Sea Link
-
ట్రాఫిక్ పోలీసులపై యువతి వీరంగం.. చేయి నరికేస్తా అంటూ బెదిరింపులు
ముంబై: మహారాష్ట్రలో ఓ యువతి హల్చల్ చేసింది. నిబంధనలకు విరుద్దంగా రోడ్డుపై డ్రైవ్ చేయడమే కాకుండా.. బైక్ ఆపిన పోలీసులపై రెచ్చిపోయి ప్రవర్తించింది. ట్రాఫిక్ పోలీసులపై దుర్భషలాడుతూ కానిస్టేబుల్‌ను నెట్టేసింది. ఈ ఘటన ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్ వద్ద జరిగింది. వివరాలు.. నూపుర్ ముఖేష్ పటేల్ అనే 26 ఏళ్ల ఆర్కిటెక్ట్ దక్షణి ముంబై వైపు అతివేగంతో వెళుతోంది. గుర్తించిన బాంద్రా-వర్లీ సీ లింక్ ట్రాఫిక్ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అయితే మహిళ తన బైక్‌ను దిగడానికి నిరాకరించింది. దీంతో పోలీసులుర ఆమెను కిందకు దింపేందుకు ప్రయత్నించగా వారితో వాదించడం ప్రారంభించింది. ‘ఈ రోడ్డు నా తండ్రిది. నేను ట్యాక్స్ కడుతున్నాను. నన్ను ఎవరూ ఆపలేరు’ అంటూ పోలీసులను బెదిరించింది. బైకర్‌ను ఎంత విజ్ఞప్తి చేసినప్పటికీ వినిపించుకోకుండా బైక్‌ను నడిరోడ్డుపై నిలిపి ట్రాఫిక్ పోలీసులతో గొడవకు దిగింది. ‘నా బైక్‌పై చేయి పెట్టడానికి ఎంత ధైర్యం.. నీ చేయి నరికేస్తాను’ అంటూ రెచ్చిపోయింది. అంతేగాక ఓ కానిస్టేబుల్‌ను నెట్టేసింది. Meet NUPUR PATEL, joyriding on her motorcycle without a #helmet on the Bandra-Worli Sea Link where two-wheelers are not permitted. She started verbally #abusing the police and even allegedly pointed her cigarette lighter, which was shaped like a #pistol, at the police when asked… pic.twitter.com/wGzuSDaUW8 — ShoneeKapoor (@ShoneeKapoor) September 24, 2023 కాగా ట్రాఫిక్ పోలీసులతో మహిళ వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులతో ఆమె ప్రవర్తించిన విధానాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. యువతిని మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ ప్రాంతానికి చెందిన ఆమెగా గుర్తించారు. బుల్లెట్ బైక్ అక్కడి రియల్ ఎస్టేట్ సంస్థలో రిజిస్టర్ అయి ఉన్నట్లు తేలింది. మరోవైపు యువతిపై నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక విచారణకు హాజరు కావాల్సిందిగా సెక్షన్ 41A కింద ఆమెకు నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
ఒకసారి ఈ వంతెనపై వెళితే రూ 250..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాంద్రా-వెర్సోవా సీ లింక్‌పై ప్రయాణించే వాహనాల నుంచి రూ 250 టోల్ రుసుంగా వసూలు చేస్తారు. 2023లో ఈ సీ లింక్ అందుబాటులోకి రానుంది. ఈ మొత్తంతో ముంబయిలో మూడు లీటర్లుపైగా పెట్రోల్ లభిస్తుందని ముంబయి వాసులు పెదవివిరుస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు గత ఏడాది డిసెంబర్లో మహారాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్ర క్యాబినెట్ ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ఎనిమది సంవత్సరాల తర్వాత పాలనా అనుమతులు లభించడం గమనార్హం. 17 కిమీ పొడవైన ఈ సీ లింక్‌పై కిలోమీర్కు రూ 19.80 చొప్పున టోల్ వసూలు చేస్తారు. 17.17 కిమీ పొడవైన ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ 7502 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2020 నాటికి తొలిదశలో భాగంగా అందుబాటులోకి వచ్చే బాంద్రా వెర్సోవా సీలింక్ ద్వారా 14 ట్రాఫిక్ సిగ్నల్స్‌ను తప్పించుకోవచ్చని, 45,500 వాహనాలు ఈ రూట్లో ప్రయాణించవచ్చని భావిస్తున్నారు. 2045 నాటికి 1,20,500 వాహనాలు ఈ రూట్లో రాకపోకలు సాగుతాయని అంచనా వేస్తున్నారు. -
సొరంగ మార్గానికి గ్రీన్ సిగ్నల్
సాక్షి, ముంబై : భవిష్యత్తులో చూనాభట్టి నుంచి సీ లింక్ (బాంద్రా) వరకు కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇందుకోసం చూనాభట్టి చౌక్ (ఎడ్వర్డ్నగర్) నుంచి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ), బీకేసీ నుంచి బాంద్రా-వర్లీ సీలింక్ (బాంద్రా) వరకు సొరంగ మార్గానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ రెండు ప్రాజెక్టుల పనులను ప్రారంభించేందుకు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారటీ (ఎమ్మెమ్మార్డీఏ) ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ పనులు పూర్తయితే తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ముంబైకర్లకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇప్పటికే బీకేసీ ముంబైలోని పశ్చిమ, సెంట్రల్ రైల్వేలతోపాటు ప్రధాన రహదారులైన వెస్ట్రన్, ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేల మధ్య అభివృద్ధి పనులను ఎమ్మెమ్మార్డీఏ పూర్తి చేసింది. రెండు ప్రాజెక్టుల్లో కదలిక ప్రస్తుతం దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ కార్యాలయాలకు బీకేసీ ప్రధాన నీలయంగా మారింది. తూర్పు, అటు పశ్చిమ ప్రాంతాల నుంచి బీకేసీ వచ్చేవారి సంఖ్య అధికమైంది. ఈ నేపథ్యంలో వీరి సౌకర్యార్థం బీకేసీ నుంచి చునాబట్టి వరకు 1.6 కి.మీ. ఫై ్ల ఓవర్ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం మిఠీనది పరిసరాల్లో కేబుల్ సపోర్టుతో ఫై ్ల ఓవర్ నిర్మించాల్సి ఉంది. అందుకు మొత్తం రూ.261 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇది గత కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైంది. ఇటీవలే మిఠీనది మధ్య భాగంలో ఫ్లై ఓవర్ కోసం ఒక పిల్లర్ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టుకు కదలికవచ్చింది. దీంతోపాటు బీకేసీ నుంచి బాంద్రా సీలింక్ను కలిపేందుకు ఎమ్మెమ్మార్డీఏ ప్రతిపాదించింది. ఈ రెండు ప్రాజెక్టు పనులను తొందరగా ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. రాబోయే ఎన్నికల తర్వాత పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. సుమారు నాలుగేళ్లలో చూనాభట్టి నుంచి సీలింక్ (బాంద్రా) వరకు పనులు పూర్తి చేయాలనే సంకల్పంతో ఎమ్మెమ్మార్డీఏ ముందుకుసాగుతోందని ఓ అధికారి పేర్కొన్నారు.