నేత్రదానంలో జిల్లా ముందుండాలి
నేత్రదానంలో జిల్లా ముందుండాలి
Published Fri, Sep 16 2016 10:33 PM | Last Updated on Tue, Aug 28 2018 3:57 PM
–నేత్రదాన సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయిస్తా
– డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
కర్నూలు : చరిత్రలో నిలిచేలా నేత్రదానంలో కర్నూలు జిల్లా ముందుండాలని ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ఆకాంక్షించారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఉద్యమంలా చేపట్టిన నేత్రదాన కార్యక్రమాలకు తాను అండగా ఉంటానన్నారు. నేత్రదాన సమాచారం కోసం ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయిస్తానని కేఈ హామీ ఇచ్చారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కర్నూలు శివారులోని దూపాడు వద్దనున్న కె.వి.సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఉదయం మెగా నేత్రదాన స్వచ్ఛంద అంగీకార పత్రాల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి అతిథిగా ఉపముఖ్యమంత్రి హాజరై మాట్లాడారు. గతంలో కళ్లు లేనివారికి దేవుడే దిక్కు అనేవారని, ఇప్పుడు వారికి ఎస్పీ గారి ఉద్యమం జీవితంపై భరోసా ఇస్తుందన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలకు మీడియా కూడా విస్తత ప్రచార ం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ దత్తత గ్రామం కప్పట్రాళ్లలో చేపట్టిన ప్రతి అభివద్ధి కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి హాజరై ప్రోత్సహించారని గుర్తు చేశారు. నేత్రదానం చేసేందుకు ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికీ జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ రవిప్రకాష్, రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి శ్రీనివాసులు, కె.వి.సుబ్బారెడ్డి కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి, చైర్మన్ అశోకవర్ధన్‌రెడ్డి, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, హరినాథరెడ్డి, హుసేన్ పీరా, బాబా ఫకద్దీన్, ఎ.జి.కష్ణమూర్తి, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, ఈశ్వర్‌రెడ్డి, కొల్లి శ్రీనివాసరావు, వెంకటాద్రి, సుప్రజతో పాటు పలువురు పోలీసు అధికారులు, విద్యార్థులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు కార్యక్రమంలో పాల్గొని నేత్రదాన అంగీకార పత్రాలను సమర్పించారు. జిల్లా పోలీసులు సేకరించిన 1.52 లక్షల నేత్రదాన అంగీకార పత్రాలను డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి అందజేశారు. వాటన్నింటినీ కేవీ సుబ్బారెడ్డి కళాశాల విద్యార్థుల ద్వారా ఆన్‌లైన్‌లో రెడ్‌క్రాస్ వెబ్‌సైట్‌లో నమోదు చేయించారు.
Advertisement
Advertisement