కాంగ్రెస్‌తో పొత్తుకు ఇంకా సమయం ఉంది: అఖిలేష్
కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయాన్ని నిర్ణయించడానికి ఇంకా సమయం ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. అప్పుడే పొత్తు విషయాన్ని ఖరారు చేయలేదని తెలిపారు. సైకిల్ గుర్తు, పార్టీ పగ్గాలు తమకు దక్కిన తర్వాత తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన తన నివాసంలో మంగళవారం ఉదయం భేటీ అయ్యారు.
తండ్రితో తన సంబంధలు ఎప్పుడూ చెడిపోలేదని.. వాస్తవానికి ఆయనతో తనకు అసలు విభేదాలే లేవని స్పష్టం చేశారు. తనవద్ద, ఆయన వద్ద ఉన్న అభ్యర్థుల జాబితాలలో 90 శాతం మంది పేర్లు ఒకటేనని కూడా ఆయన చెప్పారు. తండ్రి మీద విజయం అనేది సంతోషించే విషయం కాదని.. కానీ ఈ పోరాటం తప్పనిసరి అయ్యిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన మీద పెద్ద బాధ్యత ఉందని, మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడం మీదే తన పూర్తి దృష్టి ఉందని అఖిలేష్ చెప్పారు.