![గ్రామాల్లో ఆరోగ్య సేవలకు 10588 - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/61482702234_625x300.jpg.webp?itok=phI7R71T)
గ్రామాల్లో ఆరోగ్య సేవలకు 10588
న్యూఢిల్లీ: గ్రామీణులు తమ ప్రాంతంలో మాతాశిశువులకు ఉన్న ఆరోగ్య సౌకర్యాల గురించి విచారించుకోడానికి, ఫిర్యాదులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబరును ప్రవేశపెట్టనుంది. వినియోగదారులు 10588 అనే నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే 90 సెకన్లలో కాల్ సెంటర్ నుంచి ఫోన్ వస్తుంది. అక్కడి సిబ్బంది వినియోగదారుల సందేహాలను నివృత్తి చేస్తారు. కాల్ సెంటర్‌ను తెలుగు సహా ఏడు భాషల్లో నిర్వహించనున్నారు.