![BJP MLA Kicks And Slaps Toll Gate Worker In Rajasthan - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/18/BJP-MLA-Jeetmal-Khant-Toll-.jpg.webp?itok=bhZtUZmx)
జైపూర్: తన అనుచరుల వాహనాలను అనుమతించలేదన్న సాకుతో ఓ టోల్‌గేట్ ఉద్యోగిపై బీజేపీ ఎమ్మెల్యే గుండాగిరీకి దిగాడు. ఇష్టారీతిగా తిట్టి, చెయ్యిచేసుకున్నాడు. అయినాసరే, ఆయనపై కేసు నమోదుకాలేదు. సదరు టోల్‌గేట్ సంస్థా ఉద్యోగికి అండగా నిలవలేదు!
వైరల్ వీడియో: రాజస్థాన్‌లోని బాన్స్‌వారా జిల్లా ఉదయ్‌పూర్ రోడ్డుపై ఉన్న టోల్‌ప్లాజాలో శనివారం చోటుచేసుకుందీ ఘటన. బీజేపీ ఎమ్మెల్యే జీత్‌మల్ కాంత్.. టోల్ ప్లాజా ఉద్యోగిని కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గరీహ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యవ వహిస్తోన్న ఆయన.. తన అనుచరుల వాహనాలకు ట్యాక్స్ వసూలు చేస్తున్నారనే ఆగ్రహంతో ఇలా దాడికి దిగారు. కాగా, ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నా, ఫిర్యాదు అందలేదు కాబట్టి కేసు నమోదు చేయలేదని పోలీసులు అంటున్నారు. దెబ్బలుతిన్న టోల్‌గేట్ ఉద్యోగి.. ఎమ్మెల్యేపై కేసు పెట్టడానికి ముందుకురాలేదని తెలిపారు. తన వైరల్ వీడియోపై మాట్లాడేందుకు ఎమ్మెల్యే జీత్‌మల్ నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment