
సాక్షి, కరీంనగర్ : టీఆర్‌ఎస్ పాలనలో హిందువులకు రక్షణ కరువైందని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు, సామాజిక కార్యకర్త ప్రహ్లాద్ దామోదర్‌దాస్ మోదీ వ్యాఖ్యానించారు. వరంగల్‌లో అర్చకుడిపై జరిగిన దాడి టీఆర్‌ఎస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ప్రహ్లాద్ శనివారం మీడియాతో మాట్లాడారు. అర్చకుడి మృతికి కారణమైన హంతకున్ని శిక్షించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అర్చకుడి మృతి కేసులో నిందితున్ని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో మేకిన్ ఇండియా, సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్ అమలు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఆకాక్షించారు. ఇదిలా ఉండగా.. టీఆర్‌ఎస్ టికెట్ నిరాకరించడంతో చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె చొప్పదండి నుంచి బీజేపీ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కొడిమ్యాల మండలం నల్లగొండ నరసింహస్వామికి పూజలు నిర్వహించిన అనంతరం శోభ ప్రచారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment