టోల్ ఫ్లాజావద్ద నిలిచిన వాహనాలు
సాక్షి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జాతీయ రహదారి దాదాపు 185 కిలోమీటర్ల మేర ఉంది. జిల్లాలో టోల్‌ప్లాజా నుంచి ప్రతి రోజు 7వేల కార్లు, 4వేల లారీలు, 2వేల బస్సులు, 5వేల భారీ వాహనాలు, 3వేల ఇతర వరకు వెళ్తుంటాయి. హైదరాబాద్ నుంచి కర్నూల్, కడప, అనంతపూర్, బెంగుళూర్ ప్రాంతాలకు వెళ్లే వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ కారణంగా జాతీయ రహదారిపై తరచూ ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. ఏదైన పండగలు, పలు సందర్భాల్లో రోడ్లపై ఉన్న టోల్ ప్లాజ్‌ల దగ్గర గంటల తరబడి వాహనాలు నిలిచిపోతుంటాయి. అత్యవసరంగా ఆస్పత్రులకు వెళ్లే వారు చాలా ఇబ్బంది పడుతుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని టోల్ గేట్‌ల దగ్గర కొత్త విధానానికి శ్రీకారం చూట్టారు. నేరుగా వాహనం వెళ్లిపోయేలా వెసులుబాటు కల్పించారు.
డిసెంబర్ 1నుంచి అమలు
ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని వచ్చేనెల 1వ తేదీనుంచి అమల్లోకి తెస్తున్నారు. దీనివల్ల టోల్‌ప్లాజా వద్ద వాహనదారులు ఇక ఆగాల్సిన అవసరం లేదు. పెరిగిన వాహనాల రద్దీ, ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి ఫాస్ట్ ట్యాగ్ సేవలు అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో జాతీయ రహదారిపై ప్రయాణం చేసే వాహనదారులు ముందే సిమ్‌ట్యాగ్ తీసుకొని వాటిలో ముందే నగదు వేసుకొని వాహనం ముందు భాగంలో స్టిక్కర్లు అతికించుకోవాలి. ఆ స్టికర్లను టోల్‌ప్లాజా దగ్గర ఉన్న స్కానర్లు వాటిని స్కాన్ చేసిన క్షణంలో ఖాతా నుంచి నగదు సంబంధిత టోల్‌ప్లాజా ఖాతాలోకి వెళ్తుంది. డిసెంబర్ 1 నుంచి ఒక బ్లాక్‌లో దీనిని ప్రయోగత్మకంగా పరిశీలన చేయనున్నారు.
సమయం ఆదా..
ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో అడ్డాకుల, బాలానగర్ దగ్గర రెండు టోల్‌ప్లాజాలు ఉన్నా యి. దీంట్లో ఒక వాహనం టోల్‌ప్లాజాను దాటడానికి కనీసం పది నిమిషాలు పడుతోంది. ఇక పండుగ, రద్దీ సమయాల్లో అయితే ఆర గంట నుంచి గంటకుపైగా అక్కడే రోడ్డుపై నిరీక్షించాల్సి వస్తోంది. అదేవిధంగా టోల్ రుసుము నగదు రూపంలో చెల్లిస్తుండటంతో సింగిల్‌కు ఒక విధానం డబుల్‌కు మరో విధానం ఉండటం వల్ల సరిపడ చిల్లర లేక మరింత అలస్యం అవుతుంది. ఈ సమస్యను నివారించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చర్యలు చేపట్టారు. డిసెంబర్ 1నుంచి ఆన్‌లైన్ చెల్లింపులకు శ్రీకారం చూడుతున్నారు. అప్పటి నుంచి పూ ర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని టోల్‌ప్లాజా యాజమాన్యాలకు కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి.
ఆరు బ్యాంకుల్లో అవకాశం
ఫాస్ట్‌ట్యాగ్ సిమ్‌కార్డును తీసుకోవడానికి ఆరు ప్రధాన బ్యాంకుల్లో అవకాశం కల్పించారు. జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా నిర్వహకులు ఒక్కొక్కరు ఒక్కోక్క విధానాలు అమలు చేస్తున్నారు. దీంతో వారికి అనుబంధంగా ఉన్న ఆరు బ్యాంకుల్లో ఏదో ఒక దాంట్లో నుంచి ఫాస్ట్‌ట్యాగ్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ముందుగానే కొంత నగదు వేయాల్సి ఉంటుంది. ఇలా వేసిన తర్వాత జాతీయ రహదారిపై ప్రయాణం చేసే సమయంలో ఆ ఖాతా నుంచి కొంత నగదు కట్ అవుతున్న క్రమంలో మళ్లి వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మొదట కొంత ఇబ్బంది ఉన్న తర్వాత సులువు కానుంది. టోల్‌ప్లాజా దగ్గర చిల్లర కోసం ఇతర కారణాల వల్ల గంటల కొద్ది ట్రాఫిక్‌లో ఇరుకుపోయే కంటే ఇది చాలా సువులుగా ఉంటుంది. ఈ పద్ధతి వల్ల వచ్చిన ప్రతి వాహనం సెకెండ్‌లలో టోల్‌గేట్‌ను దాటివెళ్తోంది. దీంతో సమస్యలు ఉత్పన్నం కావు.
ఆన్‌లైన్ చెల్లింపులు ఇలా..
ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్‌ను వాహనం ముందు భా గంలో అద్దంపై అతికించాలి. గేటు వద్దకు వా హనం రాగానే ఈటీసీ కెమెరాలు స్కాన్ చేస్తా యి. దీంతో గేటు ఆటోమెటిక్‌గా ఓపెన్ అవుతా యి. అడ్డాకుల, రాయికల్ టోల్‌ప్లాజా దగ్గర డి సెంబర్ 1నుంచి అమల్లోకి తెస్తారు. ఫాస్ట్‌ట్యాగ్ అమల్లో భాగంగా జాతీయ రహదారుల సంస్థ మై ఫాస్ట్ ట్యాగ్, ఫాస్ట్‌ట్యాగ్ పా ర్టనర్ యాప్‌లను అందుబాటులోకి తీ సుకొచ్చింది. వాహనదారులు తమ బ్యాంకు ఖాతాలో ఈ యాప్‌ను అనుసంధానం చేసుకొని నిర్ణీత సొమ్మును చెల్లించాలి. ఆ వివరాలు ఎంపిక చేసిన బ్యాంకుల్లో లేదా టోల్‌ప్లాజా ఇస్తే ఫాస్ట్‌ట్యాగ్‌తో కూడిన ఒక ఫ్రీపెయిడ్ స్టిక్కర్ ఇస్తారు.
ఇకపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తవు
ఫాస్ట్‌ట్యాగ్ విధానంతో టోల్‌ప్లాజా దగ్గర ట్రాఫిక్ జాం కాదు. దీంతో పాటు నగదు రహిత సేవలు కూడా అమల్లోకి వస్తాయి. ఇంధనం, సమయం, పొల్యూషన్ చాలా వరకు ఆదా చేయవచ్చు. ఈ విధానం తీసుకురావడం వల్ల వాహనదారులకు ఎంతో మేలు జరుగుతుంది.
– శ్రీనివాస్‌రెడ్డి, ఎంవీఐ, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment