తగ్గిన తుఫ్రాన్ టోల్గేట్ ఛార్జీలు | NHAI Orders issued on toopran toll gate charges decrease | Sakshi
Sakshi News home page

తగ్గిన తుఫ్రాన్ టోల్గేట్ ఛార్జీలు

Published Wed, Jan 13 2016 5:26 PM | Last Updated on Tue, Aug 28 2018 3:57 PM

NHAI Orders issued on toopran toll gate charges decrease

హైదరాబాద్ : మెదక్ జిల్లా తుఫ్రాన్ (మనోహరాబాద్) టోల్గేట్ వద్ద వసూలు చేస్తున్న ఛార్జీలను తగ్గిస్తూ నేషనల్ హైవే అథారటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టోల్గేట్ వద్ద వాహనాల నుంచి ఇకపై ఒకసారి వెళ్లడానికి రూ. 70 వసూలు చేస్తారని ... అలాగే వాహనానికి రాను పోను ఛార్జీ అయితే రూ. 105 వసూలు చేస్తారని ఎన్హెచ్ఏఐ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే ఈ టోల్గేట్ వద్ద ఇప్పటి వరకు కారు, జీపు, వ్యాను, ఇతర లైట్ మోటర్ వాహనాలు ఒకసారి వెళ్లడానికి రూ. 125... అలాగే రానుపోనుకూ రూ. 180 వసూలు చేస్తున్నారు. దీంతో తక్కువ దూరం ప్రయాణించే స్థానికులకు చాలా వ్యయం అవుతుంది. దీంతో ఈ అంశాన్ని స్థానిక టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు.

దాంతో ఈ అంశంపై కేసీఆర్...  నేషనల్ హైవే అథారటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో చర్చించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉన్నతాధికారులు ఛార్జీలు తగ్గిస్తూ... ఉత్తర్వులు జారీ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement