
‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, భలే భలే మగాడివోయ్, ఊపిరి, ప్రేమమ్, నిన్ను కోరి’ వంటి చిత్రాలకు పాటలు అందించి, తెలుగు శ్రోతలను ఆకట్టుకున్నారు మలయాళ సంగీత దర్శకుడు గోపీ సుందర్. మలయాళంలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన ఆయన తమిళ, హిందీ సినిమాలకూ మ్యూజిక్ అందిస్తుంటారు. ఇప్పుడు ఆయన నటనపై దృష్టి సారించారు. హరికృష్ణన్ దర్శకత్వంలో గోపీసుందర్ లీడ్ రోల్ చేస్తున్న సినిమా ‘టోల్ గేట్’.
‘టాలెంటెడ్ అండ్ మై గుడ్ ఫ్రెండ్ గోపీ సుందర్ యాక్ట్ చేస్తున్న మొదటి సినిమాని అనౌన్స్ చేయడం ఆనందంగా ఉంది. మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసిన గోపీ యాక్టింగ్‌తోనూ ఆడియన్స్‌ను మ్యాజిక్ చేస్తాడని నమ్ముతున్నాను’’ అంటూ గోపీ సుందర్ ఫస్ట్ లుక్‌ను హీరో దుల్కర్ రిలీజ్ చేశారు. ‘మిస్టర్ ఫ్రాడ్’, ‘సలాలా మొబైల్స్’ చిత్రాల్లో గెస్ట్ రోల్ చేసిన గోపీ ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న తొలి చిత్రం ‘టోల్ గేట్’.