Sahakar Group Limited (SGL): దేశంలో రోడ్డు వ్యవస్థ మునుపటి కంటే మెరుగుపడింది. హైవేలు, అండర్ పాస్, ఫ్లైఓవర్ వంటి మార్గాలు ఎక్కువయ్యాయి, తద్వారా ప్రయాణం కూడా ఇప్పుడు సులభతరం అయిపోయింది. అయితే ఇప్పుడు ఏ ప్రధాన రహదారి ఎక్కినా ఎక్కడికక్కడ టోల్ ప్లాజాలు ఎదురవుతూనే ఉంటాయి. టోల్ ప్లాజా దాటాలంటే కచ్చితంగా టోల్ పీజు చెలించాల్సి ఉంటుంది. మనదేశంలో ఎక్కువ టోల్ ప్లాజాలు కలిగిన సంస్థ ఏది? దాని ఆదాయం ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశంలో అత్యధిక టోల్ ప్లాజాలు తమ అధీనంలో ఉంచుకున్న అగ్రగామి సంస్థ 'సహకార్ గ్రూప్ లిమిటెడ్' (SGL). దేశవ్యాప్తంగా సుమారు 13 రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకుంటున్న ఈ కంపెనీ 200 కంటే ఎక్కువ టోల్ ప్లాజాలను తమ పరిధిలో ఉంచుకుంది.
1996లో 'కిషోర్ అగర్వాల్' స్థాపించిన సహకార్ గ్రూప్ లిమిటెడ్, అతి తక్కువ కాలంలోనే మంచి పురోగతిని సాధించింది. 2011 - 12 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 30 కోట్లు కాగా.. 2022 - 23 నాటికి రూ. 2700 కోట్లు కంటే ఎక్కువ ఆదాయం పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే టోల్ ప్లాజా రంగంలో ఎంత అభివృద్ధి సాదించించనే విషయం ఇట్టే అర్థమైపోతుంది.
సహకార్ గ్రూప్ లిమిటెడ్ కంపెనీ స్వంత కంప్యూటరైజ్డ్ సిస్టమ్‌లను, స్వంత యాజమాన్య కంప్యూటరైజ్డ్ టోల్ రెవెన్యూ ఆడిటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడంతో సహా టోల్‌లను వసూలు చేయడానికి అప్పటికప్పుడు కొత్త విధానాలు అలవరిస్తోంది.
1996 సమయంలో ఈ సంస్థ కేవలం ముంబై చుట్టూ ఉన్న మున్సిపల్ కౌన్సిల్‌ల కోసం ఆక్ట్రాయ్ సేకరణతో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తరువాత మహారాష్ట్ర రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్‌లకు క్రమంగా విస్తరించింది. ప్రస్తుతం దేశంలో ఎక్కువ టోల్ ప్లాజాలు కలిగిన సంస్థగా అవతరించింది.
ఇదీ చదవండి: మరింత తగ్గిన బంగారం, వెండి - నేటి కొత్త ధరలు ఇవే..
సహకార్ గ్రూప్ లిమిటెడ్ సంస్థలో సుమారు 4000 కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతే కాకుండా టోల్ ప్లాజాల సంఖ్య కూడా తప్పకుండా పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment