లేదు. ఇటు వినియోగదారులకు తక్కువ ధరలకు కూరగాయలు లభించడం లేదు. దీనికి కారణం దళారుల మాయాజాలమే. నోట్ల రద్దు..చిల్లర కొరతను సాకుగా చూపి మధ్య దళారులు రైతుల వద్ద అతి తక్కువ ధరకే కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. వీటిని రిటైల్ మార్కెట్లలో మాత్రం రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో దిగుబడి పెరిగినా ఫలితం దక్కక అన్నదాత..చిల్లర కొరతతో అధిక ధరలకు కూరగాయలు కొనలేక వినియోగదారులు అల్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు మిన్నకుండిపోతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: ఈ ఏడాది కూరగాయల ఉత్పత్తి భారీగా పెరగడంతో ధరలు తగ్గుతాయనుకున్న గ్రేటర్ వాసుల ఆశలపై దళారులు నీళ్లు చల్లుతున్నారు. అలాగే అధిక దిగుబడి వచ్చినందున లాభాలు బాగానే వస్తాయనుకున్న రైతులూ నిరాశ చెందుతున్నారు. నగరంలోని పలు మార్కెట్లలో మధ్య దళారులు పాగా వేసి చిల్లర కొరతను బూచీగా చూపి రైతులను దోచుకోవడంతోపాటు..వినియోగదారుల జేబులు గుల్ల చేస్తుండడం గమనార్హం. ఉత్పత్తి అనూహ్యంగా పెరగడంతో అన్నదాతల నుంచి తక్కువ ధరలకు కూరగాయలను కొనుగోలుచేసి మార్కెట్లో మాత్రం రెట్టింపు ధరలకు విక్రయిస్తుండడం పట్ల విమర్శలు వస్తున్నాయి. రైతన్నకు కుడి, ఎడమల దగా... ఆరుగాలం శ్రమించి కూరగాయలు పండించిన రైతన్నలు మార్కెట్లలో నిలువునా దోపిడీకి గురవుతున్నారు. కనీసం గిట్టుబాట ధర కూడా రాకపోవడంతో వచ్చినకాడికి అమ్మేసుకుంటున్నారు. ఉత్పత్తి పెరిగిందన్న సాకు, నోట్ల రద్దు ప్రభావంతో ఏర్పడిన చిల్లర కొరత కారణాలు చూపుతూ దళారులు, మధ్యవర్తులు రేట్లు తగ్గించి మరీ కొనుగోలు చేస్తున్నారు. అయితే వీరు ఇవే కూరగాయలను రిటైల్ మార్కెట్లో రెండింతలు, మూడింతలకు అమ్ముతూ లాభపడుతున్నారు. కూరగాయల రేట్లు తగ్గిన ఫలాలు వినియోగదారుడికి కూడా అందలేదు. రైతన్నలు, వినియోగదారులు మోసపోతుండగా, దళారులు, మధ్యవర్తులు మాత్రం లాభాల గడించేస్తున్నారు. దీనికి కొంత మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా సహకరిస్తుండటంతో వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. కూరగాయల ధరలపై నోట్ల రద్దు ప్రభావం... సిటీలో నిత్యవసరమయ్యే కూరగాయల ధరలపై నోట్ల రద్దు ప్రభావం భారీగానే కనిపించింది. రైతన్నలు తాము పండించిన పంటలను మార్కెట్‌కి తీసుకెళ్లేందుకు రవాణా, ఇతరత్రా ఖర్చులకు డబ్బులు లేక..వారి వద్దకే వచ్చిన మధ్యవర్తులకు ఎంతో కొంతకు విక్రయించారు. కొందరి వద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అనుకూలంగా మలుచుకున్న దళారులు, వ్యాపారులు ‘మేం రేటు ఇంతే ఇస్తాం. లేదంటే తీసుకెళ్లండి అంటూ కొర్రీలు పెట్టడం’తో చేసేదేమీ లేక ఇచ్చి వెళ్లినవారూ ఉన్నారు. గిట్టుబాటు కాక చాలా మంది ఉల్లిగడ్డ రైతులు తాము తెచ్చిన సరుకును మలక్‌పేటలోని వ్యవసాయ మార్కెట్లోని రోడ్లపై పడేసి వెళ్లిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. వాటిని నిల్వ చేసేందుకు అధికారులు కోల్డ్ స్టోరేజీలు కూడా అందుబాటులోకి తీసుకరాకపోవడంతో దళారుల పంట పండింది. ఉత్పత్తి పెరిగింది.. నగర శివారు ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాల నుంచి నగరానికి టమాటా, వంకాయ, బెండకాయ, సొరకాయ, బీరకాయ ఇలా నిత్యం అవసరమయ్యే కూరగాయలన్నీ వస్తుంటాయి. ప్రస్తుతం నల్గొండ, ఖమ్మం, వరంగల్, వికారాబాద్, మెదక్, అనంతపురం, చిత్తూరు, తాండూరు జిల్లాల నుంచి కూరగాయలు, ఆగ్రా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా నుంచి ఆలుగడ్డలు బోయిన్పల్లి, గుడిమల్కాపూర్ మార్కెట్లకు తరలివస్తున్నాయి. అయితే కోటి జనాభా వున్న నగరానికి ప్రతిరోజు దాదాపు 35 లక్షల కిలోల కూరగాయలు అవసరం. అయితే హోల్‌సేల్ మార్కెట్లకు 25 లక్షల కిలోల కూరగాయలు వస్తున్నాయి. వేసవికాలంలో పది లక్షల కిలోల వరకు కూరగాయల కొరత నగరాన్ని పీడించిందని, ఇప్పుడు ఆ స్థాయి ఇబ్బంది లేదని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది నవంబర్‌తో పోల్చుకుంటే ఈ ఏడాది కూరగాయల ధరలు తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ..ఆ ఫలితం వినియోగదారులకు దక్కడంలేదని విశ్లేషిస్తున్నారు. -
సదా చిల్లర...
చిల్లర కొరతతో ‘వెరుు్య’పాట్లు రూ. వంద కోసం గంటల పాటు పెట్రోలు బంకులో ఎదురుచూపులు 40 శాత ం తగ్గిన హోటళ్ల వ్యాపారం టోల్గేట్ల వద్ద కిలో మీటర్ల మేర నిలిచిన వాహనాలు కలబుర్గిలో రూ.500 తీసుకుని రూ.400 ఇచ్చిన వైనం సొమ్మును బంగారంలోకి మార్చుకోవడానికి పరుగులు బెంగళూరు: పెద్దనోట్ల రద్దుతో చిల్లర కొరత ఏర్పడి మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోజువారి పనులను వదులుకుని చిల్లర నోట్ల కోసం పెట్రోలు బంకులు, కమిషన్ ఏజెంట్లు, హోటల్స్ వద్ద క్యూలు కట్టారు. మరికొంతమంది అవసరం లేకపోరుునా బంగారు నాణేలు, ఆభరణాలను కొనడానికి ఎగబడ్డారు. మరోవైపు కిందిస్థారుు ప్రభుత్వ సిబ్బందికి సరైన సమాచారం లేకపోవడంతో బీఎంటీసీ ప్రయాణికులతో గొడవలకు దిగిన సంఘటనలు కూడా బెంగళూరు, మంగళూరుతో సహా పాటు కర్ణాటక వ్యాప్తంగా చోటు చేసుకున్నారుు. నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజా నిర్ణయాన్ని చాలా మంది స్వాగతించినా తాత్కాలిక ఇబ్బందులను ఎలా ఎదుర్కొవాలో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి తమ వద్ద ఉన్న నోట్లను డిపాజిట్ మిషన్ల ద్వారా డిపాజిట్ చేయడానికి కొంతమంది ప్రయత్నించగా మరికొంతమంది రోజువారి ఖర్చుల కోసం డబ్బు తీసుకోవడానికి ఏటీఎంల వద్ద బారులు తీరారు. మంగళూరు వద్ద చాలా మంది వినియోగదారులు తమ వద్ద ఉన్న సొమ్ముతో బంగారు నాణేలు, ఆభరణాలు కొనుగోలు చేయడం కోసం జ్యువెలరీ షాపుల వద్దకు పరిగెత్తారు. కొంతమంది సొమ్మును అడ్మాన్సగా ఇచ్చి బంగారాన్ని బుధ, గురు లేదా మరోవారం తర్వాతనైనా అందించాల్సిందిగా దుకాణం యజమానులకు చెప్పడం కనిపించింది. ఇక బుధవారం ఉదయం నుంచే బెంగళూరుతో పాటు రాష్ట్రంలో పలు నగరాలకు, పట్టణాలకు కాయగూరలు, పూలు, పండ్లను రవాణా చేసే కే.ఆర్.మార్కెట్, రస్సెల్మార్కెట్, మల్లేశ్వరం, మడివాళ మార్కెట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డారుు. అటు వినియోగదారులు తమ వద్ద ఉన్న సొమ్మును మార్పిడి చేసుకోవడానికి ప్రయత్నించగా వ్యాపారస్తులు తీసుకోలేదు. అంతేకాకుండా వేర్వేరు రాష్ట్రాల నుంచి సరుకును తీసుకుని ఆయా మార్కెట్లకు చేరుకున్న రైతులు, దళారులు కూడా మార్కెట్లోని వ్యాపారస్తుల నుంచి సొమ్ములు తీసుకోవడానికి వెనుకడుగు వేయడం కనిపించింది. వందకోసం రెండు గంటలు... చాలా మంది తమ వద్ద ఉన్న ఐదు వందలు, వెరుు్య నోట్లను మార్చుకోవడం కోసం పెట్రోలు బంకుల వద్ద క్యూ కట్టడంతో చిల్లర సమస్య ఏర్పడింది. నగరంలోని ఓ బంకు సిబ్బంది బెత్లహాం అనే వ్యక్తి వద్ద రూ.ఐదు వందలు తీసుకుని రూ.వందకు పెట్రోలు పోసి మిగిలిన రూ. నాలుగు వందల కోసం క్యూలో నిలబెట్టారు. వినియోగదారుల నుంచి నాలుగు వంద నోట్లు వచ్చిన తర్వాత సదరు నోట్లను తనకు ఇస్తామని చెప్పినట్లు బెత్లహాం సాక్షితో పేర్కొన్నారు. దాదాపు రెండు గంటలు ఇలా నిలబడ్డానని సదరు నోట్లు మరో రెండు రోజులు కుటుంబ ఖర్చులకు ఉపయోగపడుతాయని అందవల్ల విధిలేక ఇలా నిలబడాల్సి వచ్చిందని వాపోయారు. ఇలాంటి ఇబ్బందులు చాలా చోట్ల కనిపించారుు. ⇒ కొన్ని హోటల్స్‌లలో రూ.500, రూ.1000లకు చిల్లరు లేదు అని బోర్డు పెట్టడంతో వినియోగదాలు వెనక్కు వెళ్లారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హోటల్ వ్యాపారం 30 నుంచి 40 శాతం తగ్గిపోరుుందని రాష్ట్ర హోటల్ యామజామాన్య సంఘం సభ్యుడు ఒకరు పేర్కొన్నారు. ⇒ కలబుర్గిలో కొంతమంది బృందంగా ఏర్పడి ఐదు వందలు తీసుకుని నాలుగు వందల రుపాయాలు ఇచ్చారు. వంద తక్కువైనా పర్వాలేదు రెండు రోజులు ఖర్చులకు సరిపోతాయన్న ఉద్దేశంతో చాలా మంది సదురు నోట్లను తీసుకోవడం కోసం ఎగబడ్డారు. ⇒ రైల్వే, బస్స్టేషన్లలో నోట్ల వినిమయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అరుుతే బస్సుల్లో ప్రయాణించే సమయంలో ఈ నోట్ల వినిమయం ఎలా అన్న విషయంపై స్పష్టత లేదు. దీంతో కండక్టర్ రూ.500 నోట్లను తీసుకోకపోవడంతో చాలా చోట్ల ప్రయాణికులకు, బస్సు సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి విధిలేక చాలా మంది ప్రయాణికులు బస్సుల నుంచి మధ్యలోనే దిగిపోయారు. ⇒ మంగళూరుకు చెందిన సత్యనారాయణ హీరేమఠ్ అనే వ్యక్తి వారం రోజుల్లో తన కుమార్తె పెళ్లి కోసం రూ. రెండు లక్షలు అప్పుగా తీసుకున్నారు. అన్నీ రూ.500, రూ.1000 నోట్లే. ఈ నోట్లు బుధవారం నుంచి చలామణిలో లేవు. పోనీ ఈ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసి నూతన నోట్లను తీసుకుందామంటే.. రోజుకు రూ.10వేలు, వారానికి రూ.20వేలు మాత్రమే విత్‌డ్రాయల్ చేయడానికి అవకాశం ఉంది. అరుుతే పెళ్లికి అవసరమైన వస్తువులు కొనడానికి డబ్బు ఎలా సర్ధుబాటు చేయాలో తెలియడంల లేదని సత్యనారాయణ హీరేమఠ్ వాపోతున్నారు. ⇒ అత్తిబెలే, నైస్‌రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, తుమకూరు రోడ్డు వద్ద టోల్గేట్ వద్ద వాహనదారులు ఇచ్చిన రూ.500, రూ.1,000 నోట్లను సిబ్బంది తీసుకోకపోవడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయారుు. ⇒ కొంతమంది తమ వద్ద ఉన్న ఐదు వందలకు చిల్లర కోసం యాచకుల వెంట పడ్డారు. ఈ ఘటనలు ఎక్కువగా బెంగళూరులోని ఎంజీరోడ్, కోరమంగళ వద్ద కనిపించారుు. సిగ్నల్స్ వద్ద యాచించే హిజ్రాల వద్ద కూడా రూ. ఐదు వందలు ఇచ్చి రూ. నాలుగు వందలు తీసుకోవడం కనిపించింది. ⇒ మరోవైపు బీదర్‌లో కొంతమంది ఐదు వందల నోటును గాడిదకు తినిపిస్తూ ప్రభుత్వ నిర్ణయం పట్ల తమ నిరసనను వ్యక్తం చేశారు. మొదట బ్యాంకులో డిపాజిట్ చేయండి ప్రభుత్వ నిర్ణయం వల్ల నల్లధనానికి అడ్డుకట్టుపడుతుందనడంలో సందేహం లేదు. అరుుతే దీని వల్ల గరిష్టంగా రెండు నెలల పాటు అన్ని రంగాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాథమికంగా అవగాహన చేసుకుని గరిష్టంగా రూ.రెండు కోట్ల నగదు (లిక్విడ్ అమౌంట్) ఉన్నవారికి ఒక సూచన. వంశపార్యంపర్యం కాని స్థిరాస్తుల అమ్మడం వల్ల వచ్చిన నగదు ఇంట్లో ఉంటే బ్యాంకులో డిపాజింట్ చేయడం మంచి నిర్ణయం. ఇందుకు డిసెంబర్ 30 వరకూ అవకాశం ఉంది. అటు పై సర్టిఫైడ్ చార్టెడ్ అకౌంట్ సలహాలు తీసుకుని అవసరమైన పన్నులు చెల్లిస్తే డిపాజిట్ చేసిన సొమ్ములో కొంత వరకూ అరుునా దక్కించుకోవడానికి సాధ్యమవుతుంది. - రాజేష్భట్, ఛార్టెడ్అకౌంట్ -
నేటి నుంచి నోట్ల మార్పిడి
జిల్లాకు చేరిన కొత్త నోట్లు ఉదయం 10 నుంచి శ్రీకారం బ్యాంకుల ప్రత్యేక ఏర్పాట్లు ► చుక్కలు చూపించిన చిల్లర కొరత ► బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల మూత ► చేతులెత్తేసిన పెట్రోల్ బంకులు ► పెద్ద నోట్లను తిరస్కరించిన రిటైలర్లు, మెడికల్ షాపులు ► రూ.400కు పడిపోయిన రూ.500 విలువ ► జోరుగా సాగిన కమీషన్ వ్యాపారం ► నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. రియల్ వ్యాపారాలు ► చిరు వ్యాపారాలు వెలవెల.. మాల్స్ మాత్రం కళకళ ► రవాణా కార్యకలాపాలకూ అంతరాయం నర్సీపట్నం నుంచి పేషెంట్‌ను తీసుకొని కేజీహెచ్‌కు వచ్చాను. రూ.500 నోటు ఇస్తే బయటెక్కడా తీసుకోలేదు. ఉదయం నుంచీ టిఫిన్ చేయలేదు. భోజనం కూడా దొరికే పరిస్థితి లేదు.. ఓ వ్యక్తి ఆవేదన ఉదయం పాలకోసం వెళ్లాను.. కిరాణా షాపునకు వెళ్లాను.. చివరికి పెట్రోల్ బంకుకు వెళ్లాను.. చిల్లర లేదన్నారు.. రూ.500 మొత్తానికి పెట్రోల్ కొట్టించుకోమన్నారు... ఓ మెడికో ఆందోళన రూ.500 నోటుతో కేజీహెచ్‌కు వచ్చాను. ఎవరూ తీసుకోకపోవడంతో చివరికి రూ.500 నోటును రూ. 400తో మార్చుకున్నాను. వంద నష్టపోయాను... ఓ కార్పెంటర్ వ్యధ ప్రతి వాళ్లు పెద్ద నోట్లే తీసుకొస్తున్నారు.. మేం మాత్రం ఎక్కడి నుంచి చిల్లర నోట్లు తేగలం.. చిల్లర కొరతతో వ్యాపారాలు కోల్పోతున్నాం.. ఓ చిరు వ్యాపారి నిస్సహాయత.. ఇలా ఒకరేమిటి.. అన్ని వర్గాల ప్రజలు కరెన్సీ కల్లోలంలో చిక్కుకున్నారు. చిరు వ్యాపారాలు చిన్నబోయాయి. చిన్న, మధ్యతరగతి ప్రజలు చిల్లర కోసం చుక్కలు చూశారు. ఇదే అదనుగా కమీషన్ వ్యాపారులు విజృంభించారు. కాసుల పంట పండించుకున్నారు. నోట్ల మార్పిడి పేరుతో రూ.500 దగ్గర రూ.100 కమీషన్ గుంజుకున్నారు. సాధారణంగా మార్కెట్లలో వందకు 5 రూపాయలు కమీషన్‌తో చిల్లర వ్యాపారం చేసే వారు, కొందరు తెలివైన వ్యక్తులు చిల్లర సమస్యను అవకాశంగా తీసుకొని ఒక్కరోజులోనే వేల రూపాయలు గడించారు. బ్యాంకులు, ఏటీఎంలు మూతపడటం వల్ల జిల్లాలో సుమారు రూ.150 కోట్ల ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. ఇవి కాకుండా రిజిస్ట్రేషన్లు, రవాణా సేవలు, అనకాపల్లి బెల్లం మార్కెట్ లావాదేవీలు, బంగారం వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడింది.మందుల షాపులు, ఆస్పత్రులు, పెట్రోల్ బంకుల్లో 11వ తేదీ వరకు పెద్ద నోట్లు తీసుకుంటారని ప్రభుత్వం ప్రకటించినా వంద నోట్ల కొరత ఆ ప్రకటనను పరిహసించింది. చిల్లర లేదంటూ వినియోగదారులను చాలా చోట్ల తిప్పి పంపారు.టోల్గేట్ల వద్ద ఇదే చిల్లర సమస్యతో వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరాయి. శుక్రవారం వరకు టోల్ ఫీజు మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా టోల్‌ప్లాజాల నిర్వాహకులు దాన్ని అమలు చేయలేదు. మొత్తం మీద పెద్దనోట్ల రద్దు ప్రకంపనలు రేపితే.. చిల్లర కొరత కరెన్సీ కల్లోలం సృష్టించింది. విశాఖపట్నం : ‘ధనమేరా అన్నిటికి మూలం..ఆ ధనం విలువ తెలుసుకొనుట మానవ ధర్మం’ అన్నట్టుగా తయారైంది. నిన్నటి వరకు వంద రూపాయలకు విలువ లేదు.. కానీ ఆ వంద రూపాయలున్న వాడే గొప్పొడు ఇప్పుడు. వాడి చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. రూ.500, రూ.1000 చలామణి రద్దు నోట్ల కావడంతో వంద నోటు కోసం పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. పాల ప్యాకెట్ల నుంచి మొదలైన చిల్లర ఝంజాటం పొద్దుపోయే వరకు కొనసాగుతూనే ఉంది. తమ వద్దనున్న పెద్దనోట్లు మార్చుకునేందుకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మరో పక్క వీరి బలహీనతను ఆసరాగా చేసు కుని కమిషన్ వ్యాపారం జోరందుకుంది. స్తంభించిన లావాదేవీలు.. వెలవెలబోరుున మార్కెట్లు పెద్దనోట్ల రద్దు ప్రభావం అన్ని వర్గాలపై చూపుతోంది. దైనందిన కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కల్గించింది. వందనోట్ల కొరతతో వర్తక, వ్యాపార, వాణిజ్య రంగాలు ఒక్కసారిగా కుదేలయ్యారుు. కేంద్ర నిర్ణయంతో ఏటీఎంలు మూతపడ్డారుు. పోస్టాఫీసులు, బ్యాంకులు లావాదేవీలు నిలిచిపోయారుు. ఆన్లైన్ లావాదేవీలకు ఇబ్బంది లేకున్నప్పటికీ నగదు లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయారుు. బుధవారం జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు, పోస్టాఫీసులు మూతపడడంతో సుమారు రూ.150 కోట్ల్లకు పైగా లావాదేవీలు స్తంభించినట్టుగా చెబుతున్నారు. మరోపక్క పెద్ద షాపింగ్ మాల్స్, బంగారు దుకాణాల్లో సైతం నగదు ద్వారా కొనుగోళ్లు, అమ్మకాలు నిలిచినప్పటికి స్వైపింగ్ మిషన్ల ద్వారా లావాదేవీలు జరిగారుు. సినిమా హాళ్లు, హోటల్స్, చిరువ్యాపారాలు పూర్తిగా వెలవెలబోయారుు. సుమారు రూ.100 కోట్లకు పైగావ్యాపార లావాదేవీలు నిలిచిపోరుునట్టుగా చెబుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల పాట్లు పెట్రోల్ బంకులు, ఆస్పత్రులు, ఆర్టీసీ, రైల్వేస్టేషన్లు ప్రభుత్వ పాలబూత్ల్లో సైతం పెద్దనోట్లు చలామణి విషయంలో ప్రజలకు ఆయా వర్గాల వారికి మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నారుు. పెట్రోల్ బంకుల్లో పెద్ద నోట్లు తీసుకున్నప్పటికీ వాటికి సరపడా పెట్రోల్, డీజిల్ పోరుుంచుకోవాలే తప్ప చిల్లర ఇవ్వలేమని తెగేసి చెప్పడంతో ఘర్షణలు చోటుచేసుకున్నారుు. విశాఖ ఆర్టీసీ బస్టాండ్‌లో పెద్ద నోట్లు చెల్లుతాయని, అరుుతే చిల్లర మాత్రం ఇవ్వలేమని, టికెట్ వెనుక రాస్తాం...ఆ తర్వాత వచ్చి తీసుకోవాలని లౌడ్ స్పీకర్లలో ప్రకటించారు. ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్లలో సిబ్బంది, కండక్టర్లతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగడంతో గందర గోళం నెలకొంది. రైల్వే స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్లో ఇదే పరిస్థితి కన్పించింది. అక్కడ చిల్లర లేదని..సరిపడా సొమ్ములిస్తేనే టికెట్లు ఇస్తామని సిబ్బంది తెగేసి చెప్పడంతో ప్రయాణికుల పరిస్థితి అయోమయంగా తయారైంది. విజయవాడ వెళ్లే ప్రయాణి కులు ఐదొందల నోటు ఇచ్చి కనీసం చెన్నై వరకు టికెట్ ఇవ్వమన్నా చిల్లర ఇవ్వలేమని సిబ్బంది చెప్పడంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. చిల్లర ఇవ్వకపోవడంతో పెద్ద నోట్లు ఇవ్వలేక.. చాలా మంది ప్రయాణాలను రద్దు చేసుకుని వెనుదిరిగారు. జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయారుు. ఎక్కడా పెద్ద నోట్లు తీసు కోబోమని చెప్పడంతో క్రయ విక్రయదారులు రిజిస్ట్రేషన్లను వారుుదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎక్కడా పట్టుమని పది కూడా జరగలేదని రిజిస్ట్రేషన్ అధికారులే చెబుతున్నారు. ఎన్‌హెచ్-16పై అగనంపూడి, నక్కపల్లి వద్ద ఉన్న టోల్‌ప్లాజాల వద్ద చిల్లర కష్టాలు తప్పలేదు. టోల్ ప్లాజా సిబ్బంది పెద్దనోట్లు తీసుకునేందుకు నిరాకరించడంతో వందల సంఖ్యలో వాహనాలు గంటల తరబడి బారులుతీరి కన్పించారుు. చివరకు 11వ తేదీ అర్థరాత్రి వరకు ప్లాజాల్లో ఎలాంటి రుసుములు వసూలు చేయరని కేంద్రం ప్రకటించినప్పటికీ తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదనే సాకుతో సాయంత్రం వరకు వసూళ్లు కొనసాగించారు. పలు ప్రైవేటు ఆస్పత్రులతో పాటు కేజీహెచ్‌లో కూడా పెద్దనోట్లు అనుమతించక పోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దూరప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి బంధువులు చాలా ఇబ్బందులపడ్డారు. సెవెన్‌హిల్స్ వంటి కార్పొరేట్ ఆస్పత్రుల్లో పెద్దనోట్లను తీసుకోకపోవడంతో సిబ్బందికి రోగులకు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నారుు. మరో పక్క రూ.500కు రూ.300, రూ.1000 నోటుకు రూ.600 నుంచి రూ.700కు ఇచ్చే కమీషన్ వ్యాపారాలు జోరందుకున్నారుు. కొంత మంది బ్రోకర్లు రంగంలోకి దిగి కమీషన్ వ్యాపారం జోరుగా సాగించారు. బుధవారం ఒక్కరోజే ఈ రకంగా సుమారు కోట్లాది రూపాయలు చేతులు మారినట్టుగా చెబుతున్నారు.