కాల్‌ డ్రాప్స్‌కి టోల్‌ఫ్రీ.. ‘1955’! | Government to launch toll free number '1955' for call drops | Sakshi
Sakshi News home page

కాల్‌ డ్రాప్స్‌కి టోల్‌ఫ్రీ.. ‘1955’!

Published Tue, Dec 20 2016 12:40 AM | Last Updated on Tue, Aug 28 2018 3:57 PM

కాల్‌ డ్రాప్స్‌కి టోల్‌ఫ్రీ.. ‘1955’! - Sakshi

కాల్‌ డ్రాప్స్‌కి టోల్‌ఫ్రీ.. ‘1955’!

కేంద్ర ప్రభుత్వం కాల్‌ డ్రాప్స్‌కు ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కాల్‌ డ్రాప్స్‌కు ‘1955’ నంబర్‌ కేటాయించినట్లు అధికారిక సమాచారం.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కాల్‌ డ్రాప్స్‌కు ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కాల్‌ డ్రాప్స్‌కు ‘1955’ నంబర్‌ కేటాయించినట్లు అధికారిక సమాచారం. ఈ నంబర్‌ ద్వారా టెలికం సబ్‌స్క్రైబర్ల కాల్‌ డ్రాప్స్‌పైఫీడ్‌బ్యాక్‌ ఇవ్వొచ్చు. ‘1955’ నంబర్‌ కేటాయింపు అన్ని టెల్కోలకు తప్పనిసరి. ఈ నంబర్‌ ఎస్‌టీడీ, లోకల్‌ కాలింగ్‌కు అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ రంగ ఎంటీఎన్‌ఎల్‌ ఈ నంబర్‌ అమలు, నిర్వహణ బాధ్యతలనుచూసుకోనుంది. దీని నుంచి టెల్కోలు ఎలాంటి ఫీజులను వసూలు చేయకూడదు. ఇక టెలికం మంత్రి మనోజ్‌ సిన్హా ఈ నంబర్‌ను ప్రారంభిస్తారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement