ఇన్‌ఫ్రా రంగం ప్రతికూలం–ఇండ్‌ రా | India Ratings maintains negative outlook on infra sector for | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫ్రా రంగం ప్రతికూలం–ఇండ్‌ రా

Published Wed, Feb 22 2017 1:46 AM | Last Updated on Tue, Aug 28 2018 3:57 PM

ఇన్‌ఫ్రా రంగం ప్రతికూలం–ఇండ్‌ రా - Sakshi

ఇన్‌ఫ్రా రంగం ప్రతికూలం–ఇండ్‌ రా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రేటింగ్‌ ఎజెన్సీ ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసర్చ్‌ (ఇండ్‌–రా) 2017–18లో మౌలిక రంగం ప్రతికూలంగా ఉంటుందని తెలిపింది. టోల్‌ రోడ్లు, బొగ్గు ఆధారిత విద్యుత్, పవన విద్యుత్‌ విభాగాలకు ఎదురుగాలి తప్పదని ఇండ్‌–రా ఇన్‌ఫ్రా, ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ వెంకట్రామన్‌ రాజారామన్‌ తెలిపారు.

ఇన్‌ఫ్రా రంగం క్రెడిట్‌ ఔట్‌లుక్‌ నివేదికను విడుదల చేసిన సందర్భంగా మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. నివేదిక ప్రకారం.. ప్రభుత్వ విధానాలు, ప్రయాణికుల వృద్ధి కారణంగా విమానయాన రంగానికి వచ్చే ఆర్థిక సంవత్సరం సానుకూలంగా ఉంటుంది. సోలార్, పోర్టులు, ట్రాన్స్‌మిషన్‌ రంగాలు స్థిరంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement