సాక్షి,యాదాద్రి భువనగిరిజిల్లా: మేకిన్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా అని ప్రధాని మోదీ మాట్లాడిన మాటలు నెరవేరలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. భువనగిరిలో ఆదివారం(మే19) జరిగిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల బీఆర్‌ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
‘మోదీ గుడి కట్టినం అని ఓట్లు అడుగుతుండు. మేం కూడా గుడి నిర్మించాం. గుడి పేరుతో ఓట్లు అడగలేదు. మేము ప్రాజెక్టులు కట్టాం. అవికూడా దేవుళ్ళ పేరు మీద కట్టాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు నాట్లు వేస్తునప్పుడు రైతు బంధు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓట్లు వేస్తునప్పుడు మాత్రమే రైతులకు రైతు బంధు వేస్తున్నారు.
కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామకపత్రాలు ఇచ్చి నేనిచ్చా అని చెప్పుకోవడానికి రేవంత్‌రెడ్డికి సిగ్గుండాలి. ఒక వైపు బిట్స్ బిలాని చదువుకున్న అభ్యర్థి ఉన్నాడు. మరోవైపు బ్లాక్ మెలర్, లాబీయింగ్, పైశాచిక ఆనందం పొందే అభ్యర్థి ఉన్నాడు. ఎవరికి ఓటు వేయాలో పట్టభద్రులు తేల్చుకోవాలి’అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment