శుక్రవారం వరకూ టోల్ ట్యాక్స్ రద్దు | central government declares toll exemption from November 11th | Sakshi
Sakshi News home page

శుక్రవారం వరకూ టోల్ ట్యాక్స్ రద్దు

Published Wed, Nov 9 2016 4:47 PM | Last Updated on Tue, Aug 28 2018 4:00 PM

శుక్రవారం వరకూ టోల్ ట్యాక్స్ రద్దు - Sakshi

శుక్రవారం వరకూ టోల్ ట్యాక్స్ రద్దు

న్యూఢిల్లీ: రూ.500, 1000 నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా టోల్ప్లాజాల వద్ద వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వరకూ దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద టోల్ ట్యాక్స్ను రద్దు చేసింది. ఈ నెల 11వ తేదీ అర్థరాత్రి వరకూ టోల్ ట్యాక్స్ రద్దు అమల్లో ఉంటుంది. మరోవైపు అయిదు వందలు, వెయ్యి నోట్లను స్వీకరించాలంటూ కేంద్రం టోల్ ప్లాజాదారులకు ఆదేశాలు ఇచ్చింది.

కాగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ ప్రజలను 'చిల్లర' కష్టాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు అపురూపంగా చూసుకున్న 500, 1000 రూపాయల నోట్లు చేదైపోయి.. జేబులో ఉన్న 10 రూపాయల నోట్లకే డిమాండ్ పెరిగింది. పెట్రోల్ బంక్‌లు, టోల్‌గేట్‌ల వద్ద వాహనదారులు వద్దన్నా పెద్దనోట్లే ఇస్తుండటంతో వాటి నిర్వాహకులకు 'చిల్లర కష్టాలు' చుక్కలు చూపిస్తున్నాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కాగా గురుగ్రామ్లోని ఓ టోల్‌ ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. వాహనదారులు తమ వద్ద చిల్లర లేదంటూ 500, 1000 రూపాయల నోట్లే ఇస్తుండటంతో ఆ టోల్‌ ప్లాజా వద్ద పెద్ద ట్రాఫిక్ జాం ఏర్పడే పరిస్థితి ఎదురైంది. దీంతో టోల్ ప్లాజా నిర్వాహకులు గంట పాటు మీరేం టోల్ చార్జి కట్టక్కర్లేదంటూ వాహనాలను పంపించేసి అక్కడ ఉన్న ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement