Breadcrumb
By Elections 2022 Results: రాంపూర్‌లో ఎస్పీకి షాకిచ్చిన ఓటర్లు, బీజేపీ విజయం
Published Sun, Jun 26 2022 8:30 AM | Last Updated on Sun, Jun 26 2022 9:30 PM
Live Updates
ముగిసిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ
ముగిసిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ
దేశంలోని పలు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం ముగిసింది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ఈసీ వెల్లడించింది. ఫలితాలు కింది విధంగా ఉన్నాయి.
లోక్‌సభ స్థానాలు (3)
ఉత్తర ప్రదేశ్: ఆజాంఘర్, రాంపూర్-బీజేపీ విజయం
పంజాబ్: సంగ్రూర్-శిరోమణి అకాలీదళ్ గెలుపు
అసెంబ్లీ స్థానాలు (7)
ఆంధ్రప్రదేశ్: ఆత్మకూరు-వైఎస్సార్సీపీ గెలుపు.
త్రిపుర: టౌన్ బార్డౌవాలీ, సుర్మా, జబ్రాజ్‌నగర్-బీజేపీ గెలుపు; అగర్తలా-కాంగ్రెస్ విజయం
ఢిల్లీ: రాజిందర్ నగర్-ఆమ్ ఆద్మీపార్టీ గెలుపు
జార్ఖండ్: మందార్-కాంగ్రెస్ విజయం.
మందార్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
జార్ఖండ్‌లోని మందార్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శిల్పి నేహా టిర్కీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి గంగోత్రి కుజుర్పై 23 వేల పైచిలుకు ఓట్లతో ఆమె గెలుపొందారు.
రాజిందర్‌నగర్‌లో ఆప్ అభ్యర్థి విజయం
ఢిల్లీలోని రాజిందర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి దుర్గేశ్ పాఠక్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రాజేష్ భాటియాపై 11 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఆజాంగఢ్‌లో బీజేపీ అభ్యర్థి గెలుపు
యూపీలోని ఆజాంగఢ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. కమలం పార్టీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ 8,679 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
రాంపూర్‌లో ఎస్పీకి షాకిచ్చిన ఓటర్లు, బీజేపీ విజయం
యూపీలోని రాంపూర్ లోక్‌సభ స్థానాన్ని కాషాయపార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి ఘన్‌శ్యాం లోథి సమాజ్‌వాది అభ్యర్థిపై 40 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. క్రితం ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎస్పీ తరుపున ఎంపీగా ఎన్నికైన ఆజాంఖాన్ అసెంబ్లీకి వెళ్లిపోవడంతో ఎన్నిక అనివార్యమైంది.
పంజాబ్‌లో ఆప్‌కు షాక్
సంగ్రూర్ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీకి షాకిచ్చారు పంజాబ్ ఓటర్లు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో.. శిరోమణి అకాళిదల్ అభ్యర్థి సిమ్రన్ జిత్ మాన్ .. ఆప్ అభ్యర్థి గుల్మైర్‌పై 8 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ విజయంపై పంజాబ్ కాంగ్రెస్ స్పందిస్తూ ట్విటరో పోస్ట్ చేసింది.
People of Sangrur have sounded the bugle of @AamAadmiParty end in Punjab. The dwindling law & order situation & misgovernance at every step of the ruling govt has been voted out by majority. @BhagwantMann ji Step aside, you have no competence to ensure Punjab's future.
— Punjab Congress (@INCPunjab) June 26, 2022
మందార్ ఉప ఎన్నిక.. 10,455 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్
జార్ఖండ్‌లోని మందార్ అసెంబ్లీ ఉపఎన్నిక: 13 రౌండ్ల కౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి శిల్పి నేహా టిర్కీ 10,455 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. బీజేపీకి అభ్యర్థి గంగోత్రి కుజుర్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
త్రిపుర ఉప ఎన్నికలు: బీజేపీ 3.. కాంగ్రెస్ 1
త్రిపుర అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ మూడు చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్ ఒక చోట గెలుపొందింది. మొత్తం నాలుగు సీట్లకు ఎన్నికలు జరిగాయి. టౌన్ బార్డౌవాలీ, సుర్మా, జబ్రాజ్నగర్లో కాషాయపార్టీ, అగర్తలాలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ భారీ విజయం
ఏపీలోని ఆత్మకూరు ఉప ఎన్నికలో అధికార వైఎస్సార్సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు.
యూపీలో బీజేపీ ముందంజ
ఉత్తరప్రదేశ్‌లో రెండు లోక్‌సభ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు. రాంపూర్ నుంచి ఘనశ్యామ్ సింగ్ లోథీ, ఆజాంఘర్ నుంచి దినేశ్ లాల్ యాదవ్ ముందంజలో ఉన్నారు.
#UPDATE | UP Lok Sabha by-election results | At 12:30pm, Ghanshyam Singh Lodhi of Bharatiya Janata Party leading from Rampur seat, Dinesh Lal Yadav 'Nirahua' of Bharatiya Janata Party leading from Azamgarh seat, as per Election Commission of India pic.twitter.com/W0HJQeTEcl
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 26, 2022
ఉప ఎన్నికలో సీఎం ఘన విజయం
త్రిపురలో టౌన్ బార్డోలీకి జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, త్రిపుర సీఎం మాణిక్ సాహా ఘన విజయం సాధించారు. కాగా, త్రిపురలో మరో రెండు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. అగర్తలలో కాంగ్రెస్ లీడింగ్‌లో కొనసాగుతోంది.
Tripura CM & BJP leader Manik Saha wins from Town Bardowali Assembly constituency in the recently held by-polls. pic.twitter.com/5bWElc9sfA
— ANI (@ANI) June 26, 2022
పంజాబ్‌లో ఆప్ వెనుకంజ
పంజాబ్‌లో సంగ్రూర్ లోకసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఆప్ వెనుకంజలో ఉంది. అకాలీదళ్ స్వల్ప మెజార్టీతో దూసుకుపోతోంది. సిమ్రన్జీత్మాన్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. కాగా, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ రాజీనామాతో సింగ్రూర్లో ఉప ఎన్నిక జరిగింది. మరోవైపు.. ఢిల్లీ రాజేంద్రనగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.
Sangrur Lok Sabha by-election result | Simranjit Singh Mann of SAD (Amritsar) continues to lead, as per the Election Commission of India pic.twitter.com/ol7RSVxUTM
— ANI (@ANI) June 26, 2022
త్రిపుర ఉప ఎన్నికల్లో బీజేపీ జోరు
త్రిపురలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుగా.. టౌన్ బార్డోలీ, జుబ్రాజ్నగర్, సుర్మాలో బీజేపీ ముందంజలో ఉంది. అగర్తలలో కాంగ్రెస్ అభ్యర్థి లీడింగ్‌లో కొనసాగుతున్నారు.
Tripura Assembly by-poll results | BJP leading on three seats - Town Bardowali, Jubarajnagar & Surma; Congress leading on Agartala seat, as per ECI. pic.twitter.com/zhbFRTetSG
— ANI (@ANI) June 26, 2022
మందార్ ఉప ఎన్నిక.. లీడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి
జార్ఖండ్‌లోని మందార్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో మొదటి రౌండ్ పూర్తి అయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి లీడింగ్‌లో కొనసాగుతుండగా.. బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
Jharkhand -Mandar Assembly constituency by-poll counting | Congress leading, BJP trailing on the second spot, after the first round of counting, as per ECI.
— ANI (@ANI) June 26, 2022
యూపీలో ఎస్పీ, బీజేపీ అభ్యర్థుల లీడింగ్
యూపీ లోక్‌సభ ఉప ఎన్నిక.. రాంపూర్ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి మహ్మద్ అసిమ్ రాజా లీడింగ్‌లో కొనసాగుతుండగా.. ఆజాంఘర్ నియోజవర్గంలో బీజేపీ అభ్యర్థి దినేశ్ లాల్ యాదవ్ ముందజలో ఉన్నారు.
UP Lok Sabha by-election results | Mohd.Asim Raja of Samajwadi Party leading from Rampur seat, Dinesh Lal Yadav 'Nirahua' of Bharatiya Janata Party leading from Azamgarh seat, as per Election Commission of India pic.twitter.com/AVR7TPwkun
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 26, 2022
అసెంబ్లీ స్థానాలు..
- త్రిపురలో 4 అసెంబ్లీ స్థానాలు.. అగర్తలా, టౌన్ బార్డౌవాలీ, సుర్మా, జబ్రాజ్‌నగర్,
- ఢిల్లీలో అసెంబ్లీ స్థానం రాజీంద్ర నగర్,
- జార్ఖండ్‌లో మందార్,
- ఏపీలో ఆత్మకూర్ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం సాయంత్రానికి వెలువడనున్నాయి.
లోక్‌సభ స్థానాలు..
ఉత్తర ప్రదేశ్‌లో 2 లోక్‌సభ స్థానాలు.. ఆజామ్ఘర్, రాంపూర్,
పంజాబ్‌లో లోక్‌సభ స్థానం సంగ్రూర్.
Uttar Pradesh | Counting of votes for Azamgarh Lok Sabha by-elections being held today pic.twitter.com/JCFtgmY4gY
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 26, 2022
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక, ఎన్నికల్లో భాగంగా నేడు(ఆదివారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
Uttar Pradesh | Counting of bypoll votes in Rampur Lok Sabha constituency today, where voting was held on June 23 pic.twitter.com/Owd2A2ZWca
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 26, 2022
Related News By Category
Related News By Tags
-
ఉప ఎన్నికల పోలింగ్: ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు..
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో భాగంగా గురువారం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొన...
-
నేడు ఉప ఎన్నిక ఫలితాలు
ఆత్మకూరు: ఆత్మకూరు నగర పంచాయతీలో రెండో వార్డుకు జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఉప ఎన్నికలలో 1415 ఓట్లకు గాను 1165 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండు పోలింగ్ బూత్...
-
జార్ఖండ్ తొలి దశకు సర్వం సిద్ధం
రాంచీ: జార్ఖండ్ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్ నిర్వహణకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధంచేశారు. బుధవారం తొలి దశలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసు బల...
-
వారం పాటు ‘ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం’
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధాన్ని అమలు చేయనుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు పార...
-
గాంధీ టోపీ వెనుక ‘నవాబుల కథ’
లక్నో: అక్టోబర్ 2.. గాంధీ జయంతి. దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకురావడంలో మహాత్ముని కృషి మరువలేనిది. గాంధీజీ 1869, జనవరి 30న గుజరాత్‌లోని పోరుబందర్లో జన్మించారు. గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆ...
Comments
Please login to add a commentAdd a comment