టోల్ తిప్పలు షురూ
- వాహనదారులకు మళ్లీ ‘చిల్లర’ కష్టాలు
- రూ.2 వేల నోటు తీసుకోని టోల్‌ప్లాజా నిర్వాహకులు.. పలుచోట్ల వాగ్వాదం
- రహదారులపై భారీగా నిలిచిపోరుున వాహనాలు
- స్వైపింగ్ మిషన్ల ఏర్పాటుతో అక్కడక్కడ కాస్త ఊరట
సాక్షి నెట్‌వర్క్: రహదారులపై టోల్ తిప్పలు మళ్లీ మొదలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి టోల్ వసూలు ప్రారంభమవడంతో చిల్లర కొరతతో అటు వాహనదారులు, ఇటు టోల్‌ప్లాజా నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల నిర్వాహకులు స్వైపింగ్ యంత్రాలతో రుసుము వసూలు చేసినా.. కార్డులు, సరిపడ చిల్లర లేనివాళ్లు నానా తిప్పలు పడ్డారు. పలుచోట్ల వాహనదారులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. అనేకచోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ వసూలును మరికొన్ని రోజులు నిలిపి వేయాలని, రూ.500, రూ.100, రూ.50 నోట్లను అవసరమైన మేర విడుదల చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
దారులపై బారులు
పెద్ద అంబర్‌పేట ఔటర్‌రింగ్ రోడ్డుపై ఉన్న టోల్‌గేటు వద్ద రూ.2 వేల నోటుకు చిల్లర ఇచ్చేందుకు టోల్ సిబ్బంది నిరాకరించడంతో పలువురు వాహనదారులు వాగ్వాదానికి దిగారు. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని నానక్‌రాంగూడ వద్ద వందలాది వాహనాలు నిలిచిపోయారుు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న రారుుకల్ టోల్ ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వారుు మండలంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా నిర్వాహకులు స్వైపింగ్ మిషన్లు సిద్ధంగా ఉంచినా రాత్రి వరకు పని చేయలేదు. కామారెడ్డి జిల్లా భిక్కనూరులోని జాతీయ రహదారిపై ఉన్న టోల్‌గేట్ వద్ద ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కొందరు వాహనదారులు పాత రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవాలని టోల్‌గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ శివారులోని టోల్‌ప్లాజాల వద్ద కూడా స్వైప్ మిషన్లను అందుబాటులోకి తెచ్చారు. కొందరు కొత్త రూ.2 వేల నోటు ఇవ్వడంతో నిర్వాహకులు చిల్లర లేదన్నారు. దీంతో వాహనదారులు వారితో వాగ్వాదానికి దిగారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని ముత్తంగి ఔటర్ రింగ్‌రోడ్డు టోల్‌ప్లాజా వద్ద ఐదు బూత్‌లకు గాను ఒకే స్వైపింగ్ యంత్రం అందుబాటులో ఉంచడంతో వాహనాలు భారీగా నిలిచిపోయారుు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద చిల్లర కొరతతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయారుు.