హరితహారంలో మొక్కలు నాటి రక్షించాలి | MLA Bodiga Shobha Haritha Haram Program In Karimnagar | Sakshi
Sakshi News home page

హరితహారంలో మొక్కలు నాటి రక్షించాలి

Published Sun, Jul 22 2018 1:13 PM | Last Updated on Sun, Jul 22 2018 1:13 PM

MLA  Bodiga Shobha Haritha Haram Program In Karimnagar - Sakshi

రామడుగు: పందికుంటలో మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే శోభ

గంగాధర: హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై నాటిన మొక్కలను సంరక్షించాలని ఎమ్మెల్యే బొడిగె శోభ అన్నారు. నాల్గో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీపీ దూలం బాలగౌడ్, సర్పంచు వైధ రామానుజం, తహశీల్దార్‌ సరిత, ఎపీఎం జ్యోతి, పుల్కం గంగన్న, ఎండీ నజీర్,శ్రీనివాస్‌రెడ్డి, అట్ల శేఖర్‌రెడ్డి, ఆకుల మధుసూదన్‌ పాల్గొన్నారు. మండలంలోని ఆచంపల్లి గ్రామంలో జెడ్పీటీసీ సభ్యురాలు ఆకుల శ్రీలత పాల్గొన్నారు.

చొప్పదండిలో...
చొప్పదండి: మండలంలో నాల్గో విడుత హరితహారంశనివారం ప్రారంభమైంది. మండలంలోని కాట్నపల్లిలో ఎమ్మెల్యే బొడిగె శోభ హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. జవహర్‌ నవోదయ విద్యాలయంలో ప్రిన్సిపాల్‌ మంగతాయారు మొక్కలు నాటారు. జూనియర్‌ కళాశాల ఆవరణలో ఏపీడీ మంజులాదేవి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గుమ్లాపూర్‌లో సర్పంచ్‌ ముష్కె వెంకట్‌ రెడ్డి పండ్ల మొక్కల పంపిణీ చేశారు.  ఎంపీపీ గుర్రం భూమారెడ్డి, ప్రత్యేకాధికారి మనోజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

భాగస్వాములు కావాలి..
రామడుగు: ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఆర్‌డీవో వేంకటేశ్వర్‌రావు కోరారు. మండలంలోని రుద్రారం గ్రామంలో శనివారం హరితహారం కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏపీడీ మంజులవాణి, ఏపీవో చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

పందికుంటలో...
మండలంలోని షానగర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని పందికుంట గ్రామ వరాల కుంటలో శనివారం ఎమ్మెల్యే బోడిగె శోభ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు వీర్ల కవిత, గోపాల్‌రావుపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పూడురి మణేమ్మ, ఎంపీడీవో దేవకిదేవి, ఎస్సై వి.రవి, ఎంపీడీవో చంద్రశేఖర్, సర్పంచ్‌ గునుకొండ అశోక్‌కుమార్, ఎంపీటీసీ కట్కం రవీందర్, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల శాఖ అధ్యక్షులు జూపాక కరుణాకర్‌ పాల్గొన్నారు.

 
మల్యాలలో...
మల్యాల:  మండల కేంద్రంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే శోభ పాల్గొని మొక్కలను నాటారు. ఎంపీపీ తైదల్ల శ్రీలత, జడ్పీటీసీ వీరబత్తిని శోభారాణి, ఎంపీడీవో మహోత్ర, తహశీల్దార్‌ శ్రీనివాస్, ఆర్‌ఎస్‌ఎస్‌ కన్వీనర్‌ రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ కొల్లూరి గంగాధర్, నాయకులు బోట్ల ప్రసాద్, మధుసూదర్‌రావు, తిరుపతిరెడ్డి, నాగభూషణం, శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు.

కొడిమ్యాలలో...
కొడిమ్యాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో శనివారం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాల్గొని మొక్కలునాటారు. ఎంపీడీవో ఎన్‌.శ్రీనివాస్, తహసీల్దార్‌ రవీందర్, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ లత, సర్పంచ్‌ పిడుగు ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ నాంపెల్లి రాజేశం, ఎంపీటీసీ సురుగు శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్‌ సంజీవయ్య పాల్గొన్నారు. మండలంలోని తిర్మలాపూర్‌ ఉన్నతపాఠశాలలో   ఎంపీడీవో ఎన్‌.శ్రీనివాస్‌ మొక్క నాటారు. సర్పంచ్‌ లత, ఎంపీటీసీ మల్లేశం ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement