bodige shobha
-
మేం వచ్చాక యూనిఫారాలు ఊడదీయిస్తాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సైదాబాద్: టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసుల యూనిఫారాలను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఊడదీయిస్తామని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి భగవంత్ ఖుబా హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ, 317 జీవోకు సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. అంతకుముందు కరీంనగర్ జైల్లో ఉన్న సంజయ్‌ని ములాఖత్ ద్వారా కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ టీఆర్ఎస్ పార్టీ ఇంటినౌకరుగా ప్రవర్తిస్తున్నారని, ఐపీఎస్ శిక్షణ సమయంలో ప్రజారక్షకుడిగా ఉంటానని ప్రమాణం చేసి, ప్రజాభక్షకుడిగా మారారని విమర్శించారు. జరిగిన ఉదంతానికి త్వరలోనే ఆయన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తే, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ లాంటివారినే ప్రజలు ఓడించారని, కుటుంబపాలన చేస్తున్న కేసీఆర్‌కు అదే పరిస్థితి తప్పదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ది తుగ్లక్ పాలన అని విమర్శించారు. 317 జీవోతో రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బందుల పాలు జేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం సంజయ్ దీక్ష చేపట్టిన కార్యాలయాన్ని సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే శోభ అరెస్టు సంజయ్ ఈ నెల 2న తలపెట్టిన జాగరణ దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అదే కేసులో నిందితులుగా ఉన్న కార్పొరేటర్ రాపర్తి ప్రసాద్, బీజేపీ నేత ఉప్పరపల్లి శ్రీనివాస్‌ను కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 16 మందిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. వైద్యపరీక్షల అనంతరం వీరిని మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం రిమాండ్ విధించడంతో ముగ్గురినీ జిల్లా జైలుకు పంపారు. -
‘దుబ్బాకలో ఇంటింటికి పది లక్షలు ఇప్పిస్తాం’
సాక్షి, సిద్ధిపేట: ఏదేమైనా దుబ్బాకలో కాషాయ జెండా ఎగురుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో మిరుదొడ్డి మండలం మోతె గ్రామం ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్, అభ్యర్థి రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సిద్దిపేట సీపీ ప్రవర్తన చూస్తే అమరులైన పోలీసులు, తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంత్‌చారి ఆత్మలు ప్రశాంతంగా ఉండవని వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్కు ఈ ఎన్నికలో గుణపాఠం చెబుతామని పిలుపునిచ్చారు. కేసీఆర్ దొడ్డు వడ్లు పండించి.. రైతులను సన్న వడ్లు పండించమనడం సరైంది కాదన్నారు. దుబ్బాక ప్రజల తీర్పు ముఖ్యమంత్రి అహంకారానికి ప్రతీక కావాలని ఆయన పిలుపునిచ్చారు. దుబ్బాక నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో తేల్చుకుందామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. (చదవండి: బండి సంజయ్ అరెస్ట్; సీఎస్, డీజీపీకి నోటీసులు) రఘునందన్ గెలిచిన వారం రోజుల్లో మల్లన్నసాగర్ బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. మంత్రి పదవి కాపాడుకోడానికే హరీష్ రావు ఓట్లడుగుతున్నారని, కరీంనగర్ తరహాలో యువత ఒక్కటై టీఆర్ఎస్ను ఓడించాలని పిలుపునిచ్చారు. కమలం గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ... దేశంలో రామరాజ్యం నడిస్తే.. తెలంగాణలో రజాకార్ల రాజ్యం నడుస్తుందని ధ్వజమెత్తారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు కేసీఆర్, హరీష్‌రావు అహంకార పతనానికి నాంది కావాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అది మురిగిపోయినట్టే.. టీఆర్ఎస్కు పోయినట్టేనని, బీజేపీని గెలిపిస్తే చింతమడక తరహాలో దుబ్బాకలో ఇంటింటికి పది లక్షలు ఇప్పిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. (చదవండి: దుబ్బాక రాజకీయం.. నోట్లకట్టల లొల్లి) దుబ్బాక నుంచే యుద్ధం మొదలు: బండి సంజయ్ దుబ్బాక నియోజకవర్గం కాసులాబాద్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘సీపీ టీఆర్ఎస్ కార్యకర్త. అతడి సంగతి ఎన్నికల తర్వాత చెప్తాం. అందుకే ఇక్కడికి ఎవరిని తేవాలో వారిని తెచ్చాం. సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నారా? వార్డ్ మెంబర్ కూడా కాలేరు. మానసిక క్షోభతో రామలింగారెడ్డి చనిపోయారు. రామలింగారెడ్డి కొడుకును ఎందుకు దాచి పెట్టారు? ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే ముగ్గురు ఎమ్మెల్యేలు అవుతారు. దుబ్బాక నిర్లక్ష్యానికి ఎందుకు గురి అయింది? టీఆర్ఎస్పై యుద్ధం దుబ్బాక నుంచే మొదలవ్వాల’ని పిలుపునిచ్చారు. (చదవండి: నోటీసులు ఇచ్చే... తనిఖీలు చేశాం) -
‘అరెస్టులకు,కేసులకు మేం భయపడం’
సాక్షి, కరీంనగర్ : ఆర్టీసీ కార్మికల సమ్మెకు సంఘీభావంగా జిల్లాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో స్పల్ప ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీలో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతో సహ పలువురిని పోలసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అరెస్టును నిరసిస్తూ ఎంపీని స్టేషన్‌కు తరలించకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ శాంతియుతంగా ర్యాలీని నిర్వహిస్తుంటే మధ్యలో అడ్డుకొని అరెస్టు చేయడం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక.. అహంకారపూరిత పాలనకు నిదర్శనమన్నారు. అరెస్టులకు, కేసులకు తాము భయపడమని, సీఎం కేసీఆర్ స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా అరెస్టులు ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ మండిపడ్డారు. కావాలనే ప్రభుత్వం నిరసన ర్యాలీని అడ్డుకుందని, ఆర్టీసీ కార్మికులకు ఏం జరిగినా సీఎం కేసీఆర్, హోంమంత్రి బాధ్యత వహించాల్పి ఉంటుందని తెలిపారు. -
సీఎంతో పాటు ముగ్గురు మంత్రులపై ఫిర్యాదు
సాక్షి, కరీంనగర్ జిల్లా: సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్‌లపై మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు సీఎం, మంత్రులే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడి కార్మికుడి ఆత్మహత్యకు కారణమైన సీఎంతో పాటు ముగ్గురు మంత్రులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని శోభ డిమాండ్ చేశారు. 24 గంటల్లో కేసు నమోదు చేయకుంటే పీఎస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుని పోలీసులు స్వీకరించారు. -
టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
సాక్షి, కరీంనగర్ : తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ చొప్పదండి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బొడిగె శోభ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఆర్టీసీ ధర్నాలో పాల్గొంటూ.. ఆర్టీసీని ఉత్తర, దక్షిణ తెలంగాణగా విడగొట్టి ఉత్తర తెలంగాణను పారిశ్రామికవేత్త జూపూడి రామేశ్వరరావుకు, దక్షిణ తెలంగాణను మేఘా ఇంజనీరింగ్ అధినేత కృష్ణారెడ్డికి అప్పగించే కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా 11వ రోజు మంత్రుల ఇళ్ల ముందు పిండం పెడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమస్యను పరిష్కరించని మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా మనోళ్లు కాదని తేల్చి చెప్పారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని, బెదిరింపులతో కార్మికులను రెచ్చగొట్టవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. కాగా, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బొడిగె శోభ 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ రాకపోవడంతో ఎన్నికల ముందు బీజెపీలో చేరారు. -
బీజేపీ అభ్యర్థుల ఐదో జాబితా ఇదే
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ 19మంది అభ్యర్థులతో కూడిన ఐదో జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఇటీవల టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన బొడిగె శోభకు ఐదో జాబితాలో స్థానం లభించింది. చొప్పదండి అసెంబ్లీ టికెట్‌ను ఆమెకు కేటాయించారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అరుణ తారకు కూడా పార్టీ టికెట్ దక్కింది. బీజేపీ ఐదో జాబితాలోని అభ్యర్థులు అభ్యర్థి పేరు నియోజకవర్గం అరుణతార జుక్కల్ నాయుడు ప్రకాష్ బాన్సువాడ రాజేశ్వర్ బాల్కొండ సనత్‌కుమార్ మంథని బొడిగె శోభ చొప్పదండి రాములు యాదవ్ మహేశ్వరం రైపల్లి సాయికృష్ణ వికారాబాద్ డాక్టర్ మధుసూదన్ యాదవ్ జడ్చర్ల సుధాకర్ రావు కొల్లాపూర్ జే.గోపి దేవరకొండ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొత్తగూడెం కరనాటి ప్రభాకర్ రావు మిర్యాలగూడ బొబ్బ భాగ్యరెడ్డి హుజుర్నగర్ జల్లేపల్లి వెంకటేశ్వరరావు కోదాడ కడియం రామచంద్రయ్య తుంగతుర్తి కేవీఎల్రెడ్డి జనగామ జి లక్ష్మణ్ నాయక్ డోర్నకల్ కుసుమ సతీష్ వరంగల్ ఈస్ట్ బానోత్ దేవీలాల్ ములుగు -
‘టీఆర్ఎస్ పాలనలో వారికి రక్షణ కరువైంది’
సాక్షి, కరీంనగర్ : టీఆర్ఎస్ పాలనలో హిందువులకు రక్షణ కరువైందని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు, సామాజిక కార్యకర్త ప్రహ్లాద్ దామోదర్‌దాస్ మోదీ వ్యాఖ్యానించారు. వరంగల్‌లో అర్చకుడిపై జరిగిన దాడి టీఆర్ఎస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ప్రహ్లాద్ శనివారం మీడియాతో మాట్లాడారు. అర్చకుడి మృతికి కారణమైన హంతకున్ని శిక్షించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అర్చకుడి మృతి కేసులో నిందితున్ని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో మేకిన్ ఇండియా, సబ్కా సాత్.. సబ్కా వికాస్ అమలు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఆకాక్షించారు. ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె చొప్పదండి నుంచి బీజేపీ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కొడిమ్యాల మండలం నల్లగొండ నరసింహస్వామికి పూజలు నిర్వహించిన అనంతరం శోభ ప్రచారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. -
కాళ్లు మొక్కనందుకే టికెట్ ఇవ్వలేదు: శోభ
గంగాధర: కేసీఆర్ కుటుంబ సభ్యుల కాళ్లు మొక్కనందుకే తనకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదని తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో అడిగినా సమాధానం ఇవ్వలేదన్నారు. ఆది నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా.. నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసినా పార్టీ తనను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు వివరించాలని సూచించారు. -
బీజేపీలోకి బొడిగె శోభ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతోపాటు, దేవరకొండకు చెందిన లాలునాయక్ గురువారం బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సమక్షంలో వారు తమ అనుచరులతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. దళితులు, వెనుకబడిన వర్గాలకు టీఆర్ఎస్ చేస్తున్న మోసానికి శోభకు జరిగిన అన్యాయమే నిదర్శనమని చెప్పారు. చొప్పదండిలో ఆమె చేస్తున్న సేవలపై అసూయ చెందిన టీఆర్ఎస్ ఆమెను పక్కన పెట్టిందని విమర్శించారు. ప్రజలు, కులసంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు అందరినీ టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. దేవాలయాల భూములను స్వాహా చేసిన వారికి అండగా ఉంటోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు టీఆర్ఎస్కు ఓట్లు వేయాలని ప్రచారం చేస్తున్నారంటే వారికి ఎన్ని మూటలు ముట్టజెప్పారో అర్థం చేసుకోవచ్చన్నారు. కేసీఆర్ ఏం చెప్పినా ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, కర్రు కాల్చి వాత పెట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పారు. చంద్రబాబు చేతిలో రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్.. తెలంగాణను అడ్డుకున్న టీడీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని లక్ష్మణ్ విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్ ఉండటం దారుణమన్నారు. హెరాల్డ్ కేసులో బెయిల్ మీద బయట తిరుగుతున్న నాయకుల కల నెరవేరదని చెప్పారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ గడ్డం పెంచినంత మాత్రాన అధికారంలోకి రారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీలలో ఎవరు గెలిచినా ఎన్నికల తర్వాత వారు టీఆర్ఎస్లోకే వెళ్తారని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమానికి పాటు పడే పార్టీ బీజేపీ మాత్రమేనని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల అవినీతి బాగోతం ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. అవినీతికి కారణమైన వారిని జైలుకు పంపిస్తామన్న కేసీఆర్ ఎందుకు కాంగ్రెస్‌తో లాలూచీ పడ్డారని ప్రశ్నించారు. టికెట్ రాకుండా అడ్డుకుంది వారే: శోభ 70 రోజులుగా కేసీఆర్ పిలుపు కోసం వేచి చూశానని.. టీఆర్ఎస్ చేసిన సర్వేలు తనకు అనుకూలంగా వచ్చినా టికెట్ ఇవ్వలేదని బొడిగే శోభ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు టీఆర్ఎస్లో పూర్తి స్థాయిలో పనిచేశానన్నారు. ఆ పార్టీ నేతలు కవిత, కేటీఆర్, వినోద్‌కుమార్, కేకేలను కలసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఒక ఉద్యమకారిణిగా ప్రగతి భవన్లో అడుగుపెట్ట లేకపోయానని.. కేసీఆర్ బంధువులు రవీందర్రావు, సంతోష్ వల్లే తనకు టికెట్ రాలేదని ఆరోపించారు. 119 స్థానాల్లో ఒక దళిత బిడ్డ అయిన తనకే అన్యాయం చేశారని విమర్శించారు. దీనిపై దళిత జాతి మొత్తం ఆలోచించుకోవాలని.. టీఆర్ఎస్ను వ్యతిరేకించాలని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పని చేసేందుకే బీజేపీలో చేరానన్నారు. చొప్పదండిలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీలో చేరిన బొడిగే శోభ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కమలం పార్టీ అగ్రనేతలు బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ కండువాతో శోభను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కేసీఆర్‌కు మొదటి నుంచి అండగా ఉండి, తెలంగాణ కల సాకారం కావడంలో తన వంతు పాత్ర పోషించానని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ను అరెస్ట్ చేస్తే కారంపొడి పట్టుకుని పోలీసులపై తిరుగుబాటు చేశానని వెల్లడించారు. అలాంటి తనకు నేడు టీఆర్ఎస్లో ఆదరణ కరువైందని వాపోయారు. టీఆర్ఎస్లో పూర్తిస్థాయి నాయకురాలిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన తాను గత 70 రోజులుగా కేసీఆర్ పిలుపు కోసం వేచిచూశానన్నారు. కవిత, కేటీఆర్, వినోద్, కేశవరావును కలిసిన ఫలితం దక్కలేదని.. ప్రగతి భవన్లో అడుగుబెట్ట లేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల తీర్పు, సర్వే నివేదిక ప్రకారమే టికెట్ ఇస్తామని కేసీఆర్ చెబుతున్నారని, 90 శాతం ప్రజల సపోర్టు తనకున్నా ఎందుకు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. దళిత బిడ్డనైన తనకు తీవ్ర అన్యాయం చేశారని, మాదిగలు టీఆర్ఎస్ను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సడ్డకుడు(తోడల్లుడు) రవీందర్ రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కారణంగానే తనకు టీఆర్ఎస్ టికెట్ రాలేదన్నారు. తెలంగాణలో కవిత ఒక్కరే చాలా? నా లాంటి బిడ్డ వద్దా? అని ప్రశ్నించారు. చొప్పదండిలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, సెగ్మెంట్ అభివృద్ధి చేస్తానని బొడిగే శోభ పేర్కొన్నారు. -
టీఆర్ఎస్కు బొడిగె శోభ గుడ్ బై?
సాక్షి, కరీంనగర్: టీఆర్ఎస్ టికెట్ తనకే కేటాయిస్తారనే ఆశతో వేచిచూసిన చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఆ పార్టీకి గుడ్ బై చెప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్‌లోనే 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. చొప్పదండితో పాటు మరికొన్ని స్థానాలను పెండింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి చొప్పదండి స్థానాన్ని తనకు కేటాయించకుండా పెండింగ్‌లో ఉంచడంపై .. శోభ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. చొప్పదండి సీటు దక్కించుకోవడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నించినప్పటికి.. టీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఎటువంటి సానుకూల ప్రకటన వెలువడలేదు. నేడో, రేపో కేసీఆర్ చొప్పదండి టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించనుండగా.. శోభకు టికెట్‌పై ఎటువంటి హామీ లభించలేదు. దీంతో చొప్పదండి స్థానం నుంచి ఎలాగైన బరిలోకి దిగాలని భావిస్తున్న శోభ.. పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో ఆమె తన ప్రయత్నాలను వేగవంతం చేశారు. ఇప్పటికే ఆమె బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిన్న తన అనుచరులతో సమావేశమై పార్టీ మారడంపై చర్చించిన ఆమె ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. బుధవారం ఆమె తన భవిష్యత్ కార్యచరణను ప్రకటించే అవకాశం ఉంది. -
శోభా..? రవిశంకరా?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: గులాబీ దళపతి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించి నెలరోజులు గడిచినా.. చొప్పదండి బరిలో నిలిచే గులాబీ నేత ఎవరు? అన్న సస్పెన్స్‌కు ఇంకా తెరపడ లేదు. ఉమ్మడి కరీంనగర్లో 12 అసెంబ్లీ స్థానాలకు 11 మందిని ఖరారు చేసిన అధినేత ఎస్సీ రిజర్వుడు స్థానం చొప్పదండిని మాత్రం హోల్డ్‌లో పెట్టారు. అటు తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు ఇవ్వమని చెప్పడం లేదు.. ఇటు కొత్త అభ్యర్థి పేరునూ ప్రకటించడం లేదు. దీంతో ఈ స్థానం నుంచి టికెట్ ఆశించే వారి జాబితాలో రోజుకో పేరు చేరుతోంది. ప్రధానంగా ఆ నియోజకవర్గంలో పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ముఖ్యనేతల ఫిర్యాదుతో శోభకు టికెట్ నిలిపివేయగా.. ఫిర్యాదు చేసిన నేతలే సుంకె రవిశంకర్ పేరు తెరపైకి తెచ్చారు. టిక్కెట్లు ప్రకటించి నెల రోజులు గడిచిపోగా.. ఈ ఇద్దరిలో ఎవరి పేరును ఇంకా ప్రకటించ లేదు. దీంతో ఇదే స్థానం నుంచి మాజీ మంత్రి గడ్డం వినోద్, రిటైర్డు డీఆర్వో బైరం పద్మయ్య, వొల్లాల వాణి, గుర్రం సంధ్యారాణి పేర్లు తెరపైకి రావడం చర్చనీయాంశం అవుతోంది. వినూత్నరీతిలో బొడిగె శోభ ప్రచారం.. విరుగుడుగా అసంతృప్తుల ప్రచారం.. చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకురాలు బొడిగె శోభ ట్రెండ్ మార్చారు. ఓ వైపు పార్టీ టిక్కెట్ దక్కుతుందో లేదో తెలియక.. అధినేత మదిలో ఏముందో అర్థం కాక మదన పడుతున్నారు. మరోవైపు తాను నమ్ముకున్న ప్రజలను కలిసేందుకు గ్రామాల్లోకి వెళ్ళి కన్నీటి పర్యంతమవుతూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పేద దళిత మహిళను కావడం.. కొందరి ఫిర్యాదులతోనే తనకు టిక్కెట్ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కొంగుచాచి విరాళాలు సేకరిస్తున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ నీడలో, కేసీఆర్ ఆశీస్సులతో ఎదిగిన తనకే పార్టీ అధినేత మళ్లీ అవకాశం ఇస్తారని కూడా చెప్తున్నారు. కాగా.. శోభ ప్రయత్నానికి విరుగుడుగా గులాబీ శ్రేణులు, స్థానిక నాయకులు ఐక్యంగా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేపట్టి ప్రజా ఆశీర్వాద సభలతో హడావిడి చేస్తున్నారు. శోభ వైఖరితో ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్న గులాబీ శ్రేణులు తాజా పరిణామాలతో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం ముమ్మరం చేశారు. శోభ వెళ్లిన గ్రామాల్లోకి వెళ్లి భారీ ర్యాలీ నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభతో జనాన్ని ఆకట్టుకున్నారు. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే పార్టీ శ్రేణులను పట్టించుకోకుండా అగౌరవ పరిచేలా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. శోభకు కాకుండా పార్టీ ఎవ్వరికి టిక్కెట్ ఇచ్చినా గుండెల్లో పెట్టుకుని గెలిపించుకుంటామని హడావుడి చేస్తున్నారు. రసకందాయంలో రాజకీయం.. చివరకు అభ్యర్థి ఎవరో మరి.. ఎన్నికల షెడ్యూల్ నాటికి కూడా పంచాయితీ తెగకపోవడంతో పోటాపోటీ ప్రచారాలతో చొప్పదండి రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అటు ప్రతిపక్షాల్లోనూ, ఇటు స్వపక్షంలోనూ చొప్పదండి రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్లో స్వపక్షమే విపక్షంగా మారి పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి. అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ దళపతి కేసీఆర్, చొప్పదండి అభ్యర్థి ఎంపికను సస్పెన్స్‌లో పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొడిగె శోభ వ్యవహార శైలిపై టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు అధినేత కేసీఆర్‌కు పిర్యాదు చేయడంతోనే శోభ అభ్యర్థిత్వాన్ని ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టారని ప్రచారం సాగింది. నెలరోజులు దాటినా అభ్యర్థిని ఎంపిక చేయకపోవడం, శోభకు వ్యతిరేకంగా స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తుండడంతో ఇంతకాలం వేచిచూసే ధోరణి అవలంబించిన శోభ ఒక్కసారిగా ట్రెండ్ మార్చారు. కాట్నపల్లి, రాగంపేటను సందర్శించిన శోభ తన అనుచరులతో సమావేశమై కన్నీటిపర్యంతమయ్యారు. పార్టీలో జరుగుతున్న అవమానాన్ని తలచుకుంటూకన్నీరుమున్నీరుగా విలపించిన శోభను చూసిన స్థానికులు ఆమె పట్ల జాలి చూపారు. చొప్పదండి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా ఉన్నంతకాలం శోభక్కను తమ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని వారు తీర్మానం కూడా చేశారు. అంతటితో ఆగకుండా శోభకు రెండు కులసంఘాలు పది నుంచి 15 వేలు సమకూర్చాయి. మొత్తంగా చొప్పదండి రాజకీయాలు రసకందాయంలో పడగా, చొప్పదండి పరిణామాలను నిశ్చింతంగా గమనిస్తున్న గులాబీ దళపతి కేసీఆర్, అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బొడిడె శోభ, సుంకె రవిశంకర్‌లలో ఎవరు అభ్యర్థి అవుతారనే చర్చ సర్వత్రా సాగుతోంది. -
టీఆర్ఎస్లో ‘రెబెల్స్’.. బుజ్జగింపులకు ససేమిరా!
తెలంగాణ రాష్ట్ర సమితిలో రెబెల్స్ బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని చొప్పదండి మినహా 12 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. వారంతా ఎన్నికల ప్రచారం పేరిట గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓ వైపు చేరికలు, మరోవైపు ప్రతిజ్ఞలతో దూసుకుపోతుంటే.. అదే స్థాయిలో టికెట్ ఆశించి భంగపడ్డ టీఆర్ఎస్ ఆశావాహులు టికెట్ల కేటాయింపుపై నిరసన గళాన్ని ఉధృతం చేస్తున్నారు. టికెట్లు ఖరారైన అభ్యర్థులు ప్రచారపర్వం కొనసాగిస్తుంటే, భంగపడ్డ వారు తామేమి తక్కువ కాదన్నట్లు తమ అనుచరులతో నిరసన ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ తమ బలాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు. రెబెల్స్ ఉన్న నియోజకవర్గాల్లో ఇప్పటికే బుజ్జగింపులు జరుగుతున్నా ససేమిరా అంటూ పోటీ చేయడానికే మొగ్గుచూపుతున్నారు. పోటీ తప్పదన్నట్లుగా అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు. దీంతో పార్టీలో చీలిక ఏర్పడుతుందనే భయం అభ్యర్థులను వెంటాడుతోంది. టికెట్లు కేటాయించిన నాటి నుంచే పలు నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉత్పన్నమవడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: మొదటి దశలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 105 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే.. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం అభ్యర్థిని మాత్రం పెండింగ్‌లో ఉంచారు. తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు మలివిడతలో టిక్కెట్ దక్కకపోయినా తాను రెబల్‌గా పోటీ చేస్తానని పార్టీ శ్రేణులతో చెబుతూనే అంతర్గతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలు స్తోంది. అదే నియోజకవర్గంలో ఆరు మండలాల కు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, స్థానిక ప్ర జాప్రతనిధులు శోభకు తప్ప ఎవరికి టికెట్ ఇచ్చి నా గెలిపించుకుంటామని బాహాటంగానే చెబుతున్నారు. వేములవాడ టికెట్‌ను తాజా మాజీ ఎ మ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు ఇవ్వడంతో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమకు టికెట్ కేటాయించాలని కోరు తూ యాదవ సంఘాల ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పలు చోట్ల ర్యాలీలు నిర్వహించారు. తా జాగా వేములవాడలోని ఓ కళ్యాణ మండపంలో ద్వితీయ శ్రేణి నాయకులతోపాటు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు సమావేశమై తాజా మాజీకి టికెట్ కేటాయించడంపై తమ నిరసన గళాన్ని రాజధాని వరకు వినిపించారు. ఉమతోపాటు టీఆర్ఎస్లో చేరే మరో నేత వేములవాడ నుంచి నామినేషన్ వేస్తారన్న ప్రచారం జోరందుకుంది. అదేవిధంగా రామగుండం నియోజకవర్గ టికెట్‌ను సోమారపు సత్యనారాయణకే ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని అక్కడి ఆశావాహులు తిరుగుబా వుటా ఎగురవేశారు. రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమిపాలైన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కోరుకంటి చందర్, రామగుండం నగర మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి తదితరులు తమకు టికెట్ కేటాయించాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. అధిష్టానం తమ అభ్యర్థనను వినిపించుకోకపోవడంతో కోరుకంటి చందర్ రెబెల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో పోటీ చేసిన అనుభవం ఉండడంతో తన అనుచరులను రంగంలోకి దింపి ప్రచారపర్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మానకొండూర్ నియోజకవర్గం నుంచి తాజా మాజీ రసమయి టికెట్ దక్కించుకొని బరిలో నిలిచి ప్రచారం నిర్వహిస్తున్నారు. 2009లో మానకొండూర్ నుంచి బరిలో నిలిచిన ఓరుగంటి ఆనంద్‌కు టికెట్ కే టాయించాలని ఆయన అనుయాయులు ఈసారి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ మెంబర్‌గా కొనసాగుతున్న ఆనంద్‌కే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని నియోజకవర్గంలో పలుచోట్ల ఆందోళన పర్వం కొనసాగిస్తున్నారు. అయితే.. ఆనంద్ కూడా రెబల్‌గా పోటీ చేసే అవకాశాలున్నట్లు ఆయన అనుచరగణం ప్రచారం చేస్తోంది. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన అభ్యర్థులు.. జగిత్యాలలో సద్దుమణిగిన వివాదం.. వేములవాడ, రామగుండం, మానకొండూర్ నియోజకవర్గాల్లో రెబెల్స్ బెడద పెరగడంతో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. రెబెల్స్‌గా బరిలోకి దిగుతున్న నేతలు సైతం తాజా మాజీలకు సమవుజ్జీలుగా ఉండడంతో పార్టీ చెప్పినా వినలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెబెల్స్‌ను ఎదుర్కొనేందుకు వ్యూ హ రచన చేస్తున్నారు. అధిష్టానం సీరియస్‌గా ఉ న్నప్పటికీ పార్టీకి ఎలాంటి నష్టం లేకుండానే తా ము పోటీలో ఉంటున్నామని, తమ మద్దతుదారులు తమ అభ్యర్థిత్వంపై పూర్తి విశ్వాసంతో ఉండడంతోనే పోటీకి దిగుతున్నట్లు చెబుతున్నారు. అ యితే.. ఈ మూడు నియోజకవర్గాల్లో గెలుపోట ములను తేల్చే దిశగానే రెబల్స్ ఉండడంతో అధి ష్టానానికి తలనొప్పిగా మారింది. కాగా.. జగిత్యా ల నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు డాక్ట ర్ సంజయ్‌కుమార్‌కు టికెట్ కేటాయించగా, అదే నియోజకవర్గానికి చెందిన ఓరుగంటి రమణారా వు సైతం టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో రెబల్‌గా పోటీ చేయాలంటూ తన అనుచరులు ఒత్తిడి చేయడంతో పోటీకి సన్నద్ధమయ్యారు. ఇరువురు నేతలు ప్రచారాన్ని సైతం ప్రారంభిం చారు. కాగా.. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత రంగప్రవేశం చేసి అసమ్మతిని ఆదిలోనే పరిష్కరించింది. దీంతో అక్కడ ఇరువురు నేతలు కలిసిపోయారు. -
అక్కడ శోభకు.. ఇక్కడ అసమ్మతివాదులకు షాక్
సాక్షి, సిరిసిల్ల/ కరీంనగర్/ హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలకు 12 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. చొప్పదండి మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇచ్చారు. జగిత్యాల అభ్యర్థిగా డాక్టర్ సంజయ్ పేరు ఖరారు చేయడం గమనార్హం. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను చెన్నూర్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభకు మాత్రం టీఆర్ఎస్ అధినాయకత్వం షాక్ ఇచ్చింది. చొప్పదండి నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించకుండా సీఎం కేసీఆర్ పెండింగ్‌లో పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బోడిగె శోభపై టీఆర్ఎస్ నాయకులు తిరుగుబాటు చేయడంతోనే ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదని తెలుస్తోంది. రామగుండం నుంచి సోమారపు సత్యనారాయణకు మళ్లీ టికెట్ ఇవ్వడంతో టీఆర్ఎస్ అసమ్మతి వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసమ్మతి తీవ్రంగా ఉన్నా.. వేములవాడ నుంచి రమేష్ బాబుకు మళ్లీ టికెట్ ఇవ్వడం గమనార్హం. మాట నిలుపుకున్న కేటీఆర్.. సీఎం కేసీఆర్ తనయుడు కె.తారక రామారావు మాట నిలుపుకున్నారు. కేటీఆర్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పోటీచేస్తారని, సిరిసిల్ల నుంచి పోటీ చేయరని జరిగిన ప్రచారాన్ని తిప్పికొడుతూ మొదటి జాబితాలోనే సిరిసిల్ల నుంచి కేటీఆర్ పేరు ఖరారు అయింది. సిరిసిల్ల ప్రజలు తిరస్కరించే దాకా అక్కడే పోటీ చేస్తానని పలు సందర్భాల్లో మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పుడు మరోసారి సిరిసిల్లలో పోటీచేస్తూ.. మాట నిలుపుకున్నారు. రాష్ట్ర మంత్రిగా ఏడు శాఖలను నిర్వహిస్తూనే.. సిరిసిల్ల నియోజకవర్గం సమస్యలను పరిష్కరిస్తూ.. గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి పనులను కేటీఆర్ చేశారు. సిరిసిల్ల పట్టణంతోపాటు నియోజకవర్గంలో తనదైన మార్క్‌ను కేటీఆర్ చూపించారు. అసమ్మతికి షాక్ ఇచ్చిన ‘చెన్నమనేని’.. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు తన వ్యతిరేక అసమ్మతి వాదులకు షాక్ ఇస్తూ.. టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్‌ను సాధించారు. మరోసారి ఎన్నికల బరిలో రమేశ్‌బాబు నిలుస్తున్నారు. అధికార పార్టీకి చెందిన జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ వర్గీయులు వేములవాడలో తుల ఉమకు టిక్కెట్ వస్తుందని భావిస్తూ.. ప్రచారం చేశారు. మరోవైపు ఏకంగా అసమ్మతి గళాన్ని వినిపించారు. వారందరికీ ఝలక్ ఇస్తూ.. మొదటి జాబితాలోనే రమేశ్‌బాబు టిక్కెట్ సాధించారు. తుల ఉమకు వర్గంగా భావిస్తున్న టీఆర్ఎస్ నేతలకు తాజా నిర్ణయం మింగుడుపడడం లేదు. మరోవైపు పౌరసత్వం వివాదం కోర్టు విచారణలో ఉండాగానే మరోసారి టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ ఖరారు కావడం విశేషం. అసమ్మతికి షాక్ ఇస్తూ.. వేములవాడలో మరోసారి రమేశ్‌బాబు తన పట్టును నిరూపించుకున్నారు. మానకొండూరులో మరోఛాన్స్.. రసమయి బాలకిషన్‌కు మానకొండూరులో మరోఛాన్స్‌ను టీఆర్ఎస్ కల్పించింది. సిద్దిపేట జిల్లాకు చెందిన రసమయి బాలకిషన్ మానకొండూరు అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. మానకొండూరు రాజకీయాలపై క్షేత్రస్తాయిలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఏది ఏమైనా రసమయి బాలకిషన్ మరోసారి టీఆర్ఎస్ టిక్కెట్‌ను సాధించడం విశేషం. చొప్పదండిలో శోభకు షాక్.. చొప్పదండి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే బొడిగె శోభకు పార్టీ టిక్కెట్‌ను తొలిజాబితాలో ఖరారు చేయలేదు. దీంతో ఇక్కడ ఏం జరుగుతుంది అని చర్చ సాగుతుంది. మొత్తంగా జిల్లాలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. అధికార పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరమైన రాజకీయ చర్చకు సీఎం కేసీఆర్ తెరలేపారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నాయకుల షాక్..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఓవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ ముందుస్తు ఎన్నికలకు వెళ్తుందనే ప్రచారం జోరుగా సాగుతుండగా.. మరోవైపు ఆ పార్టీ చొప్పదండి నియోజకవర్గం నాయకుల మధ్య వివాదం రాజుకొంది. ఎమ్మెల్యే బొడిగే శోభకు వ్యతిరేకంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ వద్ద గళం విప్పారు. ఎమ్మెల్యే పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయడం లేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బొడిగె శోభకు టికెట్ ఇవ్వొద్దని వారు కేసీఆర్‌ను కోరారు. -
హరితహారంలో మొక్కలు నాటి రక్షించాలి
గంగాధర: హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై నాటిన మొక్కలను సంరక్షించాలని ఎమ్మెల్యే బొడిగె శోభ అన్నారు. నాల్గో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీపీ దూలం బాలగౌడ్, సర్పంచు వైధ రామానుజం, తహశీల్దార్ సరిత, ఎపీఎం జ్యోతి, పుల్కం గంగన్న, ఎండీ నజీర్,శ్రీనివాస్‌రెడ్డి, అట్ల శేఖర్‌రెడ్డి, ఆకుల మధుసూదన్ పాల్గొన్నారు. మండలంలోని ఆచంపల్లి గ్రామంలో జెడ్పీటీసీ సభ్యురాలు ఆకుల శ్రీలత పాల్గొన్నారు. చొప్పదండిలో... చొప్పదండి: మండలంలో నాల్గో విడుత హరితహారంశనివారం ప్రారంభమైంది. మండలంలోని కాట్నపల్లిలో ఎమ్మెల్యే బొడిగె శోభ హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రిన్సిపాల్ మంగతాయారు మొక్కలు నాటారు. జూనియర్ కళాశాల ఆవరణలో ఏపీడీ మంజులాదేవి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గుమ్లాపూర్‌లో సర్పంచ్ ముష్కె వెంకట్ రెడ్డి పండ్ల మొక్కల పంపిణీ చేశారు. ఎంపీపీ గుర్రం భూమారెడ్డి, ప్రత్యేకాధికారి మనోజ్‌కుమార్ పాల్గొన్నారు. భాగస్వాములు కావాలి.. రామడుగు: ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఆర్డీవో వేంకటేశ్వర్రావు కోరారు. మండలంలోని రుద్రారం గ్రామంలో శనివారం హరితహారం కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏపీడీ మంజులవాణి, ఏపీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు. పందికుంటలో... మండలంలోని షానగర్ గ్రామపంచాయతీ పరిధిలోని పందికుంట గ్రామ వరాల కుంటలో శనివారం ఎమ్మెల్యే బోడిగె శోభ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు వీర్ల కవిత, గోపాల్రావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పూడురి మణేమ్మ, ఎంపీడీవో దేవకిదేవి, ఎస్సై వి.రవి, ఎంపీడీవో చంద్రశేఖర్, సర్పంచ్ గునుకొండ అశోక్‌కుమార్, ఎంపీటీసీ కట్కం రవీందర్, టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు జూపాక కరుణాకర్ పాల్గొన్నారు. మల్యాలలో... మల్యాల: మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే శోభ పాల్గొని మొక్కలను నాటారు. ఎంపీపీ తైదల్ల శ్రీలత, జడ్పీటీసీ వీరబత్తిని శోభారాణి, ఎంపీడీవో మహోత్ర, తహశీల్దార్ శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ కన్వీనర్ రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ కొల్లూరి గంగాధర్, నాయకులు బోట్ల ప్రసాద్, మధుసూదర్‌రావు, తిరుపతిరెడ్డి, నాగభూషణం, శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు. కొడిమ్యాలలో... కొడిమ్యాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శనివారం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాల్గొని మొక్కలునాటారు. ఎంపీడీవో ఎన్.శ్రీనివాస్, తహసీల్దార్ రవీందర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లత, సర్పంచ్ పిడుగు ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ నాంపెల్లి రాజేశం, ఎంపీటీసీ సురుగు శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ సంజీవయ్య పాల్గొన్నారు. మండలంలోని తిర్మలాపూర్ ఉన్నతపాఠశాలలో ఎంపీడీవో ఎన్.శ్రీనివాస్ మొక్క నాటారు. సర్పంచ్ లత, ఎంపీటీసీ మల్లేశం ఉన్నారు. -
పోతారం పంప్‌హౌస్ ప్రారంభం
కొండగట్టు(చొప్పదండి): కొడిమ్యాల మండల పరిధిలోని పోతారం పంప్‌హౌస్‌ను చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ కొన్నేళ్లుగా మరమ్మతుకు నోచుకోక, నీరులేక మూలకు పడ్డ పోతారం చెరువుకు నీరు ఇవ్వడం టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పతనమన్నారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్టు గురించి, ఈ ప్రాంత ప్రజల బాధను సీఎం కేసీఆర్, మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లగానే,, వారు పోతారం పూర్తి చేయాలని అధికారులకు ఆదే«శాలు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్‌వారు టీఆర్ఎస్ చేసే మంచి పనులకు ఎప్పుడూ అడ్డుపడుతున్నారని.. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతరన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, సింగిల్‌విండో చైర్మన్ పునుగోటి కృష్ణారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురుగు శ్రీనివాస్, బొట్ల ప్రసాద్, కుంట కృష్ణవేణి, సమిరిశెట్టి విమల పాల్గొన్నారు. -
వీఐపీగా గుర్తించరా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగం
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఆమె అనుచరులు రెచ్చిపోయారు. జిల్లాలోని రేణికుంట టోల్గేట్లో మంగళవారం చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ వీరంగం సృష్టించారు. టోల్గేట్లో వద్ద ఎమ్మెల్యే అనుచరుల వాహనాలను టోల్ సిబ్బంది ఆపారు. దీంతో తమ అనుచరుల వాహనాలు ఎందుకు ఆపారని.. వీఐపీగా గుర్తించరా అని సదరు ఎమ్మెల్యే చిందులు వేశారు. తమ డ్యూటీ తాము చేస్తున్నామని టోల్ సిబ్బంది చెప్పినా శోభ వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడికి యత్నించారు. ఎమ్మెల్యే అనుసరించిన తీరును టోల్ సిబ్బంది ఫోన్లో చిత్రీకరిస్తుండగా వారిని కొట్టి ఫోన్‌ను లాక్కెళ్లారు. ఈ ఘటనపై టోల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. -
కేసీఆర్ అన్న కుమార్తె ఆందోళన
నాంపల్లి: ఒకవైపు అసెంబ్లీ లోపల జీఎస్టీ బిల్లుపై చర్చ... మరొక వైపు అసెంబ్లీ బయట గన్‌పార్కు ఎదుట ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమార్తె రమ్య ఆందోళన... మంగళవారం మధ్యాహ్నం నాంపల్లి పరిసర ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు.... వెరసి గన్‌పార్కు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బొడిగ శోభను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్థూపం వద్దకు రమ్య చేరుకుందనే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు మరింత భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే బొడిగ శోభను అరెస్టు చేసే వరకు అక్కడిlనుంచి కదిలే ప్రసక్తే లేదని ఆమె భీష్మించుకు కూర్చున్నారు. మహిళా పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. దీంతో ఎట్టకేలకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
మహిళనని.. చులకనా?
టీఆర్ఎస్ నేతలపై చొప్పదండి ఇన్చార్జి బొడిగె శోభ ఫైర్ కరీంనగర్, న్యూస్‌లైన్ : టీఆర్ఎస్ నేతలు మహిళా నాయకురాలిగా తనను చిన్నచూపు చూస్తున్నారని ఆ పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి బొడిగె శోభ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా ఇన్చార్జి బోయిన్పల్లి వినోద్‌కుమార్, జిల్లా కన్వీనర్ ఈద శంకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఇతర నాయకులు గురువారం కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్ కాన్ఫరెన్స్ హాల్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బొడిగె శోభతోపాటు టీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా ఇన్చార్జి కటారి రేవతీరావును ఆహ్వానించారు. రేవతీరావుకు ముందు వరుసలో చోటిచ్చిన నాయకులు శోభకు వెనుక వరుసలో స్థానం కల్పించారు. తనను వెనుక వరుసలో కూర్చోబెట్టడంపై శోభ టీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు. ప్రతి సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జిగా, మహిళా నేతగా తనను చిన్నచూపు చూస్తున్నారంటూ మండిపడ్డారు. సమావేశం ప్రారంభంలోనే తన స్థాయికి తగిన గుర్తింపు నివ్వడం లేదని, పిలిచి అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. దీంతో కంగుతిన్న నాయకులు ఆమెను సముదాయించి తిరిగి వేదికపై మొదటి వరుసలో కూర్చోబెట్టడంతో ప్రెస్‌మీట్ మొదలయ్యింది.