దేవస్థానం టోల్‌గేట్‌ ఆదాయం రూ.92.64 లక్షలు | toll gate income | Sakshi
Sakshi News home page

దేవస్థానం టోల్‌గేట్‌ ఆదాయం రూ.92.64 లక్షలు

Published Tue, Sep 27 2016 9:59 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

toll gate income

అన్నవరం:  
దేవస్థానం టోల్‌గేట్‌లో చిన్నకార్లు, టూరిస్ట్‌బస్సులు, లారీల నుంచి టోల్‌ వసూలు చేయడానికి  నిర్వహించిన వేలంపాట నెలకు రూ.7.72 లక్షలకు ఖరారైంది. దీంతో ఆ టోల్‌గేట్‌ ద్వారా దేవస్థానానికి ఏడాదికి రూ. 92.64 లక్షలు ఆదాయం సమకూరనుందని దేవస్థానం ఇన్‌చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు మంగళవారం సాయంత్రం సాక్షికి తెలిపారు. గత ఏడాది ఇదే టోల్‌ వసూలు చేయడానికి నిర్వహించిన వేలం పాట నెలకు రూ.6.14 లక్షలు మాత్రమే. దీంతో ఈ ఏడాది అదనంగా సుమారు రూ.19 లక్షలు ఆదాయం పెరిగిందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement