
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన ముగ్గురు సభ్యుల స్థానంలో ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూలు జారీచేసింది. స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఎన్నికైన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేపథ్యంలో వీరిద్దరూ గత డిసెంబరులో రాజీనామా చేశారు. అలాగే కొండా మురళి పార్టీ మారడంతో శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ స్థానిక సంస్థల నియో జకవర్గాలకు ఉపఎన్నిక నిర్వహించేందుకు తాజాగా షెడ్యూలు విడుదల చేసింది. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమలులోకి వస్తుందని షెడ్యూలులో పేర్కొంది.
ఇదీ షెడ్యూలు
నోటిఫికేషన్ తేదీ- 7 మే 2019(మంగళవారం)
నామినేషన్లకు గడువు- 14 మే
నామినేషన్ల పరిశీలన- 15 మే
అభ్యర్థిత్వాల ఉపసంహరణకు గడువు- 17 మే
పోలింగ్ తేదీ- 31 మే
పోలింగ్ సమయం- ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
ఓట్ల లెక్కింపు- 3 జూన్