
బీజేపీ నాయకుల మధ్య గలాట
ఆళ్వార్ : రాజస్థాన్ బీజేపీలో కలకలం రేగింది. బీజేపీ చేపట్టిన గౌరవ్‌యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి వసుంధర రాజే వేదికపై మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది. రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గౌరవ్‌యాత్ర చేపట్టారు. సమావేశం కొనసాగుతుండగానే రోహిత్ శర్మ, దేవీసింగ్ షెకావత్ మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ తలెత్తింది. అది తీవ్ర రూపం దాల్చడంతో ఇద్దరూ ఒకరిపైఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి ఇద్దరినీ దూరంగా తీసుకెళ్లడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా, బీజేపీకీ గుడ్‌బై చెప్పిన మాజీ కేంద్రమంత్రి జశ్వంత్‌సింగ్ కుమారుడు మన్వేందర్‌సింగ్ బీజేపీ గౌరవ్‌యాత్రకు వ్యతిరేకంగా ‘స్వాభిమాన్ ర్యాలీ’చేపట్టిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment