పొత్తుల ద్వారాలు దాదాపు మూతపడే సమయానికి.. ’సమయం ఉంది మిత్రమా..’ అంటూ కోరుకున్న నేస్తానికి కబురు పంపాడు అఖిలేశ్ యాదవ్! ఉత్తరప్రదేశ్‌లో ఇక ఉండదేమో అనుకున్న సమాజ్‌వాదీ-కాంగ్రెస్ పార్టీల పొత్తుపై శనివారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎస్పీ చీఫ్, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ తాజాగా ఒక ప్రతిపాదనకు తలొగ్గినట్లు విశ్వసనీయంగా తెలిసింది.