అంతటా క్యాష్‌లెస్! | Cash Les Across! | Sakshi
Sakshi News home page

అంతటా క్యాష్‌లెస్!

Published Wed, Nov 30 2016 3:15 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

అంతటా క్యాష్‌లెస్! - Sakshi

అంతటా క్యాష్‌లెస్!

- నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించండి
- జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: కొంతకాలం పాటు కరెన్సీ కొరత కొనసాగనున్నందున అత్యవసరంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించా లని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఆ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలని, తగిన ప్రచారం చేయాలంది. వ్యాపార వాణిజ్య లావాదేవీలు సజావుగా సాగేందుకు ఎన్ని స్వైపింగ్ మిషన్లు కావాలో అంచనా వేయాలంది. ఖాతాలు లేని వయోజ నులందరికీ అకౌంట్లు తెరిపించేందుకు బ్యాం కర్ల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించా లని కోరింది. వాణిజ్య పన్నుల చెల్లింపులన్నీ నగదు రహితంగా జరిగేలా డీలర్లు, వ్యాపారు లను ప్రోత్సహించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్‌‌స నిర్వహించారు.

 ఖాతాదారులందరికీ రూపే కార్డులు
 రాష్ట్రంలో చాలా మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ అందరి వద్ద రూపే కార్డులు లేవు. ఈ క్రమంలో ప్రతి బ్యాంకు ఖాతాదారునికి రూపే కార్డును, పిన్‌ను అందించాలని ప్రభు త్వం కోరింది. బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కలెక్టర్‌లను ఆదే శించింది. ఖాతా నంబరు తెలియకపోరుునా ఆధార్ సాయంతో సంబంధిత బ్యాంకు ఖాతాల్లో ఎక్కడ్నుంచైనా చెల్లింపులు జరిపే ఏర్పాట్లు చేయాలని కోరింది. ప్రతి వంద, రెండొందల కుటుంబాల బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ఓ అధికారిని నియమించాలని ఆదేశించింది. ప్రతి గ్రామంలో బ్యాంక్ కోఆర్డినేటర్‌ను అం దుబాటులో ఉంచాలంది. లీడ్‌బ్యాంక్ మేనే జర్లతో పాటు మీసేవ సెంటర్ల ఇన్‌చార్జిలు, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలంది. జిల్లాల పరిధిలో చాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు, వర్గాలతో సమావేశమై డిజిటల్ చెల్లింపులకు అవసరమైన వ్యూహ రచన చేయాలని సూచించింది.

 ఆర్టీసీ బస్సుల్లో స్వైపింగ్ మిషన్లు
 నగదు రహిత చెల్లింపులకు ప్రభుత్వ శాఖల్లో కార్డ్ స్వైపింగ్ మిషన్‌లను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతా నికి స్వైపింగ్ మిషన్‌ల కొరత నేపథ్యంలో పెద్ద ఎత్తున బిల్లులు చెల్లింపులు జరిగే మార్కెట్ యార్డులు, సహకార సంస్థలు, రైతు బజార్లు, రేషన్ దుకాణాలు, ఆర్టీసీ బస్సులు, మీసేవా కేంద్రాల్లో ఈ యంత్రాలను ఏర్పా టు చేయాలని ఆదేశించింది. పెద్దఎత్తున చెల్లింపులు జరిగే విత్తనాలు, ఎరువుల దుకాణాలు, ప్రైవేటు ఆసుపత్రులు, మందుల దుకాణాలు, విద్యాసంస్థలు, పెట్రోల్ బంకుల్లో చెల్లింపులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది.
 
 వయోజనులందరికీ ఖాతాలు
 18 ఏళ్లు ఆపై వయసున్న పౌరులందరికీ బ్యాంకు ఖాతాలను ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించింది. ప్రధానంగా ఆసరా పింఛన్ లబ్ధిదారులు, ఉపాధి హామీ కూలీలు, అసంఘటిత రంగ కార్మికులకు బ్యాంకు ఖాతాలు ఇప్పించేం దుకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement