Svaiping missions
-
ప్రశ్నార్థకంగా నగదు రహిత లావాదేవీల నిర్వహణ
► అందుబాటులో లేని స్వైపింగ్ మిషన్లు ► ప్రశ్నార్థకంగా మారిన నగదు రహిత లావాదేవీల నిర్వహణ కడప అగ్రికల్చర్: నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకోవాలంటే ప్రతి ఒక్కరికీ బ్యాంకుల్లో ఖాతా ఉండాలి. తప్పని సరిగా రూపే,డెబిట్ కార్డులు ఉండాలి. జిల్లాలో 75 శాతం మందికి ఖాతాలు ఉన్నా అందులో 30 శాతం మందికి కూడా డెబిట్, రూపే, ఏటీఎం కార్డులు లేవు. ఈ పరిస్థితిలో దుకాణాలు, పెట్రోలు బంకుల్లో పాయింట్ ఆఫ్ స్కేల్ మిషన్లు(పీఓఎస్ఎం) పెట్టి నగదు రహిత లావాదేవీలు చేయలేమని వ్యాపారులు అంటున్నారు. . జిల్లాలో రిజిస్టర్ చేసుకున్న షాపులు 3100, చౌకదుకాణాలు 1740 ఉన్నాయి. ఇందులో 2437 పీఓఎస్‌ఎంలు ఉన్నాయి. జిల్లాకు 10 వేల స్వైపింగ్ మిషన్లు కావాలని ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదికలు పంపింది. కిరాణా, మెడికల్ షాపులు, వస్త్ర, బంగారు, తదితర దుకాణాల్లో తప్పని సరిగా పీఓఎస్‌ఎంలు ఏర్పాటు చేసుకుని డెబిట్, రూపే కార్డుల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఆ దిశగా ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించింది. అయితే ఆయా షాపుల నిర్వాహకుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. కార్మిక, వాణిజ్య పన్నుల శాఖ వద్ద ఉన్న అంచనా ప్రకారం షాపులు దాదాపు 20 వేల దాకా ఉన్నట్లు సమాచారం. పీఓఎస్ఎంల కోసం వచ్చిన దరఖాస్తులు 150 దాకా ఉన్నట్లు బ్యాంకర్లు తెలిపారు. దీనిబట్టి చూస్తే నగదు రహిత లావాదేవీలపై వ్యాపార వర్గాలు అంతగా ఆసక్తి చూపడంలేదని తేటతెల్లమవుతోంది. బ్యాంకు ఖాతాలు ఉన్నా... డెబిట్ కార్డులు లేవు జిల్లాలో 29 లక్షలకు పైగా జనాభా ఉంది. జిల్లా మొత్తం 33 బ్యాంకులకు సంబంధించి 330 బ్రాంచీలు పనిచేస్తున్నాయి. ఇందులో పట్టణాల్లో 1,86,092, గ్రామీణ ప్రాంతాల్లో 1,97,658 ఖాతాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అన్ని రకాల కార్డులు 3,51,547 అందజేశారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 70 శాతం మందికి డెబిట్ కార్డులు లేవు. దీనిని బట్టి చూస్తే జిల్లా వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం సాధ్యమైన పని కాదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. కేవలం పెట్రోలు బంకులు, షాపింగ్ మాల్స్ల్లో మాత్రమే వీటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుందని, చిన్న దుకాణాల్లో ఈ విధానం అమలు చేసే పరిస్థితి లేదని చిరువ్యాపారులు చెబుతున్నారు. చౌక దుకాణాల్లో కనిపించని మినీ ఏటీఎంలు, స్వైపింగ్ మిషన్లు జిల్లాలో 1740 రేష¯ŒSషాపులు ఉన్నాయి. ఈ షాపుల డీలర్లను బిజినెస్ కరస్పాండెట్లుగా నియమించి, మినీ ఏటీఎంలు, డెబిట్ కార్డులు అందజేసి నగదు రహిత లావేదేవీలు నిర్వహిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పినా ఎక్కడ కూడా అది అమలు కావడం లేదు. స్వైపింగ్ మిషన్లు అందజేయకపోవడంతో నగదు రహితం అమలుకు నోచుకోలేదు. -
టోల్ తిప్పలు షురూ
- వాహనదారులకు మళ్లీ ‘చిల్లర’ కష్టాలు - రూ.2 వేల నోటు తీసుకోని టోల్‌ప్లాజా నిర్వాహకులు.. పలుచోట్ల వాగ్వాదం - రహదారులపై భారీగా నిలిచిపోరుున వాహనాలు - స్వైపింగ్ మిషన్ల ఏర్పాటుతో అక్కడక్కడ కాస్త ఊరట సాక్షి నెట్వర్క్: రహదారులపై టోల్ తిప్పలు మళ్లీ మొదలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి టోల్ వసూలు ప్రారంభమవడంతో చిల్లర కొరతతో అటు వాహనదారులు, ఇటు టోల్‌ప్లాజా నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల నిర్వాహకులు స్వైపింగ్ యంత్రాలతో రుసుము వసూలు చేసినా.. కార్డులు, సరిపడ చిల్లర లేనివాళ్లు నానా తిప్పలు పడ్డారు. పలుచోట్ల వాహనదారులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. అనేకచోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ వసూలును మరికొన్ని రోజులు నిలిపి వేయాలని, రూ.500, రూ.100, రూ.50 నోట్లను అవసరమైన మేర విడుదల చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. దారులపై బారులు పెద్ద అంబర్‌పేట ఔటర్‌రింగ్ రోడ్డుపై ఉన్న టోల్‌గేటు వద్ద రూ.2 వేల నోటుకు చిల్లర ఇచ్చేందుకు టోల్ సిబ్బంది నిరాకరించడంతో పలువురు వాహనదారులు వాగ్వాదానికి దిగారు. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని నానక్‌రాంగూడ వద్ద వందలాది వాహనాలు నిలిచిపోయారుు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న రారుుకల్ టోల్ ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వారుు మండలంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా నిర్వాహకులు స్వైపింగ్ మిషన్లు సిద్ధంగా ఉంచినా రాత్రి వరకు పని చేయలేదు. కామారెడ్డి జిల్లా భిక్కనూరులోని జాతీయ రహదారిపై ఉన్న టోల్గేట్ వద్ద ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొందరు వాహనదారులు పాత రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవాలని టోల్గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ శివారులోని టోల్‌ప్లాజాల వద్ద కూడా స్వైప్ మిషన్లను అందుబాటులోకి తెచ్చారు. కొందరు కొత్త రూ.2 వేల నోటు ఇవ్వడంతో నిర్వాహకులు చిల్లర లేదన్నారు. దీంతో వాహనదారులు వారితో వాగ్వాదానికి దిగారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని ముత్తంగి ఔటర్ రింగ్‌రోడ్డు టోల్‌ప్లాజా వద్ద ఐదు బూత్‌లకు గాను ఒకే స్వైపింగ్ యంత్రం అందుబాటులో ఉంచడంతో వాహనాలు భారీగా నిలిచిపోయారుు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద చిల్లర కొరతతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయారుు. -
పార్లమెంటులో నగదు రహిత లావాదేవీలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో నగదు రహిత లావాదేవీలకు వీలుగా కార్డు ద్వారా చెల్లింపులు స్వీకరించేందుకు స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. ఆహార నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఉన్న టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి అన్ని క్యాంటీన్లలో ఈ మిషన్ల ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. బుధవారం వీటిని లోక్‌సభ స్పీకర్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పార్లమెంటు క్యాంటీన్లలో నగదు రహిత లావాదేవీలకు వీలు కల్పించిన జితేందర్ రెడ్డిని ప్రశంసించారు. -
అంతటా క్యాష్‌లెస్!
- నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించండి - జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం సాక్షి, హైదరాబాద్: కొంతకాలం పాటు కరెన్సీ కొరత కొనసాగనున్నందున అత్యవసరంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించా లని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఆ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలని, తగిన ప్రచారం చేయాలంది. వ్యాపార వాణిజ్య లావాదేవీలు సజావుగా సాగేందుకు ఎన్ని స్వైపింగ్ మిషన్లు కావాలో అంచనా వేయాలంది. ఖాతాలు లేని వయోజ నులందరికీ అకౌంట్లు తెరిపించేందుకు బ్యాం కర్ల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించా లని కోరింది. వాణిజ్య పన్నుల చెల్లింపులన్నీ నగదు రహితంగా జరిగేలా డీలర్లు, వ్యాపారు లను ప్రోత్సహించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఖాతాదారులందరికీ రూపే కార్డులు రాష్ట్రంలో చాలా మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ అందరి వద్ద రూపే కార్డులు లేవు. ఈ క్రమంలో ప్రతి బ్యాంకు ఖాతాదారునికి రూపే కార్డును, పిన్ను అందించాలని ప్రభు త్వం కోరింది. బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కలెక్టర్లను ఆదే శించింది. ఖాతా నంబరు తెలియకపోరుునా ఆధార్ సాయంతో సంబంధిత బ్యాంకు ఖాతాల్లో ఎక్కడ్నుంచైనా చెల్లింపులు జరిపే ఏర్పాట్లు చేయాలని కోరింది. ప్రతి వంద, రెండొందల కుటుంబాల బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ఓ అధికారిని నియమించాలని ఆదేశించింది. ప్రతి గ్రామంలో బ్యాంక్ కోఆర్డినేటర్‌ను అం దుబాటులో ఉంచాలంది. లీడ్‌బ్యాంక్ మేనే జర్లతో పాటు మీసేవ సెంటర్ల ఇన్చార్జిలు, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలంది. జిల్లాల పరిధిలో చాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు, వర్గాలతో సమావేశమై డిజిటల్ చెల్లింపులకు అవసరమైన వ్యూహ రచన చేయాలని సూచించింది. ఆర్టీసీ బస్సుల్లో స్వైపింగ్ మిషన్లు నగదు రహిత చెల్లింపులకు ప్రభుత్వ శాఖల్లో కార్డ్ స్వైపింగ్ మిషన్లను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతా నికి స్వైపింగ్ మిషన్ల కొరత నేపథ్యంలో పెద్ద ఎత్తున బిల్లులు చెల్లింపులు జరిగే మార్కెట్ యార్డులు, సహకార సంస్థలు, రైతు బజార్లు, రేషన్ దుకాణాలు, ఆర్టీసీ బస్సులు, మీసేవా కేంద్రాల్లో ఈ యంత్రాలను ఏర్పా టు చేయాలని ఆదేశించింది. పెద్దఎత్తున చెల్లింపులు జరిగే విత్తనాలు, ఎరువుల దుకాణాలు, ప్రైవేటు ఆసుపత్రులు, మందుల దుకాణాలు, విద్యాసంస్థలు, పెట్రోల్ బంకుల్లో చెల్లింపులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. వయోజనులందరికీ ఖాతాలు 18 ఏళ్లు ఆపై వయసున్న పౌరులందరికీ బ్యాంకు ఖాతాలను ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించింది. ప్రధానంగా ఆసరా పింఛన్ లబ్ధిదారులు, ఉపాధి హామీ కూలీలు, అసంఘటిత రంగ కార్మికులకు బ్యాంకు ఖాతాలు ఇప్పించేం దుకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరింది.