మరో 30యేళ్ల పాటు టోల్ ట్యాక్స్ బాదుడు?
మరో 30యేళ్ల పాటు టోల్ ట్యాక్స్ బాదుడు?
Published Sat, Aug 6 2016 7:27 PM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
న్యూఢిల్లీ: దేశంలో టోల్‌టాక్స్‌ల పేరుతో సాగుతున్న వసూళ్ల పరంపర మరో ముప్పై సంవత్సరాలు కొనసాగునుందట. నేషనల్ హైవేలపై వసూలు చేసే టోల్ ట్యాక్స్ ను మరో 30 ఏళ్ల పాటు వసూలు చేసే అవకాశం ఉందని జాతీయ మీడియా రిపోర్టుచేసింది. ప్రధానంగా భారత్ మాలా పథకంలో భాగంగా చేపట్టనున్న ప్రాజెక్టులకవసరమైన నిధుల కోసం రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రతిపాదించనుంది. ప్రజా నిధులతో సుమారు 75 జాతీయ రహదారులు ప్రాజెక్టుల నిర్మాణం కోసం యత్నిస్తున్న మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రతిపాదనకు త్వరలోనే కేంద్ర క్యాబినేట్ ఆమోదం కూడా లభించనుంది.
25 నుంచి30 సం.రాలపాటు ప్రయివేటు నిర్వాహకులకు ఈ టోల్ ట్యాక్స్ వసూలు చేసే బాధ్యతలను అప్పగించనుంది. దీనికి ఆమోద ముద్ర పడితే సుమారు ఎనభైవేల కోట్ల రూపాయల ఆదాయాన్నిఆర్జించవచ్చని మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. టోల్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (టీవోటీ) మోడల్ కింద కొన్న ప్రాజెక్టులను ఇప్పటికే గుర్తించింది. గత రెండేళ్లుగా అమల్లో ఉన్నదీనిద్వారా ప్రభుత్వానికి రూ.2700కోట్ల వార్షికఆదాయం సమకూరుతోంది.పటిష్టమైన రహదారులు నిర్వహణ మరింత సమర్థవంతంగా భరోసా, తక్షణ వనరుల కల్పన కోసం ప్రభుత్వం ఈ యోచన చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పినట్టుగా జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. మరోవైపు దాదాపు50వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం కోసం ఏడులక్షల కోట్లను వెచ్చించనున్నట్టు ప్రభుత్వం గతనెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
టోల్‌టాక్స్ వసూళ్లతో దేశంలో వాహనంతో రోడ్డుమీదికి రావాలంటే గుండె దడ పుడుతోందన్న విమర్శలు చెలరేగాయి. ప్రయాణానికి వాహనానికి అవసరమైన ఇంధనానికయ్యే ఖర్చు కన్నా, టోల్‌టాక్స్‌ల భారం తడిసిమోపెడు అవుతోంది. దేశవ్యాప్తంగా టోల్ మాఫియా దోపిడీ ఎక్కువైందని ప్రజల నుంచి మొదలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులదాకా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement