
న్యూఢిల్లీ: లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారి బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ కూటమిలోని ఆర్జేడీ 10 శాతం సీట్లు కావాలని డిమాండ్ చేసినప్పటికీ.. చివరకు నాలుగింటితో సరిపెట్టుకుంది. అభ్యర్థుల పేర్లను సోమవారం విడుదల చేయనుంది. ఢిల్లీ ఎన్నికలకు నామినేషన్ పత్రాల దాఖలు మంగళవారంతో ముగియనుంది.