Lok Sabha elections 2024: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 17 సీట్లు | Lok Sabha elections 2024: SP, Congress finalise seat-sharing deal | Sakshi
Sakshi News home page

Lok Sabha elections 2024: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 17 సీట్లు

Published Thu, Feb 22 2024 6:28 AM | Last Updated on Thu, Feb 22 2024 6:28 AM

Lok Sabha elections 2024: SP, Congress finalise seat-sharing deal - Sakshi

లక్నో: విపక్షాల ‘ఇండియా’ కూటమిలో మిత్రపక్షాలైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల పొత్తు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ఓ కొలిక్కి వచ్చింది. చాన్నాళ్లుగా సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగి చివరకు బుధవారం తమ సీట్ల పంపకాలపై ప్రకటన చేశాయి. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌కు 17 చోట్ల పోటీచేసే అవకాశం ఇచి్చంది.

ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్‌ ఉత్తమ్‌ పటేల్, ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర చౌదరి, కాంగ్రెస్‌ యూపీ చీఫ్‌ అజయ్‌ రాయ్, ఏఐసీసీ యూపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అవినాశ్‌ పాండేల భేటీ తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ‘మేం 17 చోట్ల పోటీ చేస్తాం. మిగతా 63 స్థానాల్లో ఎస్పీ, ఇతర కూటమి భాగస్వామ్య పారీ్టలు బరిలో నిలుస్తాయి’’ అని కాంగ్రెస్‌ నేత వినాశ్‌ పాండే చెప్పారు.  

ప్రియాంకా గాంధీ చొరవతో కుదిరిన ఒప్పందం
యూపీలో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఒక అడుగు ముందుకేసి ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌తో ఫోన్‌లో మంతనాలు జరిపారని, దీంతో సీట్ల పంపకాల ప్రక్రియ ఒక కొలిక్కి వచి్చందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శ్రవస్థీ నియోజకవర్గంలో తామే పోటీచేస్తామని పట్టుబట్టి ఎస్పీ సాధించింది. కాంగ్రెస్‌ అదనంగా సీతాపూర్, బారాబంకీల్లో పోటీచేసే అవకాశం సాధించింది. వీటితోపాటు అమేథీ, రాయ్‌బరేలీ, కాన్పూర్‌ నగర్, వారణాసి, షహరాన్‌పూర్, అమ్రోహా, సిక్రీ, మహారాజ్‌గంజ్, బన్స్‌గావ్, బులంద్‌òÙహర్, ఘజియాబాద్, మథుర, ప్రయాగ్‌రాజ్, దేవరియా, ఝాన్సీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పోటీచేయనుంది. మరోవైపు, మధ్యప్రదేశ్‌లో ఖజురహోలో మాత్రమే ఎస్పీ పోటీచేయనుంది. మిగతా 28 చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఎస్పీ మద్దతు ఇవ్వనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement