వివరాలు వెల్లడిస్తున్న మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ, చిత్రంలో నిందితులు స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు,సెల్‌ఫోన్లు
నేరేడ్‌మెట్: టు లెట్ బోర్డు ఉన్న ఇళ్లనే టార్గెట్‌చేస్తూ చోరీలు చేస్తున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 14 తులాల నగలు స్వాధీనం చేసుకున్నారు. శనివారం నేరేడ్‌మెట్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ వెల్లడించారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పరిధిలోని సుబ్బమ్మ కాలనీ(బాలాజీనగర్)కు చెందిన మందల మధుగౌడ్ అలియాస్ మధు(32), మందల రేణుకా(24) 2011 సంవత్సరంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మధుగౌడ్ కొంత కాలం కూలి పనులు చేశాడు. 2016 నుంచి దమ్మాయిగూడలోని ఓ మద్యం దుకాణంలో పని చేస్తున్నాడు. భార్యభార్యల్దిదరూ కల్లుతాగేందుకు తరుచూ ఓల్డ్ సఫిల్‌గూడలోని కల్లు కంపౌండ్‌కు వెళుతుంటారు.
తన సంపాదనతో ఇంటి అవసరాలకు సరిపోవకపోవడంతో టు–లెట్ బోర్డు ఉన్న ఇళ్లలో అద్దె కావాలంటూ వెళ్లి చోరీలు చేయాలని పథకం వేశారు. తమ ముగ్గురు కొడుకుల(ముగ్గురిది ఐదేళ్లలోపు వయసు)ను వెంట తీసుకొని జనవరి 29న కల్లుతాగి దంపతులు నేరేడ్‌మెట్ ఠాణా పరిధిలో బల్‌రామ్‌నగర్‌లోని బీ.నాగలక్ష్మి ఇంటికి టు –లెట్ బోర్డు చూసి ఇంట్లోకి వెళ్లారు.ఆ సమయంలో ఇంట్లోని వారు నిద్రపోతున్నారు. భర్త ఇంటి బయట కాపాలాగా ఉండగా..భార్య లోపలికి వెళ్లి బీరువాలో ఉన్న బంగారు, సెల్‌ఫోన్‌లను చోరీచేసి దంపతులు ఉడాయించారు. మరుసటి రోజు జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఈసీఐఎల్ సౌత్ కమలానగర్ బాలమురుగన్ ఇంట్లో స్నానం చేస్తుండగా భార్య ఇంట్లోకి వెళ్లి సెల్‌ఫోన్‌తోపాటు రూ.400 చోరీకి పాల్పడింది. శనివారం ఉదయం వారు బంగారు నగలు, సెల్‌ఫోన్ విక్రయించేందుకు వినాయకనగర్ ప్రాంతంలో తిరుగుతుండగా అనుమానం వచ్చిన క్రైం పార్టీ పోలీసులు ఠాణాకు తీసుకువచ్చి విచారించగా చోరీల విషయం వెల్లడైంది. వారినుంచి14తులాల బంగారు ఆభరణాలతోపాటు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని,రిమాండ్‌కు తరలించినట్టు డీసీపీ వివరించారు. ఏసీపీ కృష్ణమూర్తి, సీఐలు జగదీష్‌చందర్, అంజిరెడ్డి,ఎస్‌ఐ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment