తెలంగాణ రాష్ట్ర సమితిలో రెబెల్స్ బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని చొప్పదండి మినహా 12 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. వారంతా ఎన్నికల ప్రచారం పేరిట గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓ వైపు చేరికలు, మరోవైపు ప్రతిజ్ఞలతో దూసుకుపోతుంటే.. అదే స్థాయిలో టికెట్ ఆశించి భంగపడ్డ టీఆర్‌ఎస్ ఆశావాహులు టికెట్ల కేటాయింపుపై నిరసన గళాన్ని ఉధృతం చేస్తున్నారు. టికెట్లు ఖరారైన అభ్యర్థులు ప్రచారపర్వం కొనసాగిస్తుంటే, భంగపడ్డ వారు తామేమి తక్కువ కాదన్నట్లు తమ అనుచరులతో నిరసన ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ తమ బలాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు. రెబెల్స్ ఉన్న నియోజకవర్గాల్లో ఇప్పటికే బుజ్జగింపులు జరుగుతున్నా ససేమిరా అంటూ పోటీ చేయడానికే మొగ్గుచూపుతున్నారు. పోటీ తప్పదన్నట్లుగా అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు. దీంతో పార్టీలో చీలిక ఏర్పడుతుందనే భయం అభ్యర్థులను వెంటాడుతోంది. టికెట్లు కేటాయించిన నాటి నుంచే పలు నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉత్పన్నమవడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మొదటి దశలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 105 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే.. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం అభ్యర్థిని మాత్రం పెండింగ్‌లో ఉంచారు. తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు మలివిడతలో టిక్కెట్ దక్కకపోయినా తాను రెబల్‌గా పోటీ చేస్తానని పార్టీ శ్రేణులతో చెబుతూనే అంతర్గతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలు స్తోంది. అదే నియోజకవర్గంలో ఆరు మండలాల కు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, స్థానిక ప్ర జాప్రతనిధులు శోభకు తప్ప ఎవరికి టికెట్ ఇచ్చి నా గెలిపించుకుంటామని బాహాటంగానే చెబుతున్నారు. వేములవాడ టికెట్‌ను తాజా మాజీ ఎ మ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు ఇవ్వడంతో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమకు టికెట్ కేటాయించాలని కోరు తూ యాదవ సంఘాల ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పలు చోట్ల ర్యాలీలు నిర్వహించారు. తా జాగా వేములవాడలోని ఓ కళ్యాణ మండపంలో ద్వితీయ శ్రేణి నాయకులతోపాటు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ శ్రేణులు సమావేశమై తాజా మాజీకి టికెట్ కేటాయించడంపై తమ నిరసన గళాన్ని రాజధాని వరకు వినిపించారు.
ఉమతోపాటు టీఆర్‌ఎస్‌లో చేరే మరో నేత వేములవాడ నుంచి నామినేషన్ వేస్తారన్న ప్రచారం జోరందుకుంది. అదేవిధంగా రామగుండం నియోజకవర్గ టికెట్‌ను సోమారపు సత్యనారాయణకే ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని అక్కడి ఆశావాహులు తిరుగుబా వుటా ఎగురవేశారు. రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమిపాలైన టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కోరుకంటి చందర్, రామగుండం నగర మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి తదితరులు తమకు టికెట్ కేటాయించాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. అధిష్టానం తమ అభ్యర్థనను వినిపించుకోకపోవడంతో కోరుకంటి చందర్ రెబెల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో పోటీ చేసిన అనుభవం ఉండడంతో తన అనుచరులను రంగంలోకి దింపి ప్రచారపర్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మానకొండూర్ నియోజకవర్గం నుంచి తాజా మాజీ రసమయి టికెట్ దక్కించుకొని బరిలో నిలిచి ప్రచారం నిర్వహిస్తున్నారు. 2009లో మానకొండూర్ నుంచి బరిలో నిలిచిన ఓరుగంటి ఆనంద్‌కు టికెట్ కే టాయించాలని ఆయన అనుయాయులు ఈసారి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ మెంబర్‌గా కొనసాగుతున్న ఆనంద్‌కే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని నియోజకవర్గంలో పలుచోట్ల ఆందోళన పర్వం కొనసాగిస్తున్నారు. అయితే.. ఆనంద్ కూడా రెబల్‌గా పోటీ చేసే అవకాశాలున్నట్లు ఆయన అనుచరగణం ప్రచారం చేస్తోంది.
అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన అభ్యర్థులు.. జగిత్యాలలో సద్దుమణిగిన వివాదం..
వేములవాడ, రామగుండం, మానకొండూర్ నియోజకవర్గాల్లో రెబెల్స్ బెడద పెరగడంతో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. రెబెల్స్‌గా బరిలోకి దిగుతున్న నేతలు సైతం తాజా మాజీలకు సమవుజ్జీలుగా ఉండడంతో పార్టీ చెప్పినా వినలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెబెల్స్‌ను ఎదుర్కొనేందుకు వ్యూ హ రచన చేస్తున్నారు. అధిష్టానం సీరియస్‌గా ఉ న్నప్పటికీ పార్టీకి ఎలాంటి నష్టం లేకుండానే తా ము పోటీలో ఉంటున్నామని, తమ మద్దతుదారులు తమ అభ్యర్థిత్వంపై పూర్తి విశ్వాసంతో ఉండడంతోనే పోటీకి దిగుతున్నట్లు చెబుతున్నారు. అ యితే.. ఈ మూడు నియోజకవర్గాల్లో గెలుపోట ములను తేల్చే దిశగానే రెబల్స్ ఉండడంతో అధి ష్టానానికి తలనొప్పిగా మారింది. కాగా.. జగిత్యా ల నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు డాక్ట ర్ సంజయ్‌కుమార్‌కు టికెట్ కేటాయించగా, అదే నియోజకవర్గానికి చెందిన ఓరుగంటి రమణారా వు సైతం టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో రెబల్‌గా పోటీ చేయాలంటూ తన అనుచరులు ఒత్తిడి చేయడంతో పోటీకి సన్నద్ధమయ్యారు. ఇరువురు నేతలు ప్రచారాన్ని సైతం ప్రారంభిం చారు. కాగా.. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత రంగప్రవేశం చేసి అసమ్మతిని ఆదిలోనే పరిష్కరించింది. దీంతో అక్కడ ఇరువురు నేతలు కలిసిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment