టోల్ కట్టక్కర్లేదోచ్!
గరుగ్రామ్: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ ప్రజలను 'చిల్లర' కష్టాలు చుట్టుముట్టాయి. ఇంతకు ముందు అపురూపంగా చూసుకున్న 500, 1000 రూపాయల నోట్లు చేదైపోయి.. జేబులో ఉన్న 10 రూపాయల నోట్లకే డిమాండ్ పెరిగింది. పెట్రోల్ బంక్‌లు, టోల్‌గేట్‌ల వద్ద వాహనదారులు వద్దన్నా పెద్దనోట్లే ఇస్తుండటంతో వాటి నిర్వాహకులకు 'చిల్లర కష్టాలు' చుక్కలు చూపిస్తున్నాయి.
గురుగ్రామ్లోని ఓ టోల్ ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. వాహనదారులు తమ వద్ద చిల్లర లేదంటూ 500, 1000 రూపాయల నోట్లే ఇస్తుండటంతో ఆ టోల్ ప్లాజా వద్ద పెద్ద ట్రాఫిక్ జాం ఏర్పడే పరిస్థితి ఎదురైంది. దీంతో టోల్ ప్లాజా నిర్వాహకులు గంట పాటు మీరేం టోల్ చార్జి కట్టక్కర్లేదంటూ వాహనాలను పంపించేసి అక్కడ ఉన్న ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.