ఒకసారి ఈ వంతెనపై వెళితే రూ 250.. | One-way  Toll Charge For Bandra-Versova Sea Link Set At Rs 250 | Sakshi
Sakshi News home page

ఒకసారి ఈ వంతెనపై వెళితే రూ 250..

Published Fri, May 18 2018 2:07 PM | Last Updated on Tue, Aug 28 2018 3:57 PM

One-way  Toll Charge For Bandra-Versova Sea Link Set At Rs 250 - Sakshi

ప్రతిపాదిత బాంద్రా వెర్సోవా సీ లింక్‌

సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాంద్రా-వెర్సోవా సీ లింక్‌పై ప్రయాణించే వాహనాల నుంచి రూ 250 టోల్‌ రుసుంగా వసూలు చేస్తారు. 2023లో ఈ సీ లింక్‌ అందుబాటులోకి రానుంది. ఈ మొత్తంతో ముంబయిలో మూడు లీటర్లుపైగా పెట్రోల్‌ లభిస్తుందని ముంబయి వాసులు పెదవివిరుస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు గత ఏడాది డిసెంబర్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్ర క్యాబినెట్‌ ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ఎనిమది సంవత్సరాల తర్వాత పాలనా అనుమతులు లభించడం గమనార్హం.

17 కిమీ పొడవైన ఈ సీ లింక్‌పై కిలోమీర్‌కు రూ 19.80 చొప్పున టోల్‌ వసూలు చేస్తారు. 17.17 కిమీ పొడవైన ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ 7502 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2020 నాటికి తొలిదశలో భాగంగా అందుబాటులోకి వచ్చే బాంద్రా వెర్సోవా సీలింక్‌ ద్వారా 14 ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను తప్పించుకోవచ్చని, 45,500 వాహనాలు ఈ రూట్‌లో ప్రయాణించవచ్చని భావిస్తున్నారు. 2045 నాటికి 1,20,500 వాహనాలు ఈ రూట్‌లో రాకపోకలు సాగుతాయని అంచనా వేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement