
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఆమె అనుచరులు రెచ్చిపోయారు. జిల్లాలోని రేణికుంట టోల్‌గేట్‌లో మంగళవారం చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ వీరంగం సృష్టించారు. టోల్‌గేట్‌లో వద్ద ఎమ్మెల్యే అనుచరుల వాహనాలను టోల్ సిబ్బంది ఆపారు. దీంతో తమ అనుచరుల వాహనాలు ఎందుకు ఆపారని.. వీఐపీగా గుర్తించరా అని సదరు ఎమ్మెల్యే చిందులు వేశారు.
తమ డ్యూటీ తాము చేస్తున్నామని టోల్ సిబ్బంది చెప్పినా శోభ వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడికి యత్నించారు. ఎమ్మెల్యే అనుసరించిన తీరును టోల్ సిబ్బంది ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా వారిని కొట్టి ఫోన్‌ను లాక్కెళ్లారు. ఈ ఘటనపై టోల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment