పనిలో పనిగా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా... | election commission announced schedule for legislative council elections | Sakshi
Sakshi News home page

పనిలో పనిగా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా...

Published Wed, Jan 4 2017 8:02 PM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM

పనిలో పనిగా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా...

పనిలో పనిగా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా...

న్యూఢిల్లీ, సాక్షి: ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూలును ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూలును కూడా విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ రాష్ట్రాల్లో 11 ఎమ్మెల్సీ స్థానాలు గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఖాళీ అయ్యాయి.

ఉత్తరప్రదేశ్ 3 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు, 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలు, మహారాష్ట్రలో 3 ఉపాధ్యాయ స్థానాలు, 2 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు కర్నాటక రాష్ట్రంలోని దక్షిణ-తూర్పు కర్నాటక టీచర్స్ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన సభ్యుడు రాజీనామా కారణంగా ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ 11 ఖాళీల భర్తీ కోసం ఎన్నికలకు జనవరి 1 న నోటిఫికేషన్ జారీ కానుంది. ఫిబ్రవరి 3న ఎన్నికలు నిర్వహించి 6 వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement