five states elections
-
పేదలకు కోట్ల ఇళ్లు కట్టించాను..
ఛత్తర్పూర్/సత్నా/నీముచ్(మధ్యప్రదేశ్): దేశంలోని పేదలకు తమ ప్రభుత్వం నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇచి్చందని, తన కోసం ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌ని ఒక్కో ఓటు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు, కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి బలాన్నిచ్చేందుకు, అవినీతి కాంగ్రెస్‌ను మరో 100 ఏళ్లపాటు అధికారానికి దూరం ఉంచేందుకు ఉపయోగపడే ‘త్రిశక్తి’ వంటిందని పేర్కొన్నారు. దేశాభివృద్ధిని వెనక్కి నడిపించడంలో కాంగ్రెస్‌కు మంచి నైపుణ్యం ఉందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అందుకే, అవినీతి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వరాదని ప్రజలకు పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్పూర్, సత్నా, నీముచ్లలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘మా ప్రభుత్వం దేశంలోని పేదలకు నాలుగు కోట్ల పక్కా గృహాలను నిర్మించి ఇచి్చంది. కానీ, నేను ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేకపోయాను’అని ఆయన చెప్పారు. ‘వాహనం మనల్ని రివర్స్‌గేర్‌లో వెనక్కి తీసుకెళ్లినట్టుగానే కాంగ్రెస్ పారీ్టకి సుపరిపాలనను రివర్స్‌గేర్‌లో దుష్పరిపాలనగా మార్చడంలో నైపుణ్యం ఉంది. 100 ఏళ్ల క్రితమే గొప్ప నీటి వనరులున్న బుందేల్‌ఖండ్‌లో నీటి సమస్యలను తీర్చేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. దీంతో, ఇక్కడి ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. అందుకే, ఆ పారీ్టకి కనీసం 100 ఏళ్లపాటు అధికారం ఇవ్వరాదు. అప్పుడే అభివృద్ధి సాధ్యం’అని ప్రజలను కోరారు. బానిస మనస్తత్వంతో కూడిన కాంగ్రెస్ దేశ అభివృద్ధిని పట్టించుకోలేదు, దేశ వారసత్వంతోనూ ఆ పారీ్టకి సంబంధం లేదని మోదీ అన్నారు. ‘కాంగ్రెస్‌కు ఒక పంజా ఉంది. పేదల వద్ద ఉన్న వాటిని గుంజుకోవడానికే దానిని వాడుతుంది. అలాంటి కాంగ్రెస్ పంజా బారి నుంచి మధ్యప్రదేశ్‌ను మనం కాపాడు కోవాల్సిన అవసరం ఉంది’అంటూ ఆ పార్టీ ఎన్నికల గుర్తు హస్తంను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నకిలీలను తొలగించాం ప్రభుత్వ పథకాల ద్వారా పేదల ధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు లూటీ చేశాయని విమర్శించారు.కాంగ్రెస్ జమానాలో డబ్బంతా ఎక్కడికి చేరుతుందో ప్రజలకు అర్థమయ్యేది కాదు. 2జీ, కోల్, కామన్వెల్త్, హెలికాప్టర్ల కుంభకోణాల రూపంలో లక్షల కోట్లు దారి మళ్లాయి. వీటన్నిటినీ మోదీ ప్రభుత్వం ఆపు చేసింది. అప్పట్లో దళారులదే రాజ్యంగా ఉండేది. మోదీ ప్రభుత్వం వారి దుకాణాలను మూసివేయించింది. అధికారంలోకి వచి్చన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వాలు సృష్టించిన దేశంలోని ప్రభుత్వ పథకాల 10 కోట్ల నకిలీ లబి్ధదారులను తొలగించి ప్రజాధనాన్ని కాపాడామన్నారు. పదేళ్ల కాలంలో రూ.33 లక్షల కోట్లను నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు వివరించారు. ఇందులో ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టలేదని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో పేదల పిల్లలు ఆకలితో అలమటించకుండా చేయగలగడం కేవలం మోదీ వల్ల కాదు, మీ అందరివల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఓటుతో ప్రజలిచి్చన అధికారం వల్లనే పేదల ఆకలి తీర్చగలిగినట్లు చెప్పారు. -
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో గెలుపు పక్కా
న్యూఢిల్లీ: రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తంచేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కచి్చతంగా విజయం సాధిస్తుందన్న రాహుల్.. తెలంగాణలో నెగ్గే అవకాశాలున్నాయని చెప్పారు. ఇక రాజస్థాన్‌లో రెండు పారీ్టల మధ్య హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పారీ్టయే విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిదిన్ మీడియా నెట్వర్క్ ఆఫ్ అసోమ్ సంస్థ ఆదివారం ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరైన రాహుల్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఐక్య పోరాటం చేస్తాయని, ఆ ఎన్నికల్లో బీజేపీని నివ్వెరపరిచే ఫలితాలు వస్తాయని అన్నారు. ఆయన ఇంకా ఏం అన్నారంటే.. ‘ప్రజా సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికే బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న పాట పాడుతోంది. కులగణన వంటి అంశాలను పక్కదారి పట్టించడానికి బీజేపీ ఎన్నో వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ మరో ఎంపీ దాని‹Ùపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ప్రజా అంశాలను పక్కదారి పట్టించడానికే. ఆదాయ అసమానతలు, కొందరి చేతుల్లోనే సంపద పోగుపడిపోవడం, నిరుద్యోగం తీవ్ర రూపం దాల్చడం, వెనుకబడిన కులాలు, ఓబీసీలు, ఆదివాసీల పట్ల చిన్నచూపు, అధిక ధరలు వంటి సమస్యలు దేశాన్ని బాధిస్తున్నాయి. ఈ అంశాలపై దృష్టి సారించలేని బీజేపీ వాటిని పక్కదారి పట్టించే మార్గంలో నడుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల విషయానికొస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు గెలిచే అవకాశాలున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కచి్చతంగా గెలుస్తాం. రాజస్తాన్‌లో గట్టి పోటీ ఉంది. కానీ కాంగ్రెస్ పారీ్టయే గెలుస్తుంది. ఇది మా పార్టీ అంచనా కాదు. బీజేపీ చేసుకున్న అంతర్గత సర్వేల్లోనూ ఇదే విషయం తేలింది’ అని రాహుల్ గాంధీ వివరించారు. జిమ్ అంటేనే ఇష్టం విలేకరులు అడిగిన కొన్ని సరదా ప్రశ్నలకూ రాహుల్ హుషారుగా బదులిచ్చారు. తీరిక సమయాల్లో నెట్‌ఫ్లిక్స్ చూస్తారా, జిమ్ చేస్తారా అని ప్రశ్నిస్తే జిమ్ చేయడమంటేనే తనకు ఇష్టమని చెప్పారు. గెడ్డంతో ఉండడం ఇష్టమా, లేకపోతే ఇష్టమా అని అడిగితే కాంగ్రెస్ పారీ్టలో ఉన్నాను కాబట్టి వేసుకునే వీటిని పట్టించుకోవడం లేదని, ఎలా ఉన్నా ఫర్వాలేదని నవ్వారు. రాజకీయ నేత కాకపోయి ఉంటే ఏమై ఉండేవారు అని ప్రశ్నించగా ‘ఏదైనా అయి ఉండేవాడిని. నా మేనల్లుడు, వాడి స్నేహితుల్ని కలిసినప్పుడు టీచర్‌గా మారతా. వంటగదిలోకి అడుగు పెడితే చెఫ్ అయిపోతా. ఇలా నేను బహుముఖ పాత్రలు పోషిస్తుంటా’ అని రాహుల్ చెప్పారు. ‘క్రికెట్ కంటే ఫుట్‌బాల్ అంటే ఇష్టం. క్రీడాకారుడు మెస్సి రొనాల్డో అంటేఇష్టమన్నారు. గాడ్‌ఫాదర్, డార్క్‌నైట్ వీటిల్లో ఏ సినిమా అంటే ఇష్టం అని అడగ్గా.. రెండూ నాకు ఇష్టమే’ అని చెప్పారు. ఇండియా, భారత్‌లో దేశానికి ఏ పేరు ఉండాలని ప్రశ్నించగా ఇండియా అంటేనే భారత్ అని రాహుల్ చెప్పారు. -
పెద్ద నోటు రద్దు... ఏ కట్టడికి?! అసలు కారణం ఇదేనా?
ఎస్.రాజమహేంద్రారెడ్డి: ఇంతకీ 2 వేల నోటు ఉపసంహరణ లేదా రద్దు ఎవరి కోసం? నల్లధనం కట్టడికా! రాజకీయ ప్రత్యర్థుల కట్టడికా! కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కర్ణాటక ఎన్నికల ఫలితం కంటిమీద కునుకు లేకుండా చేసినట్టుంది. డిసెంబరులో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడగా ఈ నోటు రద్దును ఎందుకు భావించకూడదు? ఎన్నికల్లో ధనప్రవాహం అభిలషణీయం కాదు కానీ, దాన్ని ఆపడం ఇప్పటివరకు ఎవరి వల్లా కాలేదు. ఇకపై కాదు కూడా! మొన్నటికి మొన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ సోదాల్లో 375 కోట్లకు పైగా (డబ్బు, మందు, కానుకలు) దొరికింది. దొరకనిది ఇంకెన్ని రెట్లుంటుందో! ఓటర్లకు ఎర వేయడం తప్పనప్పుడు, ప్రత్యర్థికి ఆ అవకాశం ఇవ్వకుండా వారి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడం యుద్ధనీతిలో భాగమే కదా! కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ సరిగ్గా ఇదే చేసింది. 2016లో నోట్ల రద్దును గొప్ప ప్రయోగంగా, ఆర్థిక వ్యవహారాల్లో గొప్ప మలుపుగా ప్రధానమంత్రి మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ ప్రకటించినప్పుడు దేశం మొత్తం నివ్వెరపోయింది. ఆ చర్య బడా బాబులతో పాటు సగటు జీవులకూ కొన్ని నెలల పాటు కునుకు లేకుండా చేసింది. చివరికి దానివల్ల ఏం ఒరిగింది? నల్లధనంగా భావించిన మొత్తంలో ఏకంగా 99 శాతానికి పైగా మళ్లీ బ్యాంకుల్లోకి చేరిపోయింది. ‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ (ఆపరేషన్ విజయవంతం, కానీ రోగి దక్కలేదు)’ చందంగా తయారైంది. నోట్ల రద్దును అప్పుడు మోదీ ప్రకటిస్తే, శుక్రవారం నాడు మాత్రం 2 వేల నోటు రద్దును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. బహుశా నోటు రద్దుకు రాజకీయ రంగు అంటకుండా కేంద్రం తీసుకున్న జాగ్రత్త ఇది. దేశ ఆర్థిక రంగాన్ని చిన్నదో పెద్దదో ఏదో ఒక కుదుపుకు లోను చేసే ఇలాంటి నిర్ణయాన్ని ఆర్బీఐ ప్రకటించడంలోనే అసలు అంతరార్థం అవగతమవుతుంది. ‘ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ (యుద్ధంలోనూ ప్రేమలోనూ సర్వం సబబే)’ అన్న నానుడి తెలుసు కదా! ఇదే సూత్రాన్ని రాజకీయాలకు అన్వయిస్తే సరిపోతుందేమో! బీజం పడిందక్కడే...! రాజకీయ అవసరాలను పక్కన పెడితే ఈ పెద్ద నోటు రద్దు ఎవరికి నష్టం? రెండు వేల నోటు ముద్రణ నిలిపివేసి చాలా ఏళ్లవుతోంది. బ్యాంకులు కస్టమర్లకు వాటిని జారీ చేయడం నిలిపివేసి కూడా చాలా రోజులవుతోంది. చలామణిలో లేకపోవడంతో సగటు జీవులు ఈ నోటును కళ్లజూసి కొన్ని నెలలవుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో, సినిమా రంగంలో చలామణిలో ఉన్న మాట వాస్తవం. ఆర్బీఐ లెక్కల ప్రకారం ప్రస్తుతం రూ.3.62 లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు మార్కెట్లో ఉన్నాయి. ఇందులో అధిక శాతం బడా బాబుల చేతుల్లోనే ఉన్నాయి. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లకు 2 వేల రూపాయల నోట్లే పంచారన్న విషయం అందరికీ తెలిసిందే. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే జరుగుతుంది కాబట్టి ఆ నోటుపై వేటు వేస్తే ప్రతిపక్షాలను దెబ్బ తీయొచ్చనేది అసలు వ్యూహం. ప్రతిపక్షాల కూటమికి తనను సారథిని చేస్తే ఎన్నికల ఖర్చు మొత్తం భరిస్తానని ఓ నేత అన్నట్టు ఓ ప్రముఖ ఇంగ్లిష్ చానల్లో ఆ చానల్ తాలూకు ప్రముఖ జర్నలిస్టు బాహాటంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. బహుశా రెండు వేల నోటుపై వేటుకు అక్కడే బీజం పడి ఉంటుంది. కాదంటారా!? -
5 రాష్ట్రాల ఫలితాలతో కేసీఆర్ కుంగుబాటు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వెలువడిన ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా సీఎం కేసీఆర్ భయపడిపోయారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. అందుకే అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారని విమర్శించారు. మోదీ సర్కార్‌పై విమర్శలకు అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకున్నారన్నారు. బుధవారం పార్టీ నాయకులు జయశ్రీ,, కొల్లి మాధవి, జె.సంగప్ప, ఎన్వీ సుభాష్‌లతో కలిసి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ సమావేశాలుగా సాగాయని మండిపడ్డారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే గూటి పక్షులని అసెంబ్లీలో మరోసారి స్పష్టమైందన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా బీజేపీపైనే విమర్శలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పూర్తిగా కబ్జా చేయడంతో రాష్ట్రం నుంచి ఆ పార్టీ కనుమరుగు కానుందన్నారు. -
ఓటమికి కారణం ఇదే: మాయావతి
-
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ప్రతీది పక్కాగా
రాజకీయ పార్టీలు అన్నాక... రకరకాల సంస్థాగత ఏర్పాట్లు ఉంటాయి. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల దాకా అధినేత/ అధినాయకురాలి చరిష్మా పైనే ఆధారపడి మనుగడ సాగిస్తుంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దానికి భిన్నం. సంస్థాగతంగా పటిష్టమైన నిర్మాణం, ఎవరి స్థాయిలో వారు పూర్తి అంకితభావంతో పనిచేయడం, నిరంతరం ఏదో కార్యక్రమాలతో ప్రజలతో టచ్‌లో ఉండటం, సూక్షస్థాయి ప్రణాళికలు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అండదండలు... మొత్తం మీద బీజేపీ ఓ బడా కార్పొరేట్ కంపెనీలా ఎక్కడా ఎలాంటి పొరపాట్లను తావివ్వకుండా ఎన్నికల మేనేజ్మెంట్ చేస్తుంది. అమిత్ షా అధ్యక్షుడిగా పనిచేసిన ఐదున్నరేళ్ల కాలంలో (జులై 9, 2014 నుంచి జనవరి 20, 2020 వరకు) ఈ కార్పొరేటీకరణను కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో బీజేపీ పార్టీ నిర్మాణం... వారి బలాలేమిటో చూద్దాం. సోషల్ మీడియానే ఆయుధం 18 కోట్ల పైచిలుకు సభ్యులతో బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా గుర్తింపు పొందింది. ఆధునిక సాంకేతికను జోడించి, సోషల్ మీడియాను సంపూర్ణంగా వాడుకుంటూ బీజేపీ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రధానిగా మోదీ చేపట్టిన అభివృద్ధి పనుల నుంచి... తమపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడం దాకా ఒక క్రమపద్ధతిలో కాషాయదళం సమాచారాన్ని విరివిగా వ్యాప్తి చేస్తుంది. 18 కోట్ల మంది సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, చిరునామాలు, ఫోన్ నెంబర్లతో బీజేపీ దగ్గర డేటాబేస్ ఉంది. వృత్తులు, ఆసక్తుల ఆధారంగా వీరిని విభజించింది. దీని కోసం సాఫ్ట్‌వేర్‌ను వాడింది. క్షేత్రస్థాయిలో వీరిని క్రియాశీలం చేసింది. బూత్ స్థాయిలో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా వారికి దిశానిర్దేశం జరుగుతుంది. మండల స్థాయిలో వీరికి క్రమం తప్పకుండా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, కార్యక్రమాలను... ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను కార్యకర్తలకు వివరిస్తారు. వారు వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అలాగే క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులు ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా పైకి తెలుస్తుంటాయి. దాంతో ఆ బూత్ స్థాయిలో దిద్దుబాటు చర్యలు, అదనపు శ్రమ పెట్టడం... వంటివి స్థానిక బాధ్యులు చేస్తుంటారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలోని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు... ఇలా ప్రతి ఒక్కరికి వారు పోషించాల్సిన నిర్దిష్ట పాత్ర ఉంటుంది. వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థను బీజేపీ అభివృద్ధి చేసింది. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగుల పనితీరును మానవవనరుల విభాగం (హెచ్ఆర్ డిపార్ట్మెంట్) అంచనా వేసినట్లే... చాలా పక్కాగా ఈ ఏర్పాటు ఉంటుంది. 8,000 మంది చురుకైన పూర్తి సమయపు కార్యకర్తలను... ‘పూర్ణకాలిక్ విస్తారక్స్ (పూర్తి సమయం కేటాయించి పార్టీని విస్తరించడం వీరి ముఖ్య విధి)’ను కమలదళం నియమించింది. దేశంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున వీరు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తారు.. పార్టీ విస్తరణకు పాటుపడతారు. పైనుంచి వచ్చే ఆదేశాలను సమర్థమంతంగా కిందికి తీసుకెళతారు. అసెంబ్లీ ఎన్నికలను పురష్కరించుకొని... 800 విస్తారక్‌లను ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే మోహరించింది. ఉత్తరాఖండ్‌కు 120 మందిని, గోవా, పంజాబ్‌లకు వందేసి మంది విస్తారక్‌లను పంపింది. ఆర్ఎస్ఎస్ సంస్థాగత నిర్మాణాన్ని చూసి ఈ విస్తారక్ల విధానాన్ని అందిపుచ్చుకుంది బీజేపీ. ప్రతి పేజీకో... పన్నా ప్రముఖ్ దేశంలోని 10 లక్షల పైచిలుకు పోలింగ్ బూత్‌లలో ఓటరు జాబితాలోని ప్రతి పేజీకి ఒక ఇంచార్జి (పన్నా ప్రముఖ్)ను నియమించే కార్యాన్ని బీజేపీ చేపట్టింది. ఓటరు జాబితాలోని ఒక్కో పేజీలో 30 మంది వరకు ఓటర్లు ఉంటారు. పన్నా ప్రముఖ్ ఈ 30 ఓటర్లను లేదా తన పరిధిలోని ఐదారు కుటుంబాలను కలిసి బీజేపీకి ఓట్లు అభ్యర్థిస్తారు. తమ ప్రభుత్వాలు చేసిన పనులను వివరిస్తారు. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఓటరు జాబితాలోని ప్రతి పేజీకి ఐదుగురు చొప్పున ‘పన్నా సమితు’లను వేయాలని బీజేపీ నిర్ణయించింది. సంక్షేమ కార్యక్రమాలు, వ్యాక్సినేషన్, నోట్ల రద్దు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు, కోవిడ్ కాలంలో అదనపు రేషన్, ఆయోధ్యలో చారిత్రక రామమందిర నిర్మాణం... తదితర అంశాలను ప్రజల్లోకి ఈ పన్నా సమితులు, పన్నా ప్రముఖ్‌లు తీసుకెళతారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే... 2021లోనే బీజేపీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు వీలుగా... దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కావొస్తున్న తరుణాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను చేపట్టింది. అలాగే సీఎం, పీఎంగా మోదీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ‘సేవా హి సంఘటన్’ క్యాంపెయిన్‌ను చేపట్టింది. అలాగే ఎన్నికలు సమీపించిన తరుణంలో కొద్దిరోజుల కిందట జన ఆశీర్వాద్ యాత్రలు చేపట్టింది. ఎన్నికలు వచ్చినపుడే ఇతర రాజకీయ పార్టీల్లో హడావుడి కనిపిస్తుంది. కానీ బీజేపీ అలా కాదు. సోషల్ మీడియాలో భావజాల వ్యాప్తి, బీజేపీ ప్రభుత్వాలు సాధించిన విజయాలకు విస్తృత ప్రచారం కల్పించడం, కార్యకర్తలకు శిక్షణ... నిరంతరం కొనసాగుతాయి. నిబద్ధత, అంకితభావం కలిగిన కార్యకర్తలు బీజేపీ బలం. సూక్ష్మస్థాయిలో ప్లానింగ్, అమలు పక్కాగా ఉంటుంది. ఈ లక్షణాలు వీరికి ఆర్ఎస్ఎస్ నుంచి అబ్బాయి. సంస్థ కోసం సర్వస్వాన్ని త్యజించి, భవబంధాలను తెంచుకొని పూర్తిస్థాయిలో దేశమంతా కలిగతిరిగే నాయకులు, ప్రచారక్‌లు ఎందరో బీజేపీకి ఉన్నారు. ఈ రకమైన నిర్మాణంతో బీజేపీ... భారత రాజకీయ యవనికపై అత్యంత బలమైన పునాదులు కలిగిన పార్టీగా ఎదిగింది. వరుసగా రెండుమార్లు కేంద్రంలో అధికారం చేపట్టింది. – నేషనల్ డెస్క్, సాక్షి. -
చతుర్ముఖ పోరులో... పంజాబ్ షేర్ ఎవరో?
వచ్చే ఏడాది ఫిబ్రవరి– మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యంత కీలక రాష్ట్రం పంజాబ్. ఎందుకంటే మిగతా మూడు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ చిన్న రాష్ట్రాలు. సాగు చట్టాలకు వ్యతిరేక ఉద్యమంలో కీలక భూమిక పోషించిన పంజాబ్ రైతులు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు, ఎవరి పక్షాన నిలుస్తారు... అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే పంజాబ్ రాజకీయం బాగా వేడెక్కింది. శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలైతే ఏడాదికాలంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. దీనికి తోడు ఇటీవల స్వర్ణదేవాలయం, కపుర్తలాలలో సిక్కుల మతచిహ్నాలను అపవిత్రం చేసే ప్రయత్నాలు జరగడం, లుథియానా కోర్టులో పేలుడు వెనుక ఖలిస్థాన్ గ్రూపుల హస్తమున్నట్లు వార్తలు రావడంతో... రాజకీయాలకు మతం రంగు పులిమేందుకు, ఎన్నికల వేళ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు భారీ కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పేరిట కొత్త పార్టీని పెట్టి బీజేపీతో జట్టు కట్టడంతో పంజాబ్ ఎన్నికలు చతుర్ముఖ పోరుగా మారాయి. రాజకీయం రసకందాయంలో పడింది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల తాజా పరిస్థితిపై విశ్లేషణ... దళిత ఓటుపై గంపెడాశలు పదేళ్లు అధికారంలో ఉండి... తీవ్రమైన అవినీతి ఆరోపణలు, రాష్ట్రం డ్రగ్స్ ఊబిలో కూరుకుపోవడంతో 2017లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. కేవలం 15 సీట్లతో మూడోస్థానానికి పరిమితమైంది. పంజాబ్ రైతాంగంలో రగులుతున్న అసంతృప్తిని పసిగట్టిన అకాలీదళ్ 2020లో మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ బీజేపీతో రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంది. పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ సతీమణి హర్సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత అకాలీదళ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వస్తోంది. రాష్ట్ర జనాభాలో 32 శాతం దళితులు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని... మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో ఈ ఏడాది జూన్‌లోనే పొత్తు పెట్టుకుంది. 20 సీట్లకు బీఎస్పీకి వదిలిపెట్టింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి 111 స్థానాల్లో బరిలోకి దిగిన బీఎస్పీ 110 నియోజకవర్గాల్లో డిపాజిట్లు పోగొట్టుకుంది. 1.59 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. అయితే అంతకుముందు 2007లో 4.17 శాతం, 2012లో 4.3 శాతం ఓట్లను బీఎస్పీ పొందింది. దళితులపై పట్టున్న డేరాల ప్రభావం తగ్గడం, డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్ రామ్‌రహీమ్ సింగ్ జైలుకెళ్లడంతో... దళితల ఓట్లను కూడగట్టడంతో మాయావతి తొడ్పడగలరని అకాలీదళ్ అంచనా. అయితే సొంత రాష్ట్రం యూపీలో కూడా ఎన్నికలున్న నేపథ్యంలో పంజాబ్ ప్రచారానికి మాయావతి ఎంత సమయాన్ని కేటాయించగలరనేది ప్రశ్న. మరోవైపు సుఖ్బీర్ చాలా ముందునుంచే 2022లో పోటీచేసే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికి 91 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు. 21 కొత్త ముఖాలను దింపారు. ముందే ఖరారు కావడంతో నియోజకవర్గంలో స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి, తగినంత సమయం వెచ్చించడానికి అకాలీదళ్ అభ్యర్థులకు వీలు చిక్కింది. కొత్త పొత్తు... కాంగ్రెస్ పొమ్మనకుండా పొగబెట్టడం తో పాటియాలా రాజు.. అమరీందర్ ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ పేరిట సొంతకుంపటి పెట్టుకున్నారు. సాగు చట్టాలను రద్దు చేస్తే బీజేపీతో కలిసి బరిలోకి దిగుతానని ప్రకటించిన కెప్టెన్ అన్నట్లుగానే పొత్తును ఖరారు చేసుకున్నారు. ఎవరెన్ని సీట్లలో పోటీచేయాలనేది ఇంకా తేల్చుకోలేదు. అకాలీ చీలికవర్గ నేతలను కూడా కూటమిలో చేర్చుకుంటామని కెప్టెన్ ఇదివరకే స్పష్టం చేశారు. అకాలీదళ్‌తో పొత్తులో భాగం గా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 23 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ కేవలం మూడు స్థానాల్లో నెగ్గింది. 5.39 శాతం ఓట్లను సాధించింది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి పోటీచేసిన మూడింటిలో రెండు నెగ్గి...9.63 శాతం ఓట్లు పొందింది. అమరీందర్ కాంగ్రెస్ ఓట్లను ఎన్నింటిని చీల్చగలరు, సాగు చట్టాల రద్దు ఈ కూటమికి ఏ మేరకు లబ్ధి చేకూరుస్తుంది, మోదీ కరిష్మా రాబోయే ఎన్నికల్లో ఎన్ని ఓట్లను రాల్చ గలదు... ఇవన్నింటిపై ఈ కూటమి ఎన్ని చోట్ల గెలుస్తుందనేది ఆధారపడి ఉంటుంది. సొంతగూటిని చక్కదిద్దాలి.. ఒత్తిడికి తలొగ్గి అనుభవజ్ఞుడైన ముఖ్య మంత్రి అమరీందర్ సింగ్‌ను మార్చడం, తర్వాత అదేపనిగా పీసీసీ అధ్యక్షుడు నవ జ్యోత్ సింగ్ సిద్ధూ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తుండటంతో కాంగ్రెస్‌కు సొంత గూటిని సరిదిద్దుకోవడానికే ఎక్కువ సమయం సరిపోతోంది. పీసీసీ అధ్యక్షుడే సొంత ప్రభుత్వంపై బౌన్సర్లు సంధిస్తుంటే... తలబొప్పి కట్టడం ఖాయం. ప్రస్తుతం సిద్ధూతో కాంగ్రెస్ పెద్దలు ఇదే అవస్థను ఎదుర్కొంటున్నారు. పంజాబ్ జనాభాలో దాదాపు 32 శాతం దళిత ఓట్లు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని... ఆ వర్గానికి చెందిన చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఈ ఏడాది సెప్టెంబరులో సీఎం పీఠంపై కూర్చోబెట్టింది కాంగ్రెస్. ఎన్నికల్లో దళిత కార్డుగా ఉపయోగించుకోవడానికే చన్నీని అందలం ఎక్కించారని.. ఆర్నెళ్ల సీఎంగా మిగిలిపోతారని... కాంగ్రెస్‌కు దమ్ముంటే 2022 ఎన్నికల్లో కూడా ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ హస్తం పార్టీ అలా చేయలేదు. సర్వం తన కనుసన్నల్లో నడవాలనుకునే సిద్ధూకు కోపం తెప్పించే సాహసం కాంగ్రెస్ చేయలేదు. అలాగని ఆయన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ముందుకెళ్తే... దళిత ఓటు పోటును ఎదుర్కోవాల్సిన సంకట స్థితి. సిద్ధూ మాటల మాంత్రికుడు. చక్కటి హావభావాలతో సూటిగా ప్రజల మనసుల్లో ముద్రవేయగల వాగ్భాణాలను సంధిస్తారు. పంజాబ్ లో కాంగ్రెస్‌కు పర్యాయపదంగా మారిన అమరీందర్ లేని లోటును సిద్ధూ ఏమేరకు పూడ్చగలరు, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి తన చరిష్మాతో మళ్లీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేయగలరా? వేచి చూడాలి. కేజ్రీవాల్‌పైనే భారం ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌పై బాగా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో బల మైన పునాది కలిగిన అకాలీదళ్‌కు వెనక్కి నెట్టి... 20 స్థానాలతో ఆప్ పంజాబ్ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 23.72 శాతం ఓట్లు రావడంతో గత ఐదేళ్లుగా ప్రణాళిక ప్రకారం పంజాబ్‌లో బలపడేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో లోక్ ఇన్సాఫ్ పార్టీకి ఆరుస్థానాలను (రెండు నెగ్గింది) వదిలిన ఆప్ ఇప్పుడు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది. పూర్తిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రజాకర్షణపైనే ఆధారపడుతోంది. ఢిల్లీలో పాఠశాలల్లో నాణ్యత మెరుగుపడటం, మొహల్లా క్లినిక్‌లు విజయవంతం కావడం, పేదలకు ఉచిత విద్యుత్... తదితర ఢిల్లీ మోడల్ పాలనను అందిస్తామని వాగ్ధానం చేస్తోంది. సిక్కునే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు విడతల్లో 73 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. -
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ-సీ ఓటర్ సర్వే ఇలా!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ సీఓటర్ సర్వే నిర్వహించింది. ఇందులో యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో బీజేపీ అధికారం కైవసం చేసుకోన్నుట్లు ఏబీపీ సీ-ఓటర్ సర్వేలో వెల్లడించింది. కాగా పంజాబ్‌లో అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరించనున్నట్లు ఏబీపీ సీఓటర్ సర్వే పేర్కొంది. పంజాబ్‌లో 31.5 ఓట్ షేర్‌తో ఆప్ 55 సీట్లు సాధిస్తుందని ఏబీపీ సీఓటర్ సర్వే తెలిపింది. ఇక రెండో స్థానంలో కాంగ్రెస్ 37 సీట్లకు పరిమితమవుతుందని ఏబీసీ సీఓటర్ సర్వేలో స్పష్టం చేసింది. దీంతో పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తప్పదనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. యూపీలో బీజేపీకి 259 నుంచి 267 సీట్లు యూపీలో బీజేపీకి కాస్త ప్రాబల్యం తగ్గినా తిరిగి అధికారం దక్కించుకుంటుందని సర్వే తెలిపింది. బీజేపీ సుమారు 60 సీట్లను యూపీలో కోల్పోయినా అధికారానికి ఎటువంటి అడ్డంకులు ఉండవని పేర్కొంది. ఇక్కడ బీజేపీ 259 నుంచి 267నుంచి గెలుస్తుందని అంచనా వేసింది. అదే సమయంలో ఎస్పీ 109 నుంచి 117 సీట్లను గెలుచుకుంటుందని పేర్కొంది. ఇక బీఎస్పీ 12 నుంచి 16 సీట్లు గెలుచుకుంటుందని తెలిపిన సర్వే.. కాంగ్రెస్ 3 నుంచి 7 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. ఏబీపీ-సీ ఓటర్ సర్వే నిర్వహించిన సర్వేలో 44 శాతం మంది సీఎం యోగి నాయకత్వం పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపింది. గోవాలోనూ బీజేపీదే హవా! గోవాలో కూడా బీజేపీకే తిరిగి అధికారం కట్టబెట్టనున్నట్లు సర్వే తెలిపింది. బీజేపీ 39. 4 ఓట్ల శాతంతో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని, అదే సమయంలో ఆప్ 22.2 ఓట్ల శాతాన్ని సాధిస్తుందని పేర్కొంది. ఇక కాంగ్రెస్ 15.4 శాతానికి పరిమితం కానుందని తెలిపింది. బీజేపీకి 22 నుంచి 26 సీట్లు వస్తాయని వెల్లడించిన సర్వే.. ఆప్‌కు 4 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ 3 నుంచి 7 సీట్లకు పరిమితం కానుందని వెల్లడించింది. మణిపూర్‌లో బీజేపీకే ఆధిక్యం మణిపూర్‌లో సైతం బీజేపీనే ఆధిక్యంలో నిలిచి అధికారం దక్కించుకుంటుందని తెలిపింది. ఇక్కడ బీజేపీ 40.5 ఓట్ల శాతంతో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుంటుందని తెలిపిన సర్వే.. కాంగ్రెస్ 34.5 శాతంలో రెండో స్థానానికి పరిమితం కానుందని స్పష్టం చేసింది. ఇక్కడ బీజేపీకి 32 నుంచి 36 సీట్లు, కాంగ్రెస్ 18 నుంచి 22 సీట్లు వస్తాయని పేర్కొంది. ఉత్తరాఖండ్‌లో బీజేపీ కూటమికి 46 సీట్లు 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోని కూటమి 46 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, కాంగ్రెస్ 21 సీట్లు గెలుస్తుంది ఏబీపీ-సీఓటర్ తన సర్వేలో పేర్కొంది. అయితే ప్రస్తుతం ఉన్న సీట్లలో బీజేపీ 11 కోల్పోయే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు 38-46 సీట్లు, ఆప్‌కు 51-57 సీట్లు రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 38-46 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, ఆప్ 51-57 సీట్లు గెలుస్తుందని ఏబీపీ-సీఓటర్ తెలిపింది. చదవండి: ‘బాబుకు హఠాత్తుగా ఉత్తరాంధ్ర ఎందుకు గుర్తొచ్చిందో అర్థం కావడం లేదు’ చదవండి: Karnataka: ఆరు నెలలు జైల్లో ఉన్నా: హోంమంత్రి -
ఎన్నికల బాండ్ల విక్రయానికి ఓకే చెప్పిన సుప్రీం
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల బాండ్ల విక్రయంపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఎన్నికల బాండ్ల విక్రయానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, వి. రామసుబ్రమణియన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం అనుమతి మంజూరు చేసింది. 2018 నుంచి ఎన్నికల బాండ్ల విక్రయం నిరాటంకంగా జరుగుతోందని, ఇప్పుడు వీటిపై స్టే విధించడానికి తగిన కారణాలేవీ కనిపించడం లేదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. పశ్చిమబెంగాల్ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త ఎన్నికల బాండ్లను విక్రయిస్తే షెల్ కంపెనీలు పుట్టుకొచ్చి రాజకీయ పార్టీలకు అక్రమ మార్గాల్లో నిధులు సమకూరుతాయని అందుకే ఈ బాండ్ల విక్రయాలపై స్టే ఇవ్వాలంటూ స్వచ్ఛంద సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ (ఎడిఆర్) తన పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. ఎన్నికల బాండ్ల కొనుగోలు సంస్థల పేర్లు గోప్యంగా ఉంచడం వల్ల విదేశీ కంపెనీల నుంచి నిధులు పెద్ద ఎత్తున వచ్చి అవి దుర్వినియోగమవుతున్నాయని, ఆ అకౌంట్లలో పారదర్శకత కనిపించడం లేదని ఎడిఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే దీనిపై , కేంద్ర ప్రభుత్వం వాదన మరోలా ఉంది. ఎన్నికల సంఘం అనుమతి తీసుకొనే ఏప్రిల్ 1 నుంచి 10 వరకు ఎన్నికల బాండ్ల విక్రయం చేపడుతున్నామని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సుప్రీం కోర్టుకు తెలిపారు. ఎన్నికల బాండ్ల చెల్లుబాటు 15 రోజుల వరకు మాత్రమే ఉంటుందని, రాజకీయ పార్టీలు ఈ నిధులపై ఆదాయ పన్ను కూడా కట్టాలని అలాంటప్పుడు అక్రమ మార్గాల్లో నగదు వచ్చే అవకాశమే లేదని కేంద్రం పేర్కొంది. ఎన్నికల సంఘం కూడా బాండ్ల విక్రయానికి మద్దతు తెలపడంతో సుప్రీం కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. -
పోరు ఇక హోరాహోరీ!
తెలంగాణ అసెంబ్లీకి వచ్చే నెల 7న జరగబోయే ఎన్నికలకు గురువారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో బరిలో ఉండబోయే అభ్యర్థులెవరన్న అంశంలో స్పష్టత వచ్చింది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు రెండూ అసంతృప్తుల్ని బుజ్జగించి పోటీనుంచి వారు వైదొలగేలా చేయడంలో విజయం సాధించాయి. దాదాపు అరడజను స్థానాల్లో మినహా మిగిలినచోట్ల రెండు పార్టీలకూ రెబెల్స్ బెడద తప్పిపోయింది. టీఆర్ఎస్ గత ఎన్నికల మాదిరే ఈసారి కూడా ఎవరి తోనూ పొత్తు లేకుండా పోరుకు సిద్ధమైంది. కాంగ్రెస్ మాత్రం తెలుగుదేశం, తెలంగాణ జన సమితి (టీజేఎస్), సీపీఐలను కూడగట్టి ప్రజా కూటమిని ఏర్పరిచినట్టు ప్రకటించింది. మరోపక్క బీజేపీ అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇవిగాక దళిత, బీసీ పార్టీలను కలుపుకుని సీపీఎం బహు జన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్)ను రూపొందించింది. ప్రధాన ప్రత్యర్థిగా ఉండే ప్రజాకూటమి నామినే షన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తున్న సమయానికి కూడా పంపకాలు పూర్తి చేసుకోలేక చర్చోప చర్చల్లో మునిగి ఉండగా...టీఆర్ఎస్ నెలన్నరక్రితమే అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారంలో సైతం అందరికన్నా ముందుంది. కొత్తగా ఎన్నికల బరిలోకి దిగిన టీజేఎస్‌ను పొత్తు పేరుతో రారమ్మని పిలిచిన కాంగ్రెస్...ఆ పార్టీకి చుక్కలు చూపింది. చేదు అనుభవాన్ని మిగిల్చింది. 8 సీట్లు ఇస్తామని చెప్పి, ఆ పార్టీకి కేటాయించిన స్థానాల్లో సొంత అభ్యర్థులకు బీ ఫారాలిచ్చి, చివరికి నాలుగే మిగిల్చి దాన్ని అయోమయంలో పడేసింది. టీజేఎస్ అధినేత కోదండరాం దీన్ని మోసమనో, నమ్మక ద్రోహమనో అభివర్ణించి ఉంటే ఆ పొత్తు కాస్తా అక్కడితో ముగిసిపోయేది. కానీ ఆయన సంయ మనం పాటించారు. కాంగ్రెస్‌కు కనికరం లేదని, అది తమను అవమానించిందని, ఉద్యమ దిగ్గ జాల భవిష్యత్తును కూడా తాము వదులుకోవాల్సివచ్చిందని వాపోయారు. అయినా జనం కోసం అన్నీ భరిస్తామంటున్నారు. మంచిదే. కానీ కూటమికి సంబంధించిన ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ ఎజెండా బాధ్యతను తీసుకున్నానని చెబుతున్న ఆయన ఆ విషయంలో ప్రజలకు దృఢమైన భరోసా ఇవ్వగలుగుతారా? ఇచ్చినా వారు నమ్మగలరా? సీట్ల పంపకాల్లో మీకు జరిగిందేమిటని, దానిపై ఏం చేయగలిగారని ఎదురు ప్రశ్నిస్తే ఏం జవాబిస్తారు? ఏడెనిమిదేళ్లుగా రహస్య చెలిమితో కాలక్షేపం చేస్తూ వచ్చిన కాంగ్రెస్, తెలుగుదేశంల మధ్య సీట్ల సర్దుబాటులో సమస్యలు తలెత్తలేదు. తెలంగాణ ప్రజల్లో తమ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో... అధినేత చంద్రబాబు నాయుడు ఇరుక్కున్న ‘ఓటుకు కోట్లు’ కేసుతో అది ఇంకెంతగా దిగ జారిందో తెలుగుదేశం స్థానిక నాయకులకు బాగా తెలుసు. అందుకే వారు ‘దక్కినకాడికి దక్కుడు’ సూత్రాన్ని పాటించి కిక్కురుమనకుండా ఉండిపోయారు. అయితే గియితే ఈ ‘బహిరంగ చెలిమి’ వల్ల నష్టపోయేది కాంగ్రెసే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దాదాపు తొమ్మిదేళ్ల ఏలుబడిలో బాబు ఏం చేశారో తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. ఈ ప్రాంతాన్ని ఒక నిర్బంధ శిబిరంగా మార్చి, ‘తెలంగాణ’ పదం ఉచ్చరించినవారిపై నక్సలైట్ ముద్ర వేసి ఆయన సర్కారు చెలరేగిన తీరు జనం మస్తిష్కాలనుంచి ఇంకా చెరిగిపోలేదు. గాయని బెల్లి లలిత మొదలుకొని పౌర హక్కుల నేతల వరకూ ఎందరినో పొట్టనబెట్టుకున్న, వేధింపులకు గురిచేసిన అనేకానేక ముఠాల వెనక ఏ శక్తులు పనిచేశాయో వారికి తెలుసు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ పోరాడిన రైతులపై బషీర్ బాగ్‌లో తుపాకులు గర్జించడం, అక్కడ నేలకొరిగినవారి స్మృతికి కనీసం స్థూపం కట్టుకునే అవ కాశం కూడా లేకుండా చేయడం తెలంగాణ ప్రజలకు గుర్తుంది. మారుమూల పల్లెసీమల్లో తల్లీ బిడ్డల క్షేమం కోసం అహర్నిశలూ పాటుబడే అంగన్వాడీ మహిళలు తమకు కనీస వేతనాలివ్వా లని, తమ బతుక్కి భరోసా కల్పించాలని అడగడానికొస్తే గుర్రాలతో తొక్కించడం ఇప్పటికీ పల్లెప ల్లెనా ఒక పచ్చి జ్ఞాపకం. కరువుకాటకాల వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నలపై కరెంటు చార్జీల కత్తిని ఝుళిపించి... కట్టలేనివారి కరెంటు మోటార్లు జప్తు చేయించడం గుర్తులేనిదె వరికి? ఆ రైతన్నలు దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలకు రూపాయి కూడా రాల్చకుండా వీధిన పడేయడం మరిచిపోయేంత చిన్న విషయమా? అంతెందుకు కూటమికి మద్ద తుగా ప్రచారం చేస్తానంటున్న గద్దర్ ఒంట్లో ఇప్పటికీ మిగిలిపోయిన తూటా దోషిగా చూపేదెవ రిని? ఈ తరంలో చంద్రబాబు గురించి తెలియనివారెవరైనా ఉంటే... అటువంటివారికి ఆంధ్రప్రదే శ్లో ఆయన సాగిస్తున్న పాలనే ప్రత్యక్ష సాక్ష్యం. తనను జనం పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉంచినా ఆయనలో రవ్వంతయినా మార్పు రాలేదని అక్కడ నిత్యం కనబడుతూనే ఉంది. రాష్ట్ర విభజన జరిగాక కూడా ఇలాంటి నాయకుడిని పొత్తు పేరుతో మళ్లీ ఇక్కడికి రానిస్తున్నారన్న అప కీర్తిని కాంగ్రెస్ మూటగట్టుకోక తప్పని దుస్థితి ఏర్పడింది. ఈ విషయంలో తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ రాగల రోజుల్లో ఎలా ఒప్పించగలదో, దీన్నెలా అధిగమించగలదో చూడాలి. రాజస్తాన్, మధ్యప్రదేశ్లతోసహా అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచార పర్వంలో ఎక్కడా కన బడని యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ మేడ్చల్‌లో శుక్రవారం జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. తెలంగాణ కల సాకారం కావడానికి ఆమె ప్రధాన కారకురాలని అందరికీ తెలుసు. కానీ ఆమె ప్రసంగంలో టీఆర్ఎస్ పాలనపై చేసిన విమర్శల్ని పరధ్యానంగా విన్నవారికి సోనియా ఏపీలో తెలుగుదేశం ఏలుబడి గురించి మాట్లాడుతున్నారేమిటన్న అనుమానం వస్తే అది వారి తప్పు కాదు. భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచారని, ఉపాధి హామీ పథకాన్ని అటకెక్కించారని, డ్వాక్రా సంఘాల మహిళల్ని, యువతను నిరాశానిస్పృహల్లోకి నెట్టారని, దళితులకు, ఆదివాసీలకు ఒరగబెట్టిందేమీ లేదని టీఆర్ఎస్ పాలనపై ఆమె చేసిన విమర్శలు సహేతుకమైనవే కావొచ్చు. కానీ ఈ అంశాలన్నిటా అత్యంత అధ్వాన్నంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను రాచిచంపాన పెడుతున్న బాబుతో ఇక్కడెలా చెలిమి చేశారని ప్రశ్నిస్తే ఆమె ఏం సంజాయిషీ ఇస్తారు? ప్రజల్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల విషయంలో రాష్ట్రానికొక ప్రమాణాన్ని పాటించే పార్టీలను జనం విశ్వసిస్తారా? ఏదేమైనా తెలంగాణ ప్రజలు ఎంతో పరిణతి, వివేచన ఉన్నవారు. వారి తీర్పు ఎలా ఉంటుందో వచ్చే నెల 11 వరకూ వేచిచూడాలి. -
పంచతంత్రం 8th March 2017
-
పంచతంత్రం 3rd March 2017
-
పంచతంత్రం 24th February 2017
-
పంచతంత్రం 21st February 2017
-
మోదీ ప్రభుత్వానికి ఇది కత్తిమీద సామే
న్యూఢిల్లీ: అటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఇటు పెద్ద నోట్ల రద్దు ప్రభావం నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం పార్లమెంట్లో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కత్తిమీద సాము లాంటిదే. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఐదు రాష్ట్రాలకు ప్రత్యేక వరాలేమి ఇవ్వరాదని ఇప్పటికే సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్ హెచ్చరికలు చేశాయి. అయినప్పటికీ రాష్ట్రాలకు వర్తించే కేంద్ర పతకాలను అమలు చేయడంలో వాటికి కొంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా దేశానికి వర్తించే వరాల ద్వారానే మోదీ సర్కార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలను ఆకర్షించవచ్చు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం సాధారణంగా ప్రతి బడ్జెట్లో 96 శాతం నిధులు ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకు, మౌలిక సౌకర్యాల నిర్వహణకు, ఉద్యోగుల జీతభత్యాలకు, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపులకు, వాటి వడ్డీలకే ఖర్చవుతాయి. మిగతా నాలుగు శాతం నిధులనే కొత్త పథకాలకు, స్కీమ్‌లకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. కొత్త పన్నుల ద్వారా, పన్నుల విస్తతి ద్వారా అదనపు నిధులను సమకూర్చుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆ అవకాశం మోదీ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రవేశపెట్టిన 2014–15 వార్షిక కేంద్ర బడ్జెట్ ద్వారా లభించింది. మౌలిక సౌకర్యాల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధి రేటుకు అప్పుడే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండింది. ఆ అవకాశాన్ని జారవిడుచుకుంది. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిన నేపథ్యంలో, భారత ఆర్థిక వృద్ధి రేటు ఆరు శాతానికి మించదని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆకర్షించేందుకు మోదీ ప్రభుత్వం ఎలాంటి రాయితీలు కల్పించగలదన్నదే సర్వత్రా జరుగుతున్న చర్చ. ఉద్యోగులను, మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేందుకు ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రెండున్నర లక్షల రూపాయల నుంచి మూడున్నర లక్షలకు లేదా ఏకంగా ఐదు లక్షల రూపాయలకు పెంచవచ్చన్నది ఒక అంచనా. అలా చేసినా మోదీ ప్రభుత్వం ఒక్క వర్గాన్ని మాత్రమే ఆకర్షించగలదు. యూపీ ప్రజలకు ఆకర్షించాలంటే రైతు రుణాలను భారీగా మాఫీ చేయాలి. కొత్త స్కీమ్‌లు ప్రకటించాలి. అయితే వాటికి నిధులు ఎక్కుడి నుంచి వస్తాయన్నది మరో చిక్కు ప్రశ్న. కొన్ని పాశ్చాత్య దేశాల్లో లాగా మోదీ ప్రభుత్వం కూడా ‘యూనివర్శల్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్’ను తెస్తుందన్న ఊహాగానాలు గత కొంతకాలంగా సాగుతున్నాయి. ఈ స్కీమ్‌ను భారత్‌లో అమలు చేయాలంటే ఓ కుటుంబానికి సరాసరి ఐదుగురు వ్యక్తులు ఉంటార న్న అంచనాతో ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఐదుగురికి ఐదువేల రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వమే జమచేయాలి. ఉద్యోగ, నిరుద్యోగంతో సంబంధం లేకుండా ఇలా ప్రతి పౌరుడికి చెల్లించాల్సి ఉంటుంది. అలా చేసినట్లయితే ఏడాదికి 15.6 లక్షల కోట్ల రూపాయలు అవసరమని, అది స్థూల జాతీయోత్పత్తిలో పది శాతానికి మించిపోతుందని, భారతకున్న ఆర్థిక వ్యవస్థ ప్రకారం ఇది అసాధ్యమని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. ఆహారం, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులపై కేంద్రం ఇప్పటికే ఇస్తున్న సబ్సిడీల మొత్తం ఈ సంవత్సరానికి 2,31,781 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారుల అంచనాలు తెలియజేస్తున్నాయి. ఈ మొత్తం సబ్సిడీలను రద్దు చేయడంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ సంస్థల ఉద్యోగులను మినహాయిస్తే ‘యూనివర్శిల్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్’ను అమలు చేయవచ్చు. పెద్ద నోట్ల రద్దుతో పోయిన ఇమేజ్ను పెంచుకునేందుకు మోదీ ప్రభుత్వం అంతటి సాహసానికి ఒడికడుతుందా చూడాలి. -
ఐదు రాష్ట్రాల్లో బీజేపీదే విజయం...
హైదరాబాద్: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించడం ఖాయమని వెంకయ్యనాయు డు పేర్కొన్నారు. ఎవరు ఎవరితో కలిసినా ఉత్తర ప్రదేశ్‌తోపాటు గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్లలో బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. దేశంలోని పేదలు మోదీని ఆప ద్భాంధవుడిగా చూస్తున్నారని, పెద్దనోట్ల రద్దు నిర్ణయం అంతిమంగా పేదలకే మేలు చేస్తుందని నమ్ముతున్నారని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఉనికి లోనైనా లేని కమ్యూ నిస్టులు మోదీపై పనికట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే బడ్జెట్లో పేదల కోసం మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రకటించే అవకాశముందన్నారు. -
స్నేహం కోసం.. త్యాగానికి సిద్ధం!
- ప్రియనేస్తం ములాయం కోసం అమర్ సింగ్ కీలక నిర్ణయం! - అఖిలేశ్ డిమాండ్ మేరకు మూడు నెలలు పార్టీకి దూరంగా.. లక్నో: ఎవరి కోసమైతే తండ్రీకొడుకులైన ములాయం, అఖిలేశ్‌లు తగువులాడుకుంటున్నారో.. ఆ అమర్‌సింగ్ చివరికి త్యాగానికి సిద్ధపడ్డట్టు తెలిసింది. ప్రియ స్నేహితుడి కొడుకు, తనను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న సీఎం అఖిలేశ్ డిమాంఢ్ మేరకు.. ఎంపీ అమర్ మూడు నెలలపాటు రాజకీయ సన్యాసం తీసుకొనబోతున్నారని సమాచారం. ఈ మూడు నెలలూ పార్టీకి సంబంధించిన అన్ని రకాల నిర్ణయాధికారాలు అఖిలేశ్ తీసుకుంటారు. ఈ అంశం ప్రాతిపదికనే గురువారం రాత్రి నుంచి ములాయం, అఖిలేశ్‌ల నివాసాల్లో ఎడతెరిపిలేకుండా మంతనాలు సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం అనూహ్యంగా బాబాయి శివపాల్ యాదవ్.. అఖిలేశ్ ఇంటికి వెళ్లారు. అటు ఎంపీ అమర్ సింగ్.. ములాయంతో భేటీ అయ్యారు. మరి కొద్ది గంటల్లోనే అమర్ త్యాగానికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని అంచనా. (ఆయన గుండెల్లో నేను లేని క్షణాన.. ) ఉత్తరప్రదేశ్‌లో తిరిగి అధికారం సాధించేలా మార్చి వరకు సర్వనిర్ణయాధికారాలూ తనకే కట్టబెట్టాలని సీఎం అఖిలేశ్ తండ్రి ములాయం సింగ్‌ను కోరినట్లు.. అఖిలేశ్ వర్గీయుడైన మంత్రి రవిదాస్ మల్హోత్రా మీడియాకు చెప్పారు. నేతాజీ(ములాయం) కూడా ఇందుకు మొగ్గుచూపే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 214 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఇప్పటికే పార్టీని స్వాధీనం చేసుకున్న అఖిలేశ్ యాదవ్.. తండ్రి ములాయంను పార్టీ ‘మార్గదర్శి’గా నియమించారు. పార్టీని తిరిగి కైవసం చేసుకోలేని స్థితిలో ములాయం.. కొడుకుకు జై కొట్టడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని అఖిలేశ్ వర్గంలోని అతివాదులు వ్యాఖ్యానించారు. (ములాయం 'అమర'ప్రేమ రహస్యం) అఖిలేశ్ డిమాండ్ ప్రకారం అమర్‌సింగ్, శివపాల్ యాదవ్‌లు వచ్చే మూడు నెలల పార్టీకి దూరంగా ఉండేలి. అభ్యర్థుల ఎంపిక సహా ఎలాంటి నిర్ణయాలలో జోక్యం చేసుకోకుదు. అయితే ఈ మాటను ములాయం చేతే చెప్పించాలని అఖిలేశ్ పట్టుపడుతున్నారు. సైకిల్ గుర్తు తమదేనంటూ ఎన్నికల కమిషన్ ముందు వాదనలు వినిపించేందుకు గురువారం ఢిల్లీ వెళ్లిన ములాయం.. కమిషన్‌ను కలవకుండానే లక్నోకు తిరుగుపయనం అయ్యారు. ఆ విధంగా సైకిల్ గుర్తు అఖిలేశ్‌కే దక్కేలా ములాయం వ్యవహరించారని తేలింది. (మా పార్టీని సర్వనాశనం చేస్తున్నది ఆయనే!) -
'బడ్జెట్ ఆపించండి.. కుదరదు.. మేం పెడతాం'
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌పై దుమారం మొదలైంది. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనందున ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టే బడ్జెట్ వాయిదా వేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు గురువారం చీఫ్ ఎన్నికల కమిషన్‌ను కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సమాజ్ వాది పార్టీ, బీఎస్పీ, ఆర్జేడీ పార్టీ నేతలు కలిశారు. ఎన్నికలకు ముందు బడ్జెట్ ప్రవేశపెట్టడం సరికాదని సీఈసీకి చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ వాయిదా వేయించాలని కోరారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిపించాలని కోరారు. మరోపక్క, బడ్జెట్ అనేది రాజ్యాంగ ప్రక్రియలో భాగం అని, బడ్జెట్ పెట్టి తీరుతామని కేంద్రం అంటోంది. విపక్షాలవి పసలేని వాదనలని కొట్టిపారేస్తోంది. అయితే, కేంద్రం వాదనతో శివసేన పార్టీ విబేధించింది. ఎన్నికలకు ముందు బడ్జెట్ ప్రవేశపెట్టడం సరికాదని చెప్పింది. వెంటనే కేంద్ర బడ్జెట్‌ను వాయిదా వేయాలని శివసేన పార్టీ నేత సంజయ్ దత్ డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలకు ఫిబ్రవరి 4 నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలవుతున్న విషయం తెలిసిందే. కాగా, 2012లో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఫిబ్రవరి నెలాఖరున ప్రవేశ పెట్టాల్సిన బడ్జెట్‌ను ఎన్నికల తర్వాత మార్చి మధ్యలో ప్రవేశపెట్టారు. అయితే కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాత్రం 2014లో కూడా ఎన్నికలకు ముందే బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పారు. ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నాయని బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆపుతారా అని అన్నారు. విపక్షాలు డిమాండ్ మేరకు సీఈసీ ఏవిధంగా స్పందిస్తారని తెలియాల్సి ఉంది. -
‘సైకిల్ గుర్తు రద్దు’పై ఈసీ స్పందన..
-
ఐదు రాష్ట్రాల ఎన్నికలు: ఈసీ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల కమిషన్ బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన తేదీలతోపాటు అనుసరించనున్న మార్గదర్శకాలనూ వెల్లడించింది. (ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల) ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోని అన్ని కుటుంబాలకూ తొలిసారిగా ‘ఓటర్ గైడ్’ బుక్‌లెట్‌ను అందించనున్నారు. ఓటింగ్ కంపార్ట్మెంట్(చుట్టూ తెరలతో ఈవీఎంలు ఉండే చోట) ఎత్తును 30 ఇంచులు పెంచుతున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈసీ వెల్లడించిన మార్గదర్శకాల్లో కొన్ని ముఖ్యాంశాలాలివి.. ► ఐదు రాష్ట్రాల్లో ఏకబిగిన ఎన్నికలు నిర్వహింస్తారు. నోటిఫికేషన్ వెలువడిన బుధవారం నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది. ► ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 16 కోట్ల మంది ఓట్లు ఉన్నారు. ► ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోని ప్రతి ఇంటికి(కుటుంబానికి) ఒక ఓటర్ గైడ్(బుక్లెట్)ను అందిస్తారు. కలర్‌ఫుల్ పేజీలతో ముద్రించిన ఈ బుక్‌లెట్‌లో ఓటు విలువ, ఓటు వేయాల్సిన అవసరత, పోలింగ్ స్టేషన్లో నడుచుకోవాల్సిన తీరు తదితర సూచనలు పొందుపర్చారు. ► ఓటింగ్ కంపార్ట్మెంట్(ఈవీఎంలు ఉండే చోటు) ఎత్తును 30 ఇంచులు పెంచారు. దీంతో ఓటు వేసేందుకు లోపలికి వెళ్లినవారికి.. బూత్‌లోనే కూర్చొని ఉండే ఏజెంట్లుగానీ, ఇతరులుగానీ సంజ్ఞలు చేసే అవకాశం ఉండదు. తద్వారా రహస్య ఓటింగ్ ప్రక్రియ పకడ్బందీగా అమలవుతుందని ఈసీ పేర్కొంది. ► ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒటింగ్ ప్రక్రియకు సంబంధిచిన 4 పోస్టర్లను అంటించి ఉంచుతారు. ► ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 1లక్షా 85 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేయనున్నారు. ► మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ స్టేషనల్ లను ఏర్పాటుచేస్తారు. ► ఎన్నికల ప్రచారంలో రాజకీయపార్టీలు ప్లాస్టిక్ వినియోగించరాదని, ఎక్కువ శబ్దాన్నిచ్చే లౌడ్స్పీకర్లు, టపాసులు పేల్చడంలాంటివి కూడదని ఈసీ సూచించింది. ఈ ఎన్నికల ప్రక్రియ అంతటా ఈసీ పర్యావరణహిత వస్తువులను మాత్రమే వినయోగిస్తుందని సీఈసీ నజీంజైదీ చెప్పారు. ► ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఒక్కొక్కరు గరిష్టంగా రూ.28 లక్షలకు మించి ఎన్నికల ప్రచారానికి వినియోగించరాదు. అదే గోవా, మణిపూర్లలోనైతే ఆ పరిమితి రూ.20 లక్షలే. ► సొంత టీవీ చానెళ్లు కలిగిన నేతలు, పార్టీలపై ఈసీ ప్రత్యేక నిఘా పెడుతుంది. టీవీల్లో ప్రసారం అయ్యే యాడ్లను కూడా అభ్యర్థుల ఖర్చుకిందే పరిగణిస్తారు. అలాగే పత్రికల్లో వచ్చే ప్రకటనలను గుర్తించేందుకు ఈసీ.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారం తీసుకోనుంది. ► పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ఒకే విడతలో ఫిబ్రవరి 4న పోలింగ్ జరుగుంది. ► ఉత్తరాఖండ్‌లో ఒకే విడత ఫిబ్రవరి 15న పోలింగ్ జరుతుంది. ► మణిపూర్‌లో రెండు విడదలుగా.. మార్చి 4, మార్చి 8న పోలింగ్ ఉంటుంది. ► పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 11, 15, 19, 23, 27, మార్చి 4, మార్చి 8 తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ► ఐదు రాష్ట్రాల ఎన్నికల కు సంబంధించిన ఓట్ల లెక్కింపు మార్చి 11న ప్రారంభం అవుతంది. అదేరోజు ఫలితాలు వెల్లడవుతాయి. -
విడదీసినా యూపీలోనే ఎక్కువ
(ఇంటర్నెట్ ప్రత్యేకం) భౌగోళికంగా అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఒక భాగాన్ని విభజించి ప్రత్యేక ఉత్తరాఖండ్ రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తర్వాత కూడా దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ కొనసాగుతోంది. భౌగోళికంగానే కాకుండా అత్యధిక లోక్ సభ, రాజ్యసభ, శాసనసభ స్థానాలు కూడా ఆ రాష్ట్రం నుంచే ఎక్కువగా ఉన్నాయి. సంఖ్య రాష్ట్రం లోక్ సభ రాజ్యసభ అసెంబ్లీ స్థానాలు 1 ఉత్తరప్రదేశ్ 80 31 403 2 పశ్చిమ బెంగాల్ 42 16 294 3 మహారాష్ట్ర 48 19 288 4 బీహార్ 40 16 243 5 తమిళనాడు 39 18 234 6 మధ్యప్రదేశ్ 29 11 230 7 కర్నాటక 28 12 224 8 రాజస్థాన్ 25 10 200 9 గుజరాత్ 26 11 182 10 ఆంధ్రప్రదేశ్ 25 11 175 11 ఒడిస్సా 21 10 147 12 కేరళ 20 9 140 13 అస్సోం 14 7 126 14 తెలంగాణ 17 7 119 15 పంజాబ్ 13 7 117 16 చత్తీస్ గఢ్ 11 5 90 17 హరియాణా 10 5 90 18 జమ్మూ కశ్మీర్ 6 4 87 19 జార్ఘంఢ్ 14 3 81 20 న్యూఢిల్లీ 7 3 70 21 ఉత్తరాఖంఢ్ 5 3 70 22 హిమాచల్ ప్రదేశ్ 4 3 68 23 అరుణాచల్ ప్రదేశ్ 2 1 60 24 మణిపూర్ 2 1 60 25 మేఘాలయ 2 1 60 26 త్రిపుర 2 1 60 27 నాగాలాండ్ 1 1 60 28 గోవా 2 1 40 29 మిజోరం 1 1 40 30 సిక్కిం 1 1 32 31 పుదుచ్చేరి 1 1 30 కేంద్ర పాలిత ప్రాంతాలు 5 - - నామినేటెడ్ (రాజ్యసభ) - 12 - నామినేటెడ్ (లోక్ సభ) 2 - - మొత్తం స్థానాలు 545 245 4120 -
‘సైకిల్ గుర్తు రద్దు’పై ఈసీ స్పందన..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ రెండుగా చీలిన నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల గుర్తైన సైకిల్‌పై వివాదం చెలరేగడం, ఆ గుర్తు తమకే కేటాయించాలని ఇరు పక్షాలూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ స్పందించారు. బుధవారం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధిచిన నోటిఫికేషన్‌ను జారీచేసిన ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. (ఈసీ ముంగిట్లో ‘సైకిల్’ పంచాయితీ) ‘వివాదాల నేపథ్యంలో సైకిల్ గుర్తును రద్దుచేస్తారా?’అన్న విలేకరుల ప్రశ్నకు ఈసీ వ్యూహాత్మకంగా బదులిచ్చారు. ‘‘ప్రస్తుతానికి’ అలాంటి ఆలోచన ఊహాజనితమే’నని వ్యాఖ్యానించారు. ములాయం సింగ్‌తోపాటు, అఖిలేశ్ వర్గం నుంచి రాంగోపాల్ యాదవ్‌లు ఈసీని సంప్రదించారని, ఎన్నికల గుర్తు తమకే కేటాయించాలని ఇరు వర్గాలూ సంబంధిత పత్రాలు సమర్పించారని జైదీ చెప్పారు. గతంలో ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు ఈసీ వెల్లడించిన నిర్ణయాలను, వాటికి సంబంధించిన చట్టాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత.. సైకిల్ గుర్తుపై సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని వెల్లడిస్తామని అన్నారు. (వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న అఖిలేశ్.. ‘గుర్తు’పైనే గురి) -
‘రద్దు’ కాదు మోదీ విజయ పరంపరకు అడ్డుకట్ట
అవలోకనం ఆర్థికరంగంలో నిజంగా ఎలాంటి మెరుగైన పనితీరును ప్రదర్శించకుండానే భారత్‌లో నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిర , పాకిస్తాన్లో జుల్ఫికర్ ఆలీ భుట్టో, ఆయన కుమార్తె బెనజీర్ భుట్టో తమ ఓటర్లకు తాము అంటిపెట్టుకుని ఉండగలిగారు. సరిగ్గా అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓటర్లపై తన పట్టును నిలుపుకోగలరని అనుకోవచ్చు. అందువలన బీజేపీ తన విజయ పరంపరను 2017లో కూడా కొనసాగిస్తే ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఒక నాయకుని జనాదరణను అంచనా వేసేటప్పుడు ఆ నేత పనితీరుకు ఉండే ప్రాముఖ్యత ఏమిటి? తార్కికంగా చూస్తే ప్రజలకు సుఖసంపదలను కలుగ చేయగలిగిన నేతకు ప్రజాదరణ లభిస్తుందని భావించాలి. ప్రజాస్వామ్య విధా నాలలోకెల్లా అత్యంత ముఖ్యమైన, విలువైన అంశం అదే అనిపిస్తుంది. కాబట్టి దేశం లేదా రాష్ట్రం అధిక ఆర్థిక వృద్ధి రేటును సాధిస్తున్న కాలంలో అధికారంలో ఉన్న పార్టీలు తిరిగి అధికారంలోకి రాగలుగుతాయి. గత రెండు దశాబ్దాల కాలంలో చాలా మంది భారత నేతలు ప్రభుత్వ వ్యతిరేకతను తలకిందులు చేసి అధికారాన్ని నిలబెట్టుకోగలిగారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్, బిహార్‌లో నితీష్ కుమార్, మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ వంటి ముఖ్యమంత్రులు ఈ సందర్భంగా మనకు గుర్తుకు వస్తారు. తమ రాష్ట్రాలు సాపేక్షికంగా త్వరితగతిన వృద్ధి చెందుతున్న కాలంలో వారు నాయ కులుగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఒక శక్తివంతమైన రాజకీయ అంశంగా భావిస్తారు. ఆ గుదిబండను తలకిందులు చేయడానికి ఆర్థిక వృద్ధి వారికి తోడ్పడింది. దీనికి విరుద్ధ తర్కాన్ని బట్టి చూస్తే... మంచి పనితీరును, ప్రత్యేకించి ఆర్థిక వ్యవస్థ విషయంలో మంచి పనితీరును ప్రదర్శించలేని నాయకులను ఓటర్లు శిక్షిస్తారు. తమకు నాయకులుగా ఉన్నవారు ఆర్థిక సంపద రీత్యా తమ జీవితాల్లో పరి వర్తనను తేవాలని ఓటర్లు ఆశిస్తారు. దీనికి మద్దతుగా నిలిచే గణాంక సమాచారమేమీ లేకపోవడమే ఈ సిద్ధాంతంతో ఉన్న సమస్య. చారిత్రకంగా మన దేశం అత్యున్నత ఆర్థిక వృద్ధిని సాధిస్తుండిన 2004–2014 దశాబ్దిలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినా అది 2014 ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయింది, లోక్‌సభలో ఎన్నడూ ఎరుగనంతటి అతి తక్కువ స్థానాలకు దిగజారిపోయింది. ఆ ఎన్నికలను ఇతర అంశాలు ప్రభావితం చేశాయని ఎవరైనా అనొచ్చు. మన్మోహన్ ప్రభుత్వంపై పడ్డ అవినీతి ముద్ర, మోదీ రంగంపైకి రావడం, దూకుడుగా ప్రచారం సాగించడం అనేవి సుస్పష్టంగా కనిపించే ఇతర అంశాలు. కాబట్టి 2014 సార్వత్రిక ఎన్నికలను మనం ఒక మినహాయింపుగా లేదా ఈ సిద్ధాంతం పరిధిలోకి రానిదిగా చూడవచ్చు. దురదృష్టవశాత్తూ అంతకు ముందటి గణాంక సమాచారం మరింత అర కొరగా ఉంది. 2004 వరకు సాగిన ఐదేళ్ల అటల్ బిహారీ వాజ్‌పేయి పాలన ఇటీవలి కాలంలో అత్యధిక వృద్ధిని సాధించిన కాలంగా రెండవ స్థానంలో నిలుస్తుంది. ఆ ఎన్నికలలో విజయం పట్ల ఆయన ఎంతో ధీమా చూపారు. ‘భారత్ వెలిగిపోతోంది’ అనే ప్రకటనల యుద్ధంతో ఆయన తమ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానీ ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన ఓట మికి కారణాలు సైతం నిజంగా ఎవరికీ అర్థంకానివే. దేశాన్ని తాము సౌభాగ్య వంతం చేశామనే భారతీయ జనతా పార్టీ విశ్వాసం వాస్తవ దూరమైననది, నిరాధారమైనది ఆనే ఊహాగానం ప్రచారంలోకి వచ్చింది. అంటే పనితీరు బాగుండి ఉంటే ఆయన ఆ ఎన్నికల్లో గెలిచి ఉండేవారే కదా? నేనైతే కాదు అంటాను. ఉపఖండంలో జరిగే ఎన్నికలలో విజయాన్ని సాధించడానికి ఆర్థికరంగంలోని పనితీరు బాగుండటం ఆవశ్యకమైన çపరిస్థితేమీ కాదు. అందుకు అంతకు ముందటి దశాబ్దాలలోని ఆర్థిక రంగం పని తీరే రుజువు. స్థూల జాతీయోత్పత్తి రీత్యా 1950లు,1960లలో ఆర్థిక రంగంలో కాంగ్రెస్ పని తీరు మరీ నాసిరకమైనది. ‘హిందూ వృద్ధి రేటు’ అంటే ఆ కాలం నాటి 3 శాతం లేదా అంతకంటే తక్కువ వృద్ధి రేటు అని అర్థం. అయినా కాంగ్రెస్ ఆ కాలంలో గొప్ప ఎన్నికల విజయాలను సాధించింది. నేడు సుపరిపాలనగా మనం పిలిచేది ఏదీ ఆ కాలంలో కనబడలేదు లేదా చర్చకు రాలేదు. 1960ల నాటికంటే నేడు మనం పూర్తిగా భిన్నమైన ప్రజలమా? కాదంటాను నేను. దేశాలు, ప్రత్యేకించి భారత్ వంటి ప్రాచీన దేశాలు అంత నాటకీయంగా మారిపోజాలవు. కాబట్టి అన్నిటికంటే మిన్నగా ఆర్థిక రంగంలోని పనితీరే ఎన్నికలలో లబ్ధిని చేకూర్చే అంశం అనడానికి ఎలాంటి ఆధారం లేదనే చెప్పాలి. పెద్ద నోట్ల రద్దు ఫలితంగా నేడు నెలకొన్న సంక్షోభం 2017 ఎన్నికలలో మోదీ పార్టీ విజయావకాశాలను ఎలా ప్రభావితం చేస్తుంది? దానిని పరిశీలిం చడం కోసమే మనం ఈ అంశాన్ని చర్చిస్తున్నాం.పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, గోవా వంటి చిన్న రాష్ట్రాలలోనూ, ఆ తదుపరి గుజరాత్‌లోనూ బీజేపీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. మోదీ హయాంలో ఆర్థిక రంగం పని తీరు నిరుత్సాహకరంగా ఉండటం, ఉపద్రవంగా మారిన పెద్ద నోట్ల రద్దు వ్యవ హారం మోదీని పరాజితుడ్ని చేసే అవకాశం ఎక్కువగా ఉన్నదని ఆ పార్టీ వ్యతి రేకులు భావించవచ్చు. అది మరీ అంత సామాన్యమైన విషయమేమీ కాదనుకుంటాను. ప్రజలను సమ్మోహితులను చేసే శక్తి, విశ్వసనీయత, కథనాత్మకత ఇంకా మోదీ పక్షానే ఉన్నాయి. కొందరు ఓటర్లలో ఉన్న అసంతృప్తిని ఆగ్రహంగా పరివర్తన చెందించ డానికి ప్రతిపక్షం చాలా కృషి చేయాల్సి ఉంటుంది. నోట్ల రద్దు దుష్ప్రభావం ఫిబ్రవరిలో కూడా కొనసాగినంత మాత్రాన, అది విజయాన్ని వారి ఒడిలోకి వచ్చి వాలేలా చేస్తుందని ఆశించడానికి వీల్లేదు. నిర్లక్ష్యపూరితంగా జరిపిన నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా, కొన్ని త్రైమాసికల పాటు జీడీపీ వృద్ధి కొన్ని పాయింట్లు తగ్గినా... వాటికవే మోదీ జనాదరణను మటుమాయం చేయలేవు. ఆర్థికరంగంలో నిజంగా ఎలాంటి మెరుగైన పనితీరును ప్రదర్శించకుండానే భారత్‌లో నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిర , పాకిస్తాన్లో జుల్ఫికర్ ఆలీ భుట్టో, ఆయన కుమార్తె తమ ఓటర్లకు తాము అంటిపెట్టుకుని ఉండగలిగారు. సరిగ్గా అలాగే మోదీ కూడా ఓటర్లపై తన పట్టును నిలుపుకోగలరని అనుకోవచ్చు. అందు వలన బీజేపీ తన విజయ పరంపరను 2017లో కూడా కొనసాగిస్తే ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు. (వ్యాసకర్త ఆకార్ పటేల్, కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ) -
అసెంబ్లీ ఎన్నికలపై ‘నోట్ల’ ప్రభావం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో కలిగే లాభ నష్టాల గురించి ఓ పక్క చర్చ జరుగుతుండగానే మరో పక్క వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ధన బలం, కండ బలం ప్రతిసారి ప్రధాన పాత్ర పోషిస్తాయన్నది అందరికి తెల్సిందే. ఎన్నికల ఖర్చుపై సాధారణంగా ఎన్నికల సంఘం నిఘా ఉంటుంది కనుక ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ప్రచార వ్యూహం కోసం డబ్బులు ఖర్చు పెడతారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్నది తెల్సిందే. యూపీ, పంజాబ్ ఎన్నికలకు చాలా ముందే మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో ఇతర పార్టీలపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రెండు రాష్ట్రాల్లో చాలా పార్టీలు అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకొని టిక్కెట్లు ఇస్తాయి. అదంతా సాధారణంగా బ్లాక్ మనీ రూపంలోనే ఉంటుంది. అభ్యర్థిగా ఖరారైన వ్యక్తి పలుకుబడి కలిగిన స్థానిక నాయకులను తనవైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. వారు మరో పార్టీలోకి ఫిరాయించకుండా డబ్బులతోని వారికి ఎరవేస్తారు. వారి ద్వారా కింది కార్యకర్తస్థాయి వరకు తన కోసం పనిచేసేందుకు కూడా నల్లడబ్బునే ఖర్చు పెడతారు. ఆ తర్వాత సభలు, సమావేశాల నిర్వహణకు, ప్రచార సామాగ్రి ముద్రణకు భారీగా ఖర్చు పెడతారు. పోలింగ్ రోజున ఓటర్లను తరలించేందుకు, వారిని ప్రభావితం చేసేందుకు కూడా డబ్బును నీళ్లలా ఖర్చు పెడతారు. ఇందులో ఎన్నికల ఖర్చు పరిధిలోకి వచ్చే సభలు, సమావేశాలు, ముద్రణా ఖర్చులకు మినహా మిగతా వాటన్నింటికీ అభ్యర్థులు నల్లడబ్బునే ఖర్చు పెడతారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో ఈసారి పలు పార్టీలకు నల్లడబ్బును ఖర్చు పెట్టేందుకు అవకాశం లేదు. బీజేపీకి ఈ కష్టాలు లేవు. డబ్బులు తీసుకొని అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అధికారంలోవున్న జాతీయ పార్టీ అవడం, అభ్యర్థుల ఎంపికలో ఆరెస్సెస్ లాంటి సంస్థల ప్రభావం ఉండడం, పార్టీ ప్రచారం కోసం స్వచ్ఛందంగా పనిచేసేందుకు ఆరెస్సెస్, పార్టీ కార్యకర్తలు ఉండడం కారణం. స్థానిక నాయకత్వంపై ఆధారపడకుండా కేంద్రంలోని మోదీ ప్రతిష్ట మేరకు ఓట్లేసే అవకాశం ఉండడం తదితర కారణాల వల్ల బీజేపీ నల్లడబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం అంతగా లేదు. పైగా అవినీతికి, నల్లడబ్బుకు పోరాడుతున్న ఏకాకి పార్టీ తమదేనంటూ చెప్పుకోవడం ద్వారా, దేశభక్తి నినాదాన్ని ప్రచారం చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందే అవకాశం కూడా ఉంది. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం గురించి బీజేపీ నేతలకు ముందే తెలుసుకనుక వారు ముందే సర్దుకున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం నిజమే అయితే అది కూడా బీజేపీకి అదనంగా కలిసొచ్చే అంశం. అయితే పెద్ద నోట్ల రద్దుతో నేడు అష్టకష్టాలు పడుతున్న ప్రజల్లో మోదీ పట్ల ఎంత కోపం ఉందో, ఆ కోపం అసెంబ్లీ ఎన్నికల నాటికి చల్లారుతుందా, లేదా ? వారు ఎవరికి ఓటు వేసే అవకాశం ఉంటుందో ఇప్పుడే అంచనా వేయలేం. -
హస్తవాసి మారదా?
‘ఉపాయం లేనివాణ్ణి ఊళ్లోంచి వెళ్లగొట్టాలి' అంటారు. అందుకే అయిదు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో జనం కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టారు. కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఇంటిదారి పట్టించడంతోపాటు ఇతరచోట్ల సైతం చేతికి చోటు లేదని తేల్చారు. పర్యవసానంగా కాంగ్రెస్‌లో ఇప్పుడు కొందరికి ‘ధైర్యం’ వచ్చింది. ఇలాగైతే ఎలా అన్న ప్రశ్నలు మొలకెత్తడం మొదలైంది. ‘ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకుందామ’ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన పిలుపును పరిహసిస్తూ ‘ఆత్మ పరిశీలనలూ, అంతర్మథనాలూ చాలు. ఇది కార్యాచరణకు దిగవలసిన సమయం’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ గుర్తుచేశారు. పార్టీకి పెద్దాపరేషన్ అవసరమని కూడా అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మామూలుగా కాదు...కనీవినీ ఎరుగని రీతిలో ఓటమి చవిచూసిన కాంగ్రెస్ పార్టీ... అప్పటినుంచీ అంతూ దరీ తోచక చీకట్లో తడుములాడుతోంది. పార్టీ శ్రేణుల్ని ఉరికించగల సామర్థ్యం ఉన్న సారథి లేక... పదునైన వ్యూహం జాడ కనబడక అక్కడింకా పొద్దుపొడవ లేదు. దిగ్విజయ్ వ్యాఖ్యలు దీనికి తార్కాణం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి తగిలిన దెబ్బ సామాన్యమైనది కాదు. తమిళనాట ఆ పార్టీది మూడో స్థానం. పశ్చిమబెంగాల్లో రెండో స్థానమే అయినా విజయభేరి మోగించిన తృణమూల్‌కు అది ఎన్నో యోజనాల దూరం. వామపక్ష శ్రేణుల దయవల్ల అక్కడ గతంకన్నా రెండు సీట్లు అదనంగా సంపాదించి లాభపడినా... తన ఓట్లను మాత్రం వారికి బదిలీ చేయలేకపోయింది. ఫలితంగా వామపక్షానికి దక్కినవి 33 మాత్రమే! చెప్పుకున్న సంకల్పానికి కట్టుబడి ఒంటరిగా పోటీచేసినా ఇంతకన్నా మెరుగ్గా ఉండేవాళ్లమని ఇప్పుడు సీపీఎం శ్రేణులు బాధపడుతున్నాయి. ‘బెంగాల్ లైన్’తో భంగపడ్డామని భావిస్తున్నాయి. ఆ మూలనున్న చిన్న రాష్ట్రం పుదుచ్చేరి ఒక్కటే తెలిసో, తెలియకో కాంగ్రెస్‌ను ఆదరించింది. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఆరుచోట్ల ఉప ఎన్నికలు జరగ్గా అందులో ఒక్కటంటే ఒక్కటే కాంగ్రెస్‌కు లభించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న యూపీలో పరిస్థితి మరింత ఘోరం. అక్కడ ఉప ఎన్నికలు జరిగిన రెండుచోట్లా ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. కాంగ్రెస్ క్షీణ దశలో ఉందన్న సంగతి ఈ రెండేళ్లుగా అందరికీ తెలుస్తూనే ఉంది. ఈ వ్యవధిలో మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా బిహార్ మినహా అన్నిటా ఆ పార్టీ ఓటమే చవిచూసింది. మూడేళ్లక్రితం రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసినప్పుడు ‘ఈసారి చూసుకోండి... నా తడాఖా’ అని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ జబ్బలు చరిచారు. ‘ఎవరూ ఊహించని స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేస్తాన’ని మాటిచ్చారు. కానీ ఇప్పటికీ దాని జాడ లేదు. ఏడాదిగా రాహుల్ శ్రమిస్తున్నట్టే కనబడుతున్నారు. అయితే అదంతా మాటల శ్రమే. చేతలు మాత్రం సున్నా. వీలైనచోటల్లా ప్రధాని నరేంద్రమోదీపై నోరుచేసుకోవడమే పోరాటమని ఆయన భ్రమపడుతున్నారు. పార్టీ సంస్థాగత యంత్రాంగాన్ని సరిచేయడం సంగతలా ఉంచి తనకంటూ సొంత టీంను ఏర్పాటుచేసుకోవడానికే ఆయనకు సమయం చిక్కడంలేదు. జనం విశ్వాసాన్ని చూరగొనేవరకూ పార్టీ కష్టపడుతూనే ఉంటుందని తాజా ఫలితాల తర్వాత రాహుల్ చెప్పడం బాగానే ఉన్నా... అదెలా ఉంటుందో, ఉండాలో ఆయనకు బోధపడిన సూచనలు కనిపిం చడం లేదు. సోనియాగాంధీ పద్దెనిమిదేళ్లుగా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. అదిగో ఇదిగో అంటూ తాత్సారం చేసి, తారాట్లాడి రాహుల్ ‘పూర్తికాలపు’ బాధ్యతలు స్వీకరించి కూడా మూడేళ్లు కావస్తోంది. కానీ ఆయనింకా రాజకీయాలకు ‘బయటి వ్యక్తి’గానే ఉన్నారు. అస్సాం ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు ఆ రాష్ట్రంనుంచి వచ్చిన పార్టీ యువ నాయకుడు హిమంత్ శర్మకు ఎదురైన అనుభవమే ఇందుకు సాక్ష్యం. పార్టీ వ్యూహం గురించి తాను చెబుతున్న విషయాలను లక్ష్యపెట్టకుండా కుక్కపిల్లతో ఆటల్లో మునిగిన రాహుల్ తీరును చూసి విస్తుపోయిన ఆ నాయకుడు ఇక్కడినుంచి నిష్ర్కమించడం మంచిదని నిర్ణయించుకున్నాడు. కాంగ్రెస్ పార్టీకి నాయకుల కొరత లేదు. సీఎంలుగా, కేంద్రమంత్రులుగా, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పనిచేసినవారు ఆ పార్టీలో బోలెడుమంది ఉన్నారు. అందరితోనూ చర్చిస్తూ ఎవరి శక్తిసామర్థ్యాలేమిటో విశ్లేషించుకుని, ఎవరికి ఏ పని అప్పగించాలో నిర్ణయించుకుని కదిలిస్తే శ్రేణుల్లో కాస్తయినా ఉత్సాహం వస్తుంది. వారిలో ఆత్మ విశ్వాసం ఇనుమడిస్తుంది. ముఠాలుగా విడిపోయి కలహించు కుంటున్నవారిని దారికి తెస్తే పార్టీ ప్రతిష్ట కాస్తయినా నిలబడుతుంది. అందుకు భిన్నంగా వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే యూపీలో పార్టీని గట్టెక్కించే బాధ్యతను ఒక కన్సల్టెంటుకు అప్పగిస్తే, అందుకు కొంత ఫీజు చెల్లిస్తే అన్నీ అతగాడే చూసుకుంటాడని రాహుల్ భావించారు. మరి ఇన్ని వేలమంది నేతలంతా ఏం చేస్తారు? ఆయనను ఆకాశానికెత్తే పనిలో నిమగ్నమై ఉంటారు. పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నెత్తికెత్తుకున్నప్పుడు తాను మాట్లాడిందేమిటో గుర్తుండి ఉంటే కాంగ్రెస్‌ను రాహుల్ ఈ దుస్థితికి చేర్చేవారు కాదు. రాజకీయాల్లో వారసత్వ సిద్ధాంతానికి తాను వ్యతిరేకమని అప్పట్లో ఆయన చెప్పారు. పార్టీలన్నిటినీ కొంతమంది వ్యక్తులే శాసిస్తున్నారని, ఈ స్థితి మారాలని పిలుపునివ్వడంతోపాటు కాంగ్రెస్‌లో అలాంటి ధోరణుల్ని అంగీకరించబోనని చెప్పారు. తీరా ఈ మూడేళ్ల ఆచరణా గమనిస్తే వాటన్నిటినీ ఆయన యధాతథంగా కొనసాగిస్తున్నారని అర్ధమవుతుంది. అభ్యర్థుల ఎంపికలోనూ, పార్టీ పదవుల పంపకంలోనూ భజన పరులకే చోటిస్తున్నారని వెల్లడవుతుంది. తప్పులు చేసుకుంటూ పోవడం తప్ప వాటినుంచి నేర్చుకోవాలని, సరిదిద్దుకోవాలని రాహుల్ అనుకోవడం లేదు. బిహార్ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక బీజేపీ చురుగ్గా కదిలి తన లోపాల్ని సరిచేసుకోగలిగింది. తన వ్యూహాన్ని సవరించుకుంది. ఫలితంగా ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ దిశగా మరికొన్ని అడుగులు వేయగలిగింది. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ ఎన్నికలు వచ్చే ఏడాది...కర్ణాటక, మేఘాలయ, మిజోరాం ఎన్నికలు ఆ మరుసటి సంవత్సరం రాబోతున్న తరుణం లోనైనా ఇల్లు చక్కదిద్దుకోవాలని కాంగ్రెస్‌కు అనిపించకపోవడం ఆశ్చర్యకరం. ఇలాంటి స్థితిలో ఆ పార్టీకి ఓటమి తప్ప ఒరిగేదేముంటుంది? -
గెలిచిన, ఓడిన ప్రముఖులు వీరే...
న్యూఢిల్లీ : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న ప్రముఖుల్లో కొందరికి విజయం వరించగా, మరికొందరికి నిరాశ ఎదురైంది. తమిళనాడులో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి వ్యక్తిగతంగా విజయం సాధించినా, పార్టీ మాత్రం రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే సినీనటులు విజయ్‌కాంత్, శరత్ కుమార్ కూడా పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 75 సీట్లు వస్తాయని జోస్యం చెప్పిన క్రికెటర్ శ్రీశాంత్ ఓటమి పాలయ్యాడు. అలాగే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసిన రూపా గంగూలీ, క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా ని విజయం వరించింది. కాగా, వివరాల్లోకి వెళితే.. తమిళనాడు: గెలుపొందినవారు: జయలలిత కరుణానిధి స్టాలిన్ పన్నీర్ సెల్వం మాజీ డీజీపీ నటరాజ్ ........... ఓడినవారు అన్బుమణి రాందాస్ డీఎండీకే అధినేత విజయ్ కాంత్ శరత్ కుమార్ పశ్చిమ బెంగాల్లో గెలిచిన ప్రముఖులు మమతా బెనర్జీ సుర్జాకాంత్ మిశ్రా బైచింగ్ భుటియా అమిత్ మిశ్రా రుపా గంగూలీ కె.మణీ లక్ష్మీ రతన్ శుక్లా కేరళలో గెలిచిన ప్రముఖులు ఊమెన్ చాందీ అచ్యుతానందం విజయన్ రమేష్ చెన్నతాల ఓడినవారు క్రికెటర్ శ్రీశాంత్ స్పీకర్ శక్తన్ డిప్యూటీ స్పీకర్ పాలొడే రవి అసోంలో గెలిచిన ప్రముఖులు సరబానంద్ సోనోవాల్ తరుణ్ గొగోయ్ పుదుచ్చేరిలో గెలిచిన ప్రముఖులు రంగస్వామి -
పార్టీ పరాజయంపై కారణాలను విశ్లేషించుకుంటాం : సోనియా
న్యూఢిల్లీ: అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై విశ్లేషణ చేసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. ఓటమిపాలైనా ప్రజల సేవకు కట్టుబడి ఉంటామని అన్నారు. ఎన్నికల విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల విశ్వాసం చూరగొనేవరకు కష్టపడతాం : రాహుల్ ప్రజల నమ్మకం, విశ్వాసం చూరగొనేవరకు కాంగ్రెస్ కష్టపడి పనిచేస్తుందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి సమష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఓటమిలో రాహుల్ బాధ్యతలేదు : కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో ఓటమికి రాహుల్ గాంధీని బాధ్యుడిని చేయాలన్న ప్రస్తావనలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. ఒక్కో ఎన్నిక ఫలితాలు ఒక్కో రకంగా ఉంటాయని, వ్యక్తిగతంగా ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఈ ఎన్నిల్లో ప్రజల తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామని అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీలో ప్రియాంకకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందా అన్న ప్రశ్నకు ఇప్పుడు అది అప్రస్తుతమని అన్నారు. -
అస్సాం గడ్డపై బీజేపీ బోణీ
♦ మూడింట రెండొంతుల మెజారిటీ ♦ 5 నుంచి 60 సీట్లకు ఎదిగిన బీజేపీ ♦ గొగోయ్‌కు అస్సాం బైబై.. ♦ కింగ్‌మేకర్ అనుకున్న ఏఐయూడీఎఫ్ చీఫ్ ఓటమి గువాహతి: ఈశాన్యరాష్ట్రాల్లో పాగా వేయాలని చాలాకాలంగా చేస్తున్న ప్రయత్నంలో బీజేపీ విజయంసాధించింది. అస్సాంలో స్పష్టమైన మెజారిటీతో తొలిసారి బీజేపీ జెండా ఎగిరింది. గత ఎన్నికల్లో ఐదుసీట్లున్న అస్సాంలో.. ఏకంగా 60 సీట్లు గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలుపుకుని 86 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. 15 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీని దించేసి.. అధికారం చేజిక్కించుకుంది. బీజేపీతోపాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన అస్సాం గణపరిషత్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీవోపీఎఫ్) పార్టీలు కూడా సత్తాచాటాయి. మొత్తం 126 సీట్లున్న అస్సాం అసెంబ్లీలో తాజా ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 86 స్థానాలు గెలుపొందింది. ఇందులో బీజేపీ 60 స్థానాల్లో, ఏజీపీ 14 స్థానాల్లో, బీవోపీఎఫ్ 12 చోట్ల విజయం సాధించాయి. అటు కాంగ్రెస్ 26 స్థానాల్లో, ఏఐయూడీఎఫ్ 13 స్థానాల్లో గెలుపొందగా.. ఇతరులు ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్నికలకు ఏడాది ముందుగానే ప్రణాళికలు రూపొందించి వ్యూహాత్మకంగా ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. బీజేపీకి సోనో‘వాల్’ కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా అస్సాం బీజేపీకి ఉన్న నాయకత్వ లోపానికి సర్బానంద సోనోవాల్ పరిష్కారం చూపారు. అసోం గణపరిషత్తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సోనోవాల్ 2011లో బీజేపీలో చేరి గత లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. పార్టీ ముఖ్యనాయకులతో కలిసి ఈ ఎన్నికల్లో ప్రచారాన్ని ముందుండి నడిపించారు. ప్రజా సమస్యలను గుర్తించి, అభివృద్ధి గురించి వివరించి ప్రజలకు పార్టీపై నమ్మకం కలిగేలా వ్యూహాత్మకంగా ముందుకెళ్లారు. గొ‘గో’య్‌పై వ్యతిరేకత వరుసగా నాలుగోసారి అధికారం చేజిక్కించుకోవాలన్న కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ పార్టీ అభివృద్ధి కన్నా తన కుమారుడిని ప్రమోట్ చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపటం..ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత కాంగ్రెస్‌ను ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టాయి. దీనికి తోడు రాష్ట్రంలో అవినీతి పెరిగిపోవటం, బంగ్లా చొరబాట్లు, అభివృద్ధి కుంటుపడటం, నిరుద్యోగం పెరిగిపోవటం వంటి అంశాల కారణంగా ప్రజలు గొగోయ్‌కు బైబై చెప్పారు. ఎన్డీఏ పక్షాల దెబ్బతో కాంగ్రెస్ మంత్రులు కొందరికి ఓటమి తప్పలేదు. మంత్రులు గౌతమ్ రాయ్, ఎతువా ముండా, సిద్దిఖీ అహ్మద్, బిస్మితా గొగోయ్ తదితరులు దారుణంగా ఓడిపోయారు. అస్సాం ప్రభుత్వ ఏర్పాటులో కింగ్‌మేకర్ అవుతుందనుకున్న ఏఐయూడీఎఫ్ 13 స్థానాల్లో గెలుపొందగా.. ఆ పార్టీ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. బీజేపీ విజయంలో ‘తెలుగు’ కృషి అస్సాంలో బీజేపీ విజయం సాధించటం వెనక తెలుగోడి సత్తా ప్రధాన పాత్ర పోషించింది. పార్టీ అస్సాం వ్యవహారాలు చూస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, బీజేపీ నేత, నెహ్రూ యువకేంద్ర వైస్ చైర్మన్ పేరాల చంద్రశేఖర్లిద్దరూ తెలుగువారే. పరివార్ సంస్థలకు పూర్తి సమయం కార్యకర్తలు (ఫుల్‌టైమర్లు)గా ఉన్నప్పటినుంచే వీరితోపాటు పలువురు తెలుగు ప్రచారక్‌లు అస్సాంలో ఆరెస్సెస్, బీజేపీ ఆలోచన విస్తృతికి తీవ్రంగా కృషి చేశారు. దీనికి తోడు ఎన్నకలకు ఏడాది ముందునుంచే చేస్తున్న వ్యూహరచనలోనూ వీరిద్దరు క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే.. రెండున్నర దశాబ్దాలుగా ఇక్కడ పాగా వేసేందుకు ఆరెస్సెస్ చాలా పనిచేస్తోంది. చొరబాట్లను ప్రధాన అంశంగా మార్చుకుని ప్రజల్లో చైతన్యం తెచ్చింది. ఇందుకోసం అస్సాంలో పనిచేసిన ఆరెస్సెస్ ఫుల్టైమర్లలో చాలా మంది తెలుగువారున్నారు. విద్యార్థి నేతగా వచ్చి.. అస్సాంలో తొలిసారిగా బీజేపీకి విజయాన్ని సాధించి పెట్టిన సోనోవాల్ బీజేపీకి పెద్దగా పట్టులేని ఈశాన్య రాష్ట్రాల్లో తొలిసారిగా ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న వ్యూహాత్మక నేత సర్బానంద్ సోనోవాల్. అస్సాం గణ పరిషత్ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సోనోవాల్.. ఐదేళ్ల కింద బీజేపీలో చేరి అనతి కాలంలోనే కేంద్ర మంత్రి అయ్యారు. కేంద్ర మంత్రిగా ఉంటూనే ఇప్పుడు అస్సాం శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగి ఆ పార్టీకి తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టారు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్‌యూ)తో సోనోవాల్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఏఏఎస్‌యూకు 1992 నుంచి 1999 దాకా ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించారు. దాదాపు ఇదే సమయంలో 1996 నుంచి 2000వ సంవత్సరం దాకా నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2001లో అసోం గణ పరిషత్‌లో చేరి మొరాన్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. వివాదాస్పద అక్రమ వలసదారుల చట్టంపై పోరాటం చేపట్టి.. ప్రజల్లో పేరు పొందారు. అనంతరం ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది కూడా. 2004లో కాంగ్రెస్ కంచుకోటగా భావించే డిబ్రూగఢ్ లోక్‌సభ స్థానం నుంచి సోనోవాల్ ఎంపీగా విజయం సాధించారు. 2011లో పార్టీ నాయకత్వంతో విభేదాలు వచ్చి బీజేపీలో చేరారు. తర్వాతి ఏడాదే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అస్సాంలో బీజేపీకి ఏడు సీట్లను సాధించి పెట్టారు. అక్కడ కాంగ్రెస్ కంచుకోటలుగా భావించే నియోజకవర్గాల్లో కూడా బీజేపీ గెలుపొందడంతో ప్రధాని మోదీకి సోనోవాల్ దగ్గరయ్యారు. కచారి గిరిజన తెగకు చెందిన ఆయన 1962, అక్టోబర్ 31న డిబ్రూగఢ్ జిల్లా మొలొక్గావ్లో జన్మించారు. జిబేశ్వర్, దినేశ్వరి ఆయన తల్లిదండ్రులు. బ్రహ్మచారి అయిన సోనోవాల్.. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు. బీజేపీ ‘పంచ’తంత్రం సీఎం అభ్యర్థిగా సోనోవాల్ పేరు ప్రకటన: కేంద్ర ప్రభుత్వంలో క్రీడలు, యువజన వవ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్న సర్బానంద్ సోనోవాల్‌ను బీజేపీ తన సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. స్థానికుడు, ప్రజాసమస్యలపై అవగాహనతోపాటు రాష్ట్ర యువతలో మంచిపేరున్న సోనోవాల్‌ను రంగంలోకి దించటం బీజేపీకి కలిసొచ్చింది. ఏజీపీ, బీవోపీఎఫ్లతో పొత్తు: అస్సాంలోని కోక్రాఝార్, పక్కనున్న జిలాల్లో బలంగా ఉన్న బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీవోపీఎఫ్)తో పొత్తు విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీని మూలంగానే ఈ ప్రాంతాల్లో బీజేపీ దాదాపు సీట్లన్నీ గెలుచుకుంది. అటు అస్సాం గణపరిషత్తో 2009 పార్లమెంటు ఎన్నికలనుంచీ బీజేపీకి పొత్తు కొనసాగుతోంది. చొరబాట్లు ఆపటం.. అభివృద్ధిపై దృష్టి: ఎన్నికలకు ఏడాది ముందే బీజేపీ ప్రణాళికలు రూపొందించింది. స్థానిక సమస్యలు తెలుసుకోవటంతో పాటు అభివృద్ధి మంత్రాన్ని ప్రజలకు అర్థమయ్యేలా కార్యకర్తలు వివరించాలనేది బీజేపీ వ్యూహం. దీనికి తోడు బంగ్లాదేశ్ సరిహద్దు గుండా చొరబాట్లు పెరగటం, కాంగ్రెస్‌కు మిత్రుడైన ఏఐడీయూఎఫ్ ఈ చొరబాట్లను సమర్థించటం అస్సాం ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారింది. దీనిపై మిగిలిన జనాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. అయితే, ఈ చొరబాట్లకు బ్రేక్ వేస్తామని హామీ ఇవ్వటం అస్సాం ప్రజలకు భరోసాఇచ్చింది. మోదీ హవా: 2014 ఎన్నికల తర్వాత దేశంలో పెరుగుతున్న మోదీ హవా కూడా అస్సాం ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో 14 స్థానాల్లో ఏడింటిని గెలుచుకున్న బీజేపీ.. మోదీ సర్కారు చేస్తున్న పనులు.. సమీప భవిష్యత్తులో రానున్న మార్పులపై ప్రచారం చేసింది. దీనికి తోడు మోదీ సుడిగాలి పర్యటనలు కూడా కలిసొచ్చాయి. గిరిజన హోదా, విద్యాసంస్థల ఏర్పాటు,యువతకు ఉపాధి: అస్సాంలో కొండల్లో నివసించే బోడోలకు, మైదాన ప్రాంతాల్లో ఉండే కర్బీ తెగ వారికి గిరిజన హోదా ఇస్తామని మోదీ ప్రకటించారు. వెంటనే దీనికి సంబంధించిన పనిని కూడా ప్రారంభించారు. ఢిల్లీ పోలీసు శాఖలో ఈశాన్య రాష్ట్రాల యువతకు ఉద్యోగాలుంటాయని ప్రకటించిన ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీచేశారు. కోక్రాఝార్లోని కేంద్రీయ సాంకేతిక సంస్థకు డీమ్డ్వర్సిటీ హోదా ఇస్తానని ప్రధాని ప్రకటించారు. సీల్దా-గౌహతి-కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్ రైలును బారక్ లోయ వరకు పొడగిస్తామని తెలిపారు. ఇవన్నీ బీజేపీకి అదనంగా కలిసొచ్చిన అంశాలు. అస్సాంలో గెలిచిన ప్రముఖులు సర్బానంద్ సోనోవాల్ (బీజేపీ) తరుణ్ గొగోయ్ (కాంగ్రెస్) హిమంత్ బిస్వా శర్మ (బీజేపీ) అతుల్ బోరా (ఏజీపీ) కృపానాథ్ మల్లా (బీజేపీ) ప్రఫుల్ల కుమార్ మహంత (ఏజీపీ) ఓడిన ప్రముఖులు పవన్‌సింగ్ (మాజీకేంద్ర మంత్రి-కాంగ్రెస్) బద్రుద్దీన్ అజ్మల్ (ఏఐయూడీఎఫ్ చీఫ్) రాహుల్ అవమానించారు.. బీజేపీ ఆహ్వానించింది న్యూఢిల్లీ: అస్సాంలో బీజేపీ విజయంలో ఆ పార్టీ ఎన్నికల కమిటీ కన్వీనర్ హిమంత్ బిస్వా శర్మ పాత్ర కీలకం. 2011 వరకు కాంగ్రెస్, తరుణ్ గొగోయ్ విజయాల్లో కీలక వ్యూహకర్తగా, యువనాయకుడిగా పేరున్న హిమంత్ శర్మ.. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రవర్తన కారణంగా పార్టీనుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. ఇది కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఓ కారణమైంది. అసలేం జరిగింది?: 2015లోనే అస్సాం ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు హిమంత్ శర్మ.. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను కలిశారు. పార్టీకి గడ్డుకాలం ఉందని.. అయితే కొన్ని వ్యూహాలతో ముందుకెళ్తే నాలుగోసారీ అధికారంలోకి రావొచ్చని శర్మ సూచిం చారు. అయితే శర్మ మాట్లాడుతుండగానే.. రాహుల్ కుక్కపిల్లతో ఆడుకుంటూ చర్చను పట్టించుకోలేదు. సీరియస్ చర్చ జరుగుతుండగా తనను పట్టించుకోకుండా కుక్కపిల్లపైనే రాహుల్ శ్రద్ధ చూపించటం శర్మకు కోపం తెప్పించింది. దీనికితోడు దేశ రాజకీయాల్లో సానుకూల మార్పు గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో ఆకర్షితులైన హిమంత్ శర్మ 2015 లో బీజేపీ కండువా కప్పుకున్నారు. అప్పటినుంచి కాంగ్రెస్‌ను, రాహుల్‌ను ఓడించటమే లక్ష్యంగా తన వ్యూహాలను బీజేపీ విజయానికి వినియోగించారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు ♦ అస్సాంలో విజయమే దీనికి నిదర్శనం: ప్రధాని మోదీ న్యూఢిల్లీ: బీజేపీ సిద్ధాంతాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల మద్దతు, ఆమోదం లభిస్తోందనడానికి అస్సాంలో తమ పార్టీ విజయమే నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అస్సాంలో పార్టీ విజయంపై ఆయన ఆనందం వ్యక్తంచేశారు. పేదల అభ్యున్నతికోసం మరింత కష్టపడి పనిచేయడానికి ఈ విజయం స్ఫూర్తినిస్తుందన్నారు. ఈశాన్యంలో తమ పార్టీకి ఇది తొలి విజయమన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజల మద్దతు లభిస్తోందన్న అంశాన్ని ఈ విషయం స్పష్టంచేస్తోందన్నారు. గురువారం ఆయన పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలతో కొద్దిసేపు మాట్లాడారు. కశ్మీర్లో లభించిన విజయంతో అస్సాంలో గెలుపును పోలుస్తూ, ఆది అనేకమందిని విస్మయానికి గురిచేసిందని వ్యాఖ్యానించారు. తమకు విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు, బీజేపీకి, ఎన్డీయేకు ప్రోత్సాహకరంగా ఉన్నాయన్నారు. పేద ప్రజల జీవితాల్లో మార్పుతేవాల్సిన అవసరం ఉందని ఆయన కార్యకర్తలకు సూచించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆయన బృందానికి, అయిదు రాష్ట్రాల్లో పార్టీ శాఖలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. విజేతలకు అభినందనలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత, తృణమూల్ నాయకురాలు మమతా బెనర్జీ, అస్సాంలో బీజేపీ సీఎం అభ్యర్థి సరబానంద సోనోవాల్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. కేరళలో విజయం సాధించినందుకు సీపీఎం నేత అచ్యుతానందన్‌కు కూడా అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పును స్వాగతిస్తున్నాం. కేరళ అభివృద్ధికి ఎల్డీఎఫ్ రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలు ఆదరించారు. బెంగాల్లో మా పార్టీ వైఫల్యంపై విశ్లేషించుకుంటాం. - సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి బెంగాల్లో కాంగ్రెస్‌తో పొత్తు బెడిసికొట్టింది లెఫ్ట్ కూటమికి పెద్ద దెబ్బ. కారణాలపై లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. కేరళలో విజయం అంచనాలకు మించింది. -సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం మోదీకి చంద్రబాబు అభినందనలు సాక్షి, విజయవాడ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. అస్సాంలో అధికారాన్ని దక్కించుకుని ఇతర రాష్ట్రాల్లో ఓట్లశాతాన్ని పెంచుకుని ఫలితాలు సాధించినందుకు ప్రధానిమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు అభినందనలు తెలిపారు. మోదీ పాలనపై ప్రజలిచ్చిన తీర్పు : అమిత్ సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండేళ్ల పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి గతంలో పెద్దగా బలం లేదని, ఈ ఎన్నికలతో బలమైన పునాది పడిందని వివరించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిననాడే మిషన్ 7 స్టేట్స్‌గా తాను చెప్పినట్టు గుర్తుచేశారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బలోపేతంపై దృష్టిపెట్టినట్టు తెలిపారు. దేశంలో మార్పుకు నాంది : రాం మాధవ్ గువాహటి: అస్సాంలో బీజేపీ విజయం దేశవ్యాప్తంగా మార్పుకు నాంది పలికిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ తెలిపారు. కొంతకాలంగా అస్సాం ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొందన్నారు. సరైన సమయంలో అస్సాం విజయం బీజేపీకి కలిసొచ్చే అంశమన్న రాం మాధవ్.. తమ పార్టీ ఇచ్చిన కాంగ్రెస్ ముక్త భారత్ నినాదానికి దేశవ్యాప్తంగా స్పందన కనిపిస్తోందన్నారు. 2014 ఎన్నికల్లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొనటంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. మమత, జయలకు వైఎస్ జగన్ అభినందనలు ♦ అస్సాంలో విజయంపై ప్రధాని మోదీకి శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్లో రెండోసారి ప్రజాభిమానాన్ని చూరగొని తిరుగులేని విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి, తమిళనాడులో రికార్డు సృష్టించిన ఏఐఏడీఎంకే చీఫ్ జయలలితకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగ న్మోహన్రెడ్డి గురువారం అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘మమతా దీదీ...మీ తిరుగులేని విజయానికి అభినంద నలు’, ‘పురచ్చితలైవీ.. మీ ఘనవిజయానికి శుభాకాంక్షలు..’ అని జగన్ వేర్వేరుగా ట్వీట్ చేశారు. కేరళలో విజయం సాధించిన ఎల్డీఎఫ్కు అభినందనలు తెలిపారు, ‘అస్సాంలో బీజేపీని భారీ గెలుపు సాధించే దిశగా సారథ్యం వహించిన ప్రధాని మోదీకి అభినందనలు’ అని జగన్ మరో ట్వీట్ చేశారు. -
'అమ్మ'దే జయం
తమిళనాడులో జయలలితకు వరుసగా రెండో విజయం ♦ గట్టి పోటీ ఇచ్చిన డీఎంకే.. సభలో పెరిగిన బలం.. విజయ్‌కాంత్, శరత్‌కుమార్‌ల ఘోర పరాజయం ♦ ఖాతా తెరవని కమలదళం.. నేడు శాసనసభాపక్షం భేటీ.. 23న జయ ప్రమాణం సాక్షి ప్రతినిధి, చెన్నై: మూడు దశాబ్దాల పాటు కొనసాగిన ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారిపోయే సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలను అధిగమిస్తూ.. బలమైన ప్రతిపక్ష కూటమితో పాటు.. మూడో కూటమితోనూ ఒంటరిగా తలపడుతూ.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత వరుసగా రెండోసారి విజయఢంకా మోగించారు. దాదాపు ముప్పై ఏళ్ల నాడు ఎం.జి.రామచంద్రన్‌ను వరుసగా రెండోసారి ఎన్నుకున్న తర్వాత ఇప్పటివరకూ ఎవరికీ అటువంటి అవకాశం ఇవ్వని తమిళనాడు ప్రజలు ‘అమ్మ’కు ఆ అరుదైన అవకాశమిచ్చి మళ్లీ అందలమెక్కించారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 232 అసెంబ్లీ స్థానాలకు గాను 134 సీట్లు గెలుచుకున్న అన్నా డీఎంకే శాసనసభాపక్షం శుక్రవారం సాయంత్రం సమావేశమై జయలలితను తమ నాయకురాలిగా ఎన్నుకోనుంది. ఆమె ఈ నెల 23వ తేదీన ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. జయ - కరుణల మధ్యే పోరు! రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను.. 232 స్థానాలకు ఈ నెల 16న పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. అన్నా డీఎంకే ఒంటరిగా, డీఎంకే - కాంగ్రెస్ ఒక కూటమిగా, డీఎండీకే, పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్, టీఎంసీల కూటమి ఒకవైపు.. బీజేపీ దాని చిన్న మిత్రపక్షాల కూటమి మరొకవైపు ఇలా బహుముఖ పోటీగా కనిపించినప్పటికీ.. ఎన్నికల్లో రాష్ట్రంలో బద్ధశత్రువులైన ప్రధాన ద్రవిడ పార్టీలు అన్నా డీఎంకే - డీఎంకేల మధ్యే వాస్తవపోరు సాగినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 40 పార్లమెంటు స్థానాల్లో 39 గెలుచుకుని తమిళనాట తనకు తిరుగులేదని చాటిన జయలలిత ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన హవాను కొనసాగించారు. 134 స్థానాలు గెలుచుకుని సాధారణ మెజారిటీ సాధించారు. అయితే.. డీఎంకే, కాంగ్రెస్‌ల కూటమి ఆమెకు గట్టి పోటీ ఇస్తూ 98 సీట్లు గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. డీఎంకే అధినేత కరుణానిధి తిరువారూరు నుంచి, ఆయన కుమారుడు ఎం.కె.స్టాలిన్ కొళత్తూరు నుంచి గెలుపొందారు. ప్రజాసంక్షేమ కూటమి, పీఎంకే, బీజేపీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు. డీఎండీకే, పీడబ్ల్యూఫ్, టీఎంసీల కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి విజయ్‌కాంత్ పోటీచేసిన ఉలుండూరుపేటలో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పీఎంకే అధినేత అన్బుమణి రామదాస్ పెన్నాగరం స్థానంలో రెండో స్థానంలో నిలిచారు. సీనియర్ నటుడు శరత్‌కుమార్ సహా పలువురు సినీ ప్రముఖులు పరాజయం పాలయ్యారు. విపక్షాల తిట్లే దీవెనలుగా... ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పుతో జైలుకు వెళ్లడం.. చెన్నైని ముంచెత్తిన వరదలను ఎదుర్కొనటంలోనూ వరద బాధితులను ఆదుకోవడంలోనూ వైఫల్యాల విమర్శలు.. టాస్మాక్‌ల ద్వారా ప్రభుత్వమే మద్యం అమ్మకాలు సాగించటంపై ఎత్తిపొడుపులు.. జయ ప్రచార సభల్లో ఐదుగురు మృతి చెందడం.. అన్నా డీఎంకే శ్రేణుల నుంచే భారీ ఎత్తున నగదు స్వాధీనం కావడం వంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ.. జనం ‘అమ్మ’కు జేజేలు పలికారు. అన్నా డీఎంకే ఒక వైపు.. ఇతర పార్టీలన్నీ ఒకవైపులా సాగిన ఈ ఎన్నికల్లో విపక్ష నేతలంతా కట్టకట్టుకుని జయను దూషిం చడం ప్రజలు సహించలేకపోయారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. డీఎంకే చెప్తున్నట్లుగా మద్యనిషేధం అమలు చేయడం వెంటనే సాధ్యం కాదని జయలలిత నిజాయితీగా చెప్పడాన్ని ప్రజలు హర్షించారు. 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది డీఎంకే, కాంగ్రెస్ కూటమి అని.. వారిని నమ్ముతారా అనే ప్రశ్నలతో జయ ఎదురుదాడి చేశారు. డీఎంకే వస్తే అమ్మ క్యాంటీన్లు తదితర అమ్మ పథకాలు మూతపడతాయన్న ఆందోళన కూడా జయలలితకు కలిసి వచ్చింది. అన్నాడీఎంకేకు 40.8% ఓట్లు గత అసెంబ్లీ ఎన్నికలకన్నా ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే గెలిచిన సీట్లు కొంచెం తగ్గినప్పటికీ ఆ పార్టీకి పోలైన ఓట్ల శాతం స్వల్పంగా పెరిగింది. జయ పార్టీకి గత ఎన్నికల్లో 39.08 శాతం ఓట్లు రాగా.. ఈ ఎన్నికల్లో 40.8 శాతం ఓట్లు పోలయ్యాయి. 2011లో డీఎండీకేతో కలిసి పోటీ చేసిన అన్నా డీఎంకే కేవలం 165 సీట్లలో పోటీ చేసి 150 సీట్లు గెలుచుకుంది. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే ఓట్ల శాతం కూడా గతం కన్నా గణనీయంగా పెరిగింది. గత ఎన్నికల్లో కేవలం 22.38 శాతం ఓట్లు పొంది 23 సీట్లకు పరిమితమైన కరుణ పార్టీ.. ఇప్పుడు 31.6 శాతం ఓట్లు సంపాదించి 89 సీట్లలో గెలిచింది. ఇక 2011 ఎన్నికల్లో 2.24 ఓట్లు పొందిన బీజేపీకి ఈసారి 2.8 శాతం ఓట్లు లభించాయి కానీ సీటు మాత్రం దక్కలేదు. నాడు ఎంజీఆర్.. నేడు జయలలిత... తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన రికార్డు నిన్నటి వరకు ఎం.జి.రామచంద్రన్‌ది మాత్రమే. 1977, 1980, 1985 లలో జరిగిన ఎన్నికల్లో ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత ప్రస్తుత ఎన్నికల్లో తన రాజకీయ గురువు బాటలో రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించి జయలలిత రికార్డు నెలకొల్పారు. రాష్ట్రంలో అత్యధికంగా ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కరుణానిధి రికార్డును జయ ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ద్వారా చేరిపేయనున్నారు. అలాగే సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేసినప్పుడల్లా జయ ప్రభుత్వాన్ని చేజార్చుకున్నారనే గతంలోని సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి నేడు అధికారంలోకి వచ్చారు. 13వసారి అసెంబ్లీకి కరుణ చెన్నై: డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి తిరువూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అన్నాడీఎంకే అభ్యర్థిని 68, 366 ఓట్ల తేడాతో ఓడించారు.91 ఏళ్ల కరుణానిధి తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికవడం ఇది 13వసారి. 1957లో ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితంలో ఓటమన్నది ఎరుగకపోవడం విశేషం. నోటాకు అంతంత మాత్రమే న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ‘నోటా’కు నామమాత్రంగానే ఓట్లు పడ్డాయి. పోలింగ్ శాతంవారీగా చూస్తే ‘పై అభ్యర్థుల్లో ఎవరూ కాదు’(నోటా)కు పుదుచ్చేరిలో అత్యధికంగా 1.7 శాతం మంది (13,240 మంది) ఓటేశారు. పశ్చిమబెంగాల్లో 1.5% మంది(8,31,836), తమిళనాడులో 1.3%(5,57,888), అస్సాంలో 1.1%(1,88,978), కేరళలో 0.5%(1,07,106) మంది నోటా బటన్ నొక్కారు. ఎవరికీ అందుబాటులో ఉండరనే అపప్రథ.. చెన్నై వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారంటూ విపక్షాల ప్రచారం.. డీఎంకే-కాంగ్రెస్‌లతో పాటు తృతీయ కూటమి నుంచి తీవ్ర పోటీ మధ్య ‘పురచ్చి తలైవి’ జయలలిత తన పట్టు నిలుపుకున్నారు. ఒంటిచేత్తో వరుసగా రెండోసారి అన్నాడీఎంకేను అధికారంలోకి తీసుకొచ్చి చరిత్ర తిరగరాశారు. ఎంజీఆర్ అడుగుజాడల్లో... జయలలిత 1948 ఫిబ్రవరి 24న మైసూరు రాష్ర్టంలో తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1956లో వెన్నిరాడై చిత్రంతో తమిళ సినీ రంగంలోకి ప్రవేశించారు. అనంతరం అన్నాడీఎంకేలో చేరి 1984లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1989లో అసెంబ్లీకి ఎన్నిక 1987లో ఎంజీఆర్ మరణం తర్వాత అన్నాడీఎంకే చీలిక వర్గానికి సారథ్యం వహించారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సారథ్యంలోని అన్నాడీఎంకే 27 స్థానాలు గెలుపొందడంతో తమిళనాట తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా జయ చరిత్ర సృష్టించారు. 1989 మార్చి 25న అసెంబ్లీలో తనపై దాడిని తీవ్రంగా పరిగణించిన జయ.. సీఎం అయ్యే వరకు అసెంబ్లీలోకి అడుగుపెట్టనంటూ శపథం చేశారు. 1991 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం పీఠం ఎక్కారు. 1996లో అధికారం కోల్పోయినా.. 2001 ఎన్నికల్లో విజయదుందుభి మోగించారు. 2006లో పార్టీ ఓటమిపాలవగా 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను తిరిగి విజయపథాన నిలిపారు. వెంటాడిన వివాదాలు... జయ పబ్లికేషన్, శశి ఎంటర్‌ప్రైజెస్‌లో పెట్టుబడులతో పాటు జయ, ఆమె సన్నిహితురాలు శశికళ 1992లో తమిళనాడు స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (టాన్సీ) నుంచి చౌకగా స్థలాన్ని కొనుగోలు చేయడం దుమారం రేపింది. దీనిపై డీఎంకే కేసు పెట్టగా 2000వ సంవత్సరంలో దిగువ కోర్టు జయ, శశికళలకు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో 2001 అసెంబ్లీ ఎన్నికల్లో జయపై అనర్హత వేటు పడింది. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలిచాక జయ సీఎంగా ప్రమాణం చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది. 2001 డిసెంబర్లో జయ, శశికళలను మద్రాస్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడంతో జయ సీఎం పగ్గాలు చేపట్టారు. ఈ తీర్పు డీఎంకే కుటుంబ పాలనకు శాశ్వత ముగింపు: జయలలిత తమిళనాడు ప్రజలు తనను ఘనంగా గెలిపించటం ఎంతో సంతోషాన్నిస్తోందని.. ఈ చరిత్రాత్మక విజయం అందించినందుకు తాను, తన పార్టీ ప్రజలకు రుణపడి ఉంటామని ముఖ్యమంత్రి జయలలిత పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆమె ఉత్సాహంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఫలితాలు డీఎంకే కుటుంబ పరిపాలనకు శాశ్వత ముగింపు పలికాయని వ్యాఖ్యానించారు. తాను నూతనోత్తేజంతో ప్రజలకు సేవ చేస్తానని, పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేయటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
పుదుచ్చేరి ‘హస్త’గతం...
♦ 17 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్-డీఎంకే కూటమి ♦ 8 సీట్లతో సరిపెట్టుకున్న రంగసామి ఏఐఎన్ఆర్సీ ♦ 4 సెగ్మెంట్లలో అన్నాడీఎంకే, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపు పుదుచ్చేరి: కేరళ, అసోంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఓదార్పు విజయం లభించింది. 30 మంది సభ్యులున్న పుదుచ్చేరి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే కూటమి సాధారణ మెజారిటీని సాధించి అధికార పీఠం దక్కించుకుంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎన్ఆర్సీ వ్యవస్థాపకుడు ఎన్. రంగసామి చేతిలో ఎదురైన పరాభవానికి ఇప్పుడు హస్తం పార్టీ ప్రతీకారం తీర్చుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టిన రంగసామి అధికార పీఠం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం రంగసామి పార్టీ ఎనిమిది సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం 30 సీట్లకుగానూ 21 సీట్లతో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 15 చోట్ల విజయం సాధించింది. ఇక డీఎంకే రెండు సెగ్మెంట్లలో గెలుపొందింది. పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్, ఏఐఎన్ఆర్సీ మధ్య హోరాహోరీ పోరు కనిపించింది. అయితే రానురానూ పరిస్థితి కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా మారిపోయింది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన అన్నాడీఎంకే నాలుగు సీట్లు గెలుపొందింది. గెలిచిన ప్రముఖుల్లో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వి. వైతిలింగం(కామరాజ్‌నగర్), పీసీసీ అధ్యక్షుడు ఎ.నమశ్శివాయ(విల్లియనూర్) ఉన్నారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత ఇ.వల్సరాజ్ మహి నియోజకవర్గంలో స్వతంత్య్ర అభ్యర్థి వి.రామచంద్రన్ చేతిలో ఓటమిపాలయ్యారు. కరైకల్ సౌత్ నియోజకవర్గంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన డీఎంకే నాయకుడు ఏఎంహెచ్ నజీమ్ అన్నాడీఎంకే అభ్యర్థి కేఏయూ అసనా చేతిలో కేవలం 20 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా, బీజేపీతో పాటు పీడబ్ల్యూఏ, డీఎండీకే, ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, ఆర్ఎస్పీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి. రేసులో నమశ్శివాయ, వైతిలింగం కాంగ్రెస్-డీఎంకే కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించడంతో సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. నమశ్శివాయ, వైతిలింగం సీఎం పీఠం రేసులో ముందున్నారు. వీఎంసీ ఫ్యామిలీ ఆధిపత్యానికి తెర నెరవి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్నాడీఎంకేకు చెందిన వీఎంసీ శివకుమార్ కుటుంబం అధిపత్యానికి తెరపడింది. ఈ నియోజకవర్గంలో 1977 నుంచి జరిగిన తొమ్మిది ఎన్నికల్లో శివకుమార్ కుటుంబ సభ్యులే గెలుపొందుతూ వస్తున్నారు. అయితే తాజా ఎన్నికల్లో మాత్రం డీఎంకే అభ్యర్థి గీతా ఆనందన్ శివకుమార్ కుటుంబ ఆధిపత్యానికి చెక్ పెట్టారు. ఆమె 6,936 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత నెలలో గీత నామినేషన్ దాఖలు చేసిన రోజే ఆమె భర్త ఆనందన్ కన్నూమూశారు. 20 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి మహిళలు 20 ఏళ్ల తరువాత పుదుచ్చేరి అసెంబ్లీలో మహిళలు అడుగుపెట్టబోతున్నారు. గురువారం వెలువడిన ఫలితాల్లో న లుగురు మహిళలు గెలుపొందారు. వి.విజయవాణి( కాంగ్రెస్), గీత(డీఎంకే), బి.కోబిక(ఎఐఎన్ఆర్సీ),చంద్రప్రియాంక(ఎఎన్ఐఆర్సీ)లు గెలుపొందిన 30 మంది సభ్యుల్లో ఉన్నారు. 1996లో ఎస్.అరసి(ఏఐఏడీఎంకే) తరువాత మరే మహిళా ఎన్నికవలేదు. యూనాం ఎమ్మెల్యేగా మల్లాడి విజయం ♦ వరుసగా ఐదోసారి గెలుపు తాళ్లరేవు : పుదుచ్చేరి పరిధిలోని యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మల్లాడి కృష్ణారావు గెలిచారు. యూనాం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం ఇది వరుసగా ఐదోసారి. పుదుచ్చేరి ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి ఆధిక్యం దక్కడంతోమల్లాడి మరోసారి మంత్రి పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మల్లాడికి 20,801 ఓట్లు, ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి, రిటైర్డ్ ఎస్పీ తిరుకోటి భైరవస్వామికి 12,047 ఓట్లు వచ్చాయి. -
ఐదుగురు సీఎంలు సేఫ్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు గెలుపొందారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు తాము పోటీ చేసిన నియోజకవర్గాల్లో విజయం సాధించారు. తమిళనాడు సీఎం జయలలిత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రమే అధికారం నిలబెట్టుకున్నారు. కేరళ సీఎం ఊమెన్ చాంది, అస్సాం సీఎం తరుణ్ గొగొయ్, పుదుచ్చేసి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి అధికారం కోల్పోయారు. జయలలిత చెన్నైలోని రాధాకృష్ణా నగర్ నుంచి ఘన విజయం సాధించారు. భవానిపూర్ నుంచి బరిలోకి నిలిచిన మమతా బెనర్జీ విజయ కేతనం ఎగురవేశారు. ఇందిరా నగర్ నుంచి పోటీ చేసిన సీఎం రంగసామి 3,404 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సీఎం ఊమెన్ చాంది.. కొట్టయం జిల్లా పుతుపల్లిలో 27,092 ఓట్లతో గెలిచారు. టీటబర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తరుణ్ గొగొయ్ వరుసగా నాలుగోసారి గెలుపొందారు. తన సమీప బీజేపీ అభ్యర్థి కామఖ్య ప్రసాద్ తాసాపై 17,495 ఓట్లతో విజయం సాధించారు. మాజీ సీఎంలు కరుణానిధి, పన్నీరు సెల్వం, వీఎస్ అచ్యుతానందన్ కూడా తమ సీట్లను నిలబెట్టుకున్నారు. -
ఈశాన్యంలో కాషాయ రెపరెపలు
గువాహటి: ఈశాన్య భారతాన కమలం వికసించింది. అసోంలో ఏనాడూ ప్రతిపక్ష హోదా కూడా లేని బీజేపీ ఎట్టకేలకు అధికారం చేజిక్కించుకుంది. ఏజీపీతో కలిసి పోటీ చేసిన కాషాయ పార్టీ ప్రస్తుత సీఎం తరుణ్ గొగొయ్ ను సాగనంపింది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. నాలుగోసారి తమదే అధికారమని ప్రకటించిన గొగొయ్ చివరికి ఓటమని అంగీకరించారు. గత ఐదేళ్లుగా చేపట్టిన నిర్విరామ ప్రచారం, ముందస్తు సీఎం అభ్యర్థి ప్రకటన, పదిహేనేళ్లుగా పాలించిన కాంగ్రెస్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత బీజేపీ ఘన విజయానికి దోహదం చేశాయి. గురువారం వెల్లడైన అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి అద్భుత విజయం సొంతం చేసుకుంది. 86 సీట్లు కైవసం చేసుకుని అతిపెద్ద కూటమిగా అవతరించింది. ఈ సంకీర్ణంలోని బీజేపీ 60, ఏజీపీ 14, బీఓపీఎఫ్ 12 సీట్లలో విజయం సాధించాయి. కాంగ్రెస్ 26 సీట్లకు పరిమితమైంది. బబ్రుద్దీన్ అజ్మాల్ నాయకత్వంలోని ఏఐయూడీఎఫ్ 13 స్థానాలు దక్కించుకుంది. ఇతరులు ఒక స్థానంతో సరిపెట్టుకున్నారు. మెజారిటీ స్థానాలు గెల్చుకోవడంతో అస్సాంలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సోనోవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. -
కాంగ్రెసే మా కొంప ముంచింది
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా చతికిలపడింది. కేరళ, అసోం రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోనుంది. కేరళలో ఎల్డీఎఫ్, అసోంలో బీజేపీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నాయి. ఇక పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలలో కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అంతేగాక కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న పార్టీలు కూడా దెబ్బతిన్నాయి. అసోంలో తమ ఓటమికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ నిందించారు. ఘనవిజయం సాధించిన బీజేపీకి ఆయన అభినందనలు తెలిపారు. అసోంలో 15 ఏళ్లు వరుసగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకుంది. తమిళనాడులో డీఎంకేతో, పశ్చిమబెంగాల్లో కమ్యూనిస్టులతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేకపోయింది. -
క్రీడా, సినీ ప్రముఖులకు నిరాశ
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీచేసిన క్రీడాప్రముఖులకు నిరాశ ఎదురైంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున తొలిసారి పోటీ చేసిన టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ఓటమి చవిచూశాడు. తిరువనంతపురం నుంచి బరిలో దిగిన శ్రీశాంత్ చిత్తుగా ఓడిపోయాడు. ఇక పశ్చిమబెంగాల్లో సిలిగురి నియోజకవర్గం నుంచి తృణమాల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన భారత్ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా వెనుకబడ్డారు. ఎన్నికల ఫలితాలు పలువురు సినీ ప్రముఖులకు కూడా నిరాశ కలిగిస్తున్నాయి. పశ్చిమబెంగాల్లో ఉత్తర హౌరా నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన నటి రూపా గంగూలీ వెనుకబడింది. ఇక తమిళనాడులో డీఎండీకే చీఫ్, ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్ విజయ్‌కాంత్ మూడో స్థానంతో వెనుకంజలో ఉన్నాడు. -
చరిత్ర తిరగరాయబోతున్న అమ్మ
చెన్నై: జాతీయ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు లెక్కతప్పాయి. ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం మారింది. 'అమ్మ' చరిత్ర తిరగరాయబోతోంది. తమిళనాడులో అన్నాడీఎంకే చీఫ్ జయలలిత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టున్నారు. స్థానిక టీవీ చానళ్లు అంచనా వేసినట్టుగా అన్నాడీఎంకే మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. కొన్ని దశాబ్దాలుగా తమిళనాడులో అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఈ సారి జయలలిత ఈ సంప్రదాయాన్ని మార్చబోతున్నారు. అమ్మ వరుసగా రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాల ట్రెండ్ ప్రకారం తమిళనాడులో అన్నాడీఎంకే విజయం దాదాపు ఖాయం. 234 అసెంబ్లీ సీట్లు ఉన్న తమిళనాడులో ప్రస్తుతం అన్నాడీఎంకే 141 స్థానాల్లో ముందంజలో ఉంది. అధికారంలోకి వస్తుందని భావించిన డీఎంకే 86 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 5 చోట్ల ముందజంలో ఉన్నారు. కాగా రెండు స్థానాలకు ఎన్నికలు జరగలేదు. డీఎంకే చీఫ్ ఎన్ని వాగ్ధానాలు చేసిన ప్రజలు నమ్మలేదు. మళ్లీ అమ్మ వైపే మొగ్గుచూపారు. అమ్మ పేరుతో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు జయలలితకు లబ్ధిచేకూర్చాయి. ముఖ్యమంత్రి పదవి అభ్యర్థిగా బరిలో దిగిన సినీ హీరో కెప్టెన్ విజయ్‌కాంత్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. ఇతర పార్టీలతో కలసి కూటమిగా బరిలో దిగినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. -
అసోంలో వికసించిన కమలం
గువహటి: అసోంలో బీజేపీ తొలిసారి అధికారం చేపట్టనుంది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పినట్టే బీజేపీ ఘనవిజయం దిశగా దూసుకెళ్తోంది. 126 సీట్లున్న అసోంలో బీజేపీ 78 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార కాంగ్రెస్ వెనుకబడిండి. కాంగ్రెస్ కేవలం 21 చోట్ల ముందంజలో ఉంది. ఏఐయూడీఎఫ్ 15, ఇతరులు 6 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న తరుణ్ గొగోయ్ (కాంగ్రెస్)పై తీవ్రమైన వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా మారినట్లు తెలుస్తోంది. 15 ఏళ్ల తరుణ్ గొగోయ్ పాలనకు ముగింపుపడనుంది. అభివృద్ధి మంత్రతో ప్రచారం చేసిన బీజేపీ.. అసోం గణపరిషత్, బోడో పార్టీలతో కలిసి బరిలోకి దిగింది. -
బెంగాల్లో మమత.. కేరళలో ఎల్డీఎఫ్
న్యూఢిల్లీ: ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేసినట్టే పశ్చిమబెంగాల్లో అధికార తృణమాల్ కాంగ్రెస్, కేరళలో ప్రతిపక్ష ఎల్డీఎఫ్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. పశ్చిమబెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, తొలి నుంచి టీఎంసీ హవా కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉండగా, టీఎంసీ 211 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రతిపక్ష లెఫ్ట్ కూటమి కేవలం 70 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. బీజేపీ 9 చోట్ల ముందంజలో ఉంది. మూడుదశాబ్దాల కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుకొట్టి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన మమతకు ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చినట్టు కనిపిస్తోంది. కేరళలోనూ ఎగ్జిట్ పోల్స్ సర్వేలను నిజం చేస్తూ ఎల్డీఎఫ్ కూటమి అత్యధిక స్థానాల్లో ముందంజలో నిలిచింది. 140 సీట్లున్న కేరళలో ఎల్డీఎఫ్ 83 స్థానాల్లో, అధికార యూడీఎఫ్ 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కేరళలో బీజేపీ తొలిసారి బోణీ చేసే అవకాశముంది. ప్రస్తుతం బీజేపీ ఓ చోట ముందంజలో ఉంది. -
ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా
దేశంలోని ఐదు ప్రధాన రాష్ట్రాల ఎన్నికల తేదీలను ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) నసీమ్ జైదీ శుక్రవారం ప్రకటించారు. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూలును జైదీ విడుదల చేశారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి మే 16వ తేదీ వరకు వివిధ రాష్ట్రాలకు వివిధ రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. కేరళలో 140, తమిళనాడులో 234, పశ్చిమ బెంగాల్లో 294, అసోంలో 126, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు రాష్ట్రాల్లో కలిపి 824 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. కేరళలో 21వేలు, తమిళనాడులో 65వేలు, పశ్చిమ బెంగాల్లో 77వేలు, పుదుచ్చేరిలో 913 చొప్పున పోలింగ్ కేంద్రాలు ఉంటాయని జైదీ తెలిపారు. అన్నిచోట్లా ఈవీఎంలనే ఉపయోగిస్తామని అన్నారు. నోటాకు కూడా ప్రత్యేక గుర్తును ఈ ఎన్నికల నుంచి కేటాయిస్తున్నట్లు ఆయన చెప్పారు. 64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి ఈవీఎంలకు ప్రింటర్లు జతచేస్తున్నామని అన్నారు. అభ్యర్థులందరి ఫొటోలను కూడా ఈవీఎంలలో ఉంచుతామని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అసోంలో 2 దశలలోను, పశ్చిమబెంగాల్లో 6 దశలలోను, మిగిలిన మూడు రాష్ట్రాలు.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ఒకే దశలోను ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన మే 19వ తేదీన ఉంటాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియ మే 21 నాటికి ముగుస్తుందని నసీం జైదీ ప్రకటించారు. అసోం తొలి దశ 65 నియోజకవర్గాలు నోటిఫికేషన్ జారీ: మార్చి 11 నామినేషన్ల ముగింపు తేదీ: 18 మార్చి నామినేషన్ల పరిశీలన: 19 మార్చి ఉపసంహరణ గడువు: 21 మార్చి పోలింగ్ తేదీ: 4 ఏప్రిల్ (సోమవారం) రెండోదశ 61 నియోజకవర్గాలు నోటిఫికేషన్ జారీ: మార్చి 14 నామినేషన్ల ముగింపు తేదీ: 21 మార్చి నామినేషన్ల పరిశీలన: 22 మార్చి ఉపసంహరణ గడువు: 26 మార్చి పోలింగ్ తేదీ: 11 ఏప్రిల్ (సోమవారం) పశ్చిమబెంగాల్ తొలి దశ 18 నియోజకవర్గాలు (రెండుసార్లుగా జరుగుతుంది) నోటిఫికేషన్ జారీ: 11 మార్చి, 21 మార్చి నామినేషన్ల ముగింపు తేదీ: 18 మార్చి, 22 మార్చి నామినేషన్ల పరిశీలన: 19 మార్చి, 26 మార్చి పోలింగ్ తేదీలు: 4 ఏప్రిల్, 11 ఏప్రిల్ రెండోదశ 56 నియోజకవర్గాలు నోటిఫికేషన్ జారీ: 22 మార్చి నామినేషన్ల ముగింపు తేదీ: 29 మార్చి నామినేషన్ల పరిశీలన: 30 మార్చి ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 1 పోలింగ్ తేదీ: 17 ఏప్రిల్ మూడోదశ 62 నియోకవర్గాలు నోటిఫికేషన్ జారీ: 28 మార్చి నామినేషన్ల ముగింపు తేదీ: 4 ఏప్రిల్ నామినేషన్ల పరిశీలన: 5 ఏప్రిల్ ఉపసంహరణ గడువు: 7 ఏప్రిల్ పోలింగ్ తేదీ: 21 ఏప్రిల్ నాలుగోదశ 49 నియోజకవర్గాలు నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 1 నామినేషన్ల ముగింపు తేదీ: ఏప్రిల్ 4 నామినేషన్ల పరిశీలన: 9 ఏప్రిల్ ఉపసంహరణ గడువు: 11 ఏప్రిల్ పోలింగ్ తేదీ: 25 ఏప్రిల్ ఐదోదశ 53 నియోజకవర్గాలు నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 4 నామినేషన్ల ముగింపు తేదీ: ఏప్రిల్ 11 నామినేషన్ల పరిశీలన: 12 ఏప్రిల్ ఉపసంహరణ గడువు: 16 ఏప్రిల్ పోలింగ్ తేదీ: 30 ఏప్రిల్ ఆరోదశ 25 నియోజకవర్గాలు నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 11 నామినేషన్ల ముగింపు తేదీ: ఏప్రిల్ 18 నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 19 ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 21 పోలింగ్ తేదీ: మే 5 కేరళ 140 నియోజకవర్గాలు ఒకేదశ నోటిఫికేషన్ జారీ: 22 ఏప్రిల్ నామినేషన్ల ముగింపు తేదీ: 29 ఏప్రిల్ నామినేషన్ల పరిశీలన: 30 ఏప్రిల్ ఉపసంహరణ గడువు: 2 మే పోలింగ్ తేదీ: 16 మే తమిళనాడు 234 నియోజకవర్గాలు ఒకే దశ నోటిఫికేషన్ జారీ: 22 ఏప్రిల్ నామినేషన్ల ముగింపు తేదీ: 29 ఏప్రిల్ నామినేషన్ల పరిశీలన: 30 ఏప్రిల్ ఉపసంహరణ గడువు: 2 మే పోలింగ్ తేదీ: 16 మే పుదుచ్చేరి 30 నియోజకవర్గాలు ఒకేదశ నోటిఫికేషన్ జారీ: 22 ఏప్రిల్ నామినేషన్ల ముగింపు తేదీ: 29 ఏప్రిల్ నామినేషన్ల పరిశీలన: 30 ఏప్రిల్ ఉపసంహరణ గడువు: 2 మే పోలింగ్ తేదీ: 16 మే ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన తేదీ: మే 19 ఎన్నికల ప్రక్రియముగింపు 21 మే