
టోల్‌ప్లాజాలో దారుణం.. వీడియో
గురుగ్రామ్: ఢిల్లీ శివారులోని గురుగ్రామ్ టోల్ ప్లాజా వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. భారీ ట్రాఫిక్ మూలంగా ఎక్కువ సమయం టోల్ ప్లాజా వద్ద వెయిట్ చేయాల్సిరావడంతో.. కొందరు దుండుగులు అక్కడి సిబ్బందిపై దాడి చేశాడు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ.. టోల్ ప్లాజాను ధ్వంసం చేశారు.
దుండగులు సిబ్బందిపై దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయింది. గురువారం చోటు చేసుకున్న ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీ ఫొటేజి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.