
ఇప్పటికే పెరుగుతున్న ఇంధన ధరలతో సతమతమవుతున్న వాహనదారులకు మరో షాకింగ్ న్యూస్...! ఏప్రిల్ 1 నుంచి హైవే రోడ్లపై ప్రయాణం మరింత ఖరీదైనది మారనున్నట్లు సమాచారం.
భారీగా పెరగనున్న టోల్ ఛార్జీలు..!
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను 65 శాతం పెంచనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి . హైవేలపై తిరిగే అన్ని రకాల వాహనాల టోల్ ఛార్జీలను ఎన్‌హెచ్‌ఏఐ సవరించినట్లుగా తెలుస్తోంది. ధరల పెంపుతో ఇప్పుడు వాణిజ్య వాహనాలు టోల్ ట్యాక్స్ కోసం అదనంగా రూ. 65 చెల్లించాల్సి ఉండనుంది. కాగా ప్రైవేట్ వాహనాల వన్-వే ప్రయాణం కోసం అదనంగా రూ. 10 చెల్లించాల్సి ఉంటుంది. సవరించిన ధరలు మార్చి 31 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
చదవండి: కాసుల వర్షం కురిపిస్తోన్న హైదరాబాద్ కంపెనీ..! ఒక లక్షకు రూ. 3 కోట్ల లాభం..!
Comments
Please login to add a commentAdd a comment