autarring road
-
టోల్ తిప్పలు షురూ
- వాహనదారులకు మళ్లీ ‘చిల్లర’ కష్టాలు - రూ.2 వేల నోటు తీసుకోని టోల్‌ప్లాజా నిర్వాహకులు.. పలుచోట్ల వాగ్వాదం - రహదారులపై భారీగా నిలిచిపోరుున వాహనాలు - స్వైపింగ్ మిషన్ల ఏర్పాటుతో అక్కడక్కడ కాస్త ఊరట సాక్షి నెట్వర్క్: రహదారులపై టోల్ తిప్పలు మళ్లీ మొదలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి టోల్ వసూలు ప్రారంభమవడంతో చిల్లర కొరతతో అటు వాహనదారులు, ఇటు టోల్‌ప్లాజా నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల నిర్వాహకులు స్వైపింగ్ యంత్రాలతో రుసుము వసూలు చేసినా.. కార్డులు, సరిపడ చిల్లర లేనివాళ్లు నానా తిప్పలు పడ్డారు. పలుచోట్ల వాహనదారులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. అనేకచోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ వసూలును మరికొన్ని రోజులు నిలిపి వేయాలని, రూ.500, రూ.100, రూ.50 నోట్లను అవసరమైన మేర విడుదల చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. దారులపై బారులు పెద్ద అంబర్‌పేట ఔటర్‌రింగ్ రోడ్డుపై ఉన్న టోల్‌గేటు వద్ద రూ.2 వేల నోటుకు చిల్లర ఇచ్చేందుకు టోల్ సిబ్బంది నిరాకరించడంతో పలువురు వాహనదారులు వాగ్వాదానికి దిగారు. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని నానక్‌రాంగూడ వద్ద వందలాది వాహనాలు నిలిచిపోయారుు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న రారుుకల్ టోల్ ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వారుు మండలంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా నిర్వాహకులు స్వైపింగ్ మిషన్లు సిద్ధంగా ఉంచినా రాత్రి వరకు పని చేయలేదు. కామారెడ్డి జిల్లా భిక్కనూరులోని జాతీయ రహదారిపై ఉన్న టోల్గేట్ వద్ద ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొందరు వాహనదారులు పాత రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవాలని టోల్గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ శివారులోని టోల్‌ప్లాజాల వద్ద కూడా స్వైప్ మిషన్లను అందుబాటులోకి తెచ్చారు. కొందరు కొత్త రూ.2 వేల నోటు ఇవ్వడంతో నిర్వాహకులు చిల్లర లేదన్నారు. దీంతో వాహనదారులు వారితో వాగ్వాదానికి దిగారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని ముత్తంగి ఔటర్ రింగ్‌రోడ్డు టోల్‌ప్లాజా వద్ద ఐదు బూత్‌లకు గాను ఒకే స్వైపింగ్ యంత్రం అందుబాటులో ఉంచడంతో వాహనాలు భారీగా నిలిచిపోయారుు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద చిల్లర కొరతతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయారుు. -
డీఐసీ ఫైళ్లు తీసుకెళ్తున్నవాహనం బోల్తా
అటెండర్‌కు తృటిలో తప్పిన ప్రాణాపాయం పైరవీ కార్ల వత్తిడితోనే ఫైళ్ల తరలింపు? ప్రమాద సంఘటనను గోప్యంగా ఉంచుతున్న అధికారులు సాక్షి, సంగారెడ్డి :డీఐసీ(పరిశ్రమల శాఖ ) కీలకమైన ఫైళ్లు హైదరాబాద్‌కు తరలిస్తున్న ఓ ప్రైవేటు వాహనం ఔటర్‌రింగ్ రోడ్డుపై శనివారం ప్రమాదానికి గురైంది. అయితే ఈ విషయం బయటికి పొక్కకుండా డీఐసీ అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. ప్రమాదంలో డీఐసీలో పనిచేస్తున్న అటెండర్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయానికి వేగంగా ఫైళ్లు చేరవేయాలన్న తొందరలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే పటా¯ŒSచెరు పాశమైలారం ప్రాంతంలోని ఓ పరిశ్రమకు చెందిన కీలకమైన ఫైల్ కొద్దికాలంగా పెండింగ్‌లో ఉంది. ఆ ఫైల్ శనివారం సాయంత్రంలోగా కమిషనర్ కార్యాలయానికి చేరకపోతే కంపెనీకి నష్టం వాటిల్లుతుంది. దీంతో కంపెనీ తరపున ఓ వ్యక్తి రంగంలోకి దిగి పైరవీలు మొదలు పెట్టారు. డీఐసీలోని ఓ ఉన్నతాధికారిని కలిసి తమ కంపెనీ ఫైల్ అర్జెంట్‌గా కమిషనర్ కార్యాలయానికి చేరవేయాల్సిందిగా కోరినట్లు తెలిసింది. కమిషనర్ కార్యాలయానికి ఒకే ఫైల్ పంపితే బాగుండదని తోడుగా మరికొన్ని ఫైళ్లు జతచేసి వాటిని అర్జెంట్‌గా పట్టుకెళ్లాలని అటెండర్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే కమిషనర్ కార్యాలయానికి వెళ్లేందుకు అటెండర్ ససేమిరా అనడంతో ఉన్నతాధికారి పైళ్లు తీసుకెళ్లకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు . దీంతో చేసేదేమిలేక పైళ్లు తీసుకెళ్లేందుకు అటెండర్ అంగీకరించినట్లు తెలిసింది. కంపెనీ తరపున వ్యక్తి కమిషనర్ కార్యాలయానికి వేగంగా పైల్ తీసుకెళ్లేందుకు ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఆ వాహనంలో అ టెండర్ పైళ్లు తీసుకుని కమిషనర్ కార్యాలయానికి బయలుదేరారు. త్వరగా కమిషనర్ కార్యాలయానికి వెళ్లాలని డ్రైవర్ వేగంగా కారు నడపటంతో ఔటర్ రింగ్‌రోడ్డుపై వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్, అ టెండర్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల వాహనాల్లో కమిషనర్ కార్యాలయానికి ఫైళ్లు పంపించటం, అటెండర్‌ను బలవంతంగా పంపిన తీరును డీఐసీ సిబ్బంది తప్పుబడుతున్నారు. ఈ విషయమై డీఐసీ అధికారుల వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ప్రమాదం విషయాన్ని నిర్థారించుకునేందుకు అటెండర్ సైతం అందుబాటులో లేడు.