మార్చి నాటికల్లా టోల్‌ ప్లాజాలుండవ్‌! | GPS-Based Toll Collection System to Replace Toll Plazas in India by March 2023 - Sakshi
Sakshi News home page

మార్చి నాటికల్లా టోల్‌ ప్లాజాలుండవ్‌!

Published Thu, Dec 21 2023 8:43 AM | Last Updated on Thu, Dec 21 2023 9:48 AM

GPS Based Toll Collection System to Replace Toll Plazasin India by March 2023 - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నాటికల్లా ప్రస్తుత హైవే టోల్‌ ప్లాజాల స్థానంలో ప్రభుత్వం కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టనుంది. జీపీఎస్‌ ఆధారిత టోల్‌ కలెక్షన్‌ సిస్టమ్‌ మొదలైనవి వీటిలో ఉండనున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ విషయాలు తెలిపారు.

వాహనాలను ఆపకుండా ఆటోమేటిక్‌గా టోల్‌ వసూళ్లకు ఉపయోగపడే ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌కు సంబంధించి తమ శాఖ రెండు పైలట్‌ ప్రాజెక్టులను నిర్వహించినట్లు వివరించారు. 2018–19లో టోల్‌ ప్లాజాల దగ్గర నిరీక్షించే సమయం సగటున 8 నిమిషాలుగా ఉండగా.. 2020–21లో ఫాస్ట్‌ట్యాగ్‌లను ప్రవేశపెట్టిన తర్వాత క్రమంగా 47 సెకన్లకు తగ్గింది.

దీంతో చాలా ప్రాంతాల్లో నిరీక్షణ సమయం తగ్గినప్పటికీ జనాభా ఎక్కువ ఉన్న నగరాలకు దగ్గర్లో పీక్‌ అవర్స్‌లో ఇప్పటికీ కొంత ఎక్కువగా నిరీక్షించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త సాంకేతికతల పరిశీలన ప్రాధాన్యం సంతరించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement