జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద పోలీసులను మోహరించాలని రాష్ట్రాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది.
న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద పోలీసులను మోహరించాలని రాష్ట్రాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. పాత నోట్ల రద్దు నేపథ్యంలో టోల్ గేట్ల వద్ద శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశముందని పేర్కొంది.
పాత 500 రూపాయలతో టోల్ గేట్ల వద్ద డిసెంబర్ 15 వరకు టోల్ ట్యాక్స్ చెల్లించవచ్చని కేంద్ర హోంశాఖ తెలిపింది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చెల్లింపులు జరిపేందుకు అవకాశాలున్నాయని వెల్లడించింది.