ఐదు రాష్ట్రాల ఎన్నికలు: ఈసీ మార్గదర్శకాలు | Five states elections: new measures by EC | Sakshi
Sakshi News home page

ఐదు రాష్ట్రాల ఎన్నికలు: ఈసీ మార్గదర్శకాలు

Published Wed, Jan 4 2017 2:36 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

ఐదు రాష్ట్రాల ఎన్నికలు: ఈసీ మార్గదర్శకాలు - Sakshi

ఐదు రాష్ట్రాల ఎన్నికలు: ఈసీ మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ సహా ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల కమిషన్‌ బుధవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన తేదీలతోపాటు అనుసరించనున్న మార్గదర్శకాలనూ వెల్లడించింది.  (ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల)

ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోని అన్ని కుటుంబాలకూ తొలిసారిగా ‘ఓటర్‌ గైడ్‌’ బుక్‌లెట్‌ను అందించనున్నారు. ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌(చుట్టూ తెరలతో ఈవీఎంలు ఉండే చోట) ఎత్తును 30 ఇంచులు పెంచుతున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈసీ వెల్లడించిన మార్గదర్శకాల్లో కొన్ని ముఖ్యాంశాలాలివి..

ఐదు రాష్ట్రాల్లో ఏకబిగిన ఎన్నికలు నిర్వహింస్తారు. నోటిఫికేషన్‌ వెలువడిన బుధవారం నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది.

ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 16 కోట్ల మంది ఓట్లు ఉన్నారు.

ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోని ప్రతి ఇంటికి(కుటుంబానికి) ఒక ఓటర్‌ గైడ్‌(బుక్‌లెట్‌)ను అందిస్తారు. కలర్‌ఫుల్‌ పేజీలతో ముద్రించిన ఈ బుక్‌లెట్‌లో ఓటు విలువ, ఓటు వేయాల్సిన అవసరత, పోలింగ్‌ స్టేషన్‌లో నడుచుకోవాల్సిన తీరు తదితర సూచనలు పొందుపర్చారు.

ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌(ఈవీఎంలు ఉండే చోటు) ఎత్తును 30 ఇంచులు పెంచారు. దీంతో ఓటు వేసేందుకు లోపలికి వెళ్లినవారికి.. బూత్‌లోనే కూర్చొని ఉండే ఏజెంట్లుగానీ, ఇతరులుగానీ సంజ్ఞలు చేసే అవకాశం ఉండదు. తద్వారా రహస్య ఓటింగ్‌ ప్రక్రియ పకడ్బందీగా అమలవుతుందని ఈసీ పేర్కొంది.

ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో ఒటింగ్‌ ప్రక్రియకు సంబంధిచిన 4 పోస్టర్లను అంటించి ఉంచుతారు.

ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 1లక్షా 85 వేల పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేయనున్నారు.

మహిళల కోసం ప్రత్యేక పోలింగ్‌ స్టేషనల్ లను ఏర్పాటుచేస్తారు.

ఎన్నికల ప్రచారంలో రాజకీయపార్టీలు ప్లాస్టిక్‌ వినియోగించరాదని, ఎక్కువ శబ్దాన్నిచ్చే లౌడ్‌స్పీకర్లు, టపాసులు పేల్చడంలాంటివి కూడదని ఈసీ సూచించింది. ఈ ఎన్నికల ప్రక్రియ అంతటా ఈసీ పర్యావరణహిత వస్తువులను మాత్రమే వినయోగిస్తుందని సీఈసీ నజీంజైదీ చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఒక్కొక్కరు గరిష్టంగా రూ.28 లక్షలకు మించి ఎన్నికల ప్రచారానికి వినియోగించరాదు. అదే గోవా, మణిపూర్‌లలోనైతే ఆ పరిమితి రూ.20 లక్షలే.

సొంత టీవీ చానెళ్లు కలిగిన నేతలు, పార్టీలపై ఈసీ ప్రత్యేక నిఘా పెడుతుంది. టీవీల్లో ప్రసారం అయ్యే యాడ్‌లను కూడా అభ్యర్థుల ఖర్చుకిందే పరిగణిస్తారు. అలాగే పత్రికల్లో వచ్చే ప్రకటనలను గుర్తించేందుకు ఈసీ.. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సహకారం తీసుకోనుంది.

పంజాబ్‌, గోవా రాష్ట్రాల్లో ఒకే విడతలో ఫిబ్రవరి 4న పోలింగ్‌ జరుగుంది.

ఉత్తరాఖండ్‌లో ఒకే విడత ఫిబ్రవరి 15న పోలింగ్‌ జరుతుంది.

మణిపూర్‌లో రెండు విడదలుగా.. మార్చి 4, మార్చి 8న పోలింగ్‌ ఉంటుంది.

పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఏడు విడతల్లో పోలింగ్‌ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 11, 15, 19, 23, 27, మార్చి 4, మార్చి 8 తేదీల్లో పోలింగ్‌ నిర్వహిస్తారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల కు సంబంధించిన ఓట్ల లెక్కింపు మార్చి 11న ప్రారంభం అవుతంది. అదేరోజు ఫలితాలు వెల్లడవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement