ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ రెండుగా చీలిన నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల గుర్తైన సైకిల్‌పై వివాదం చెలరేగడం, ఆ గుర్తు తమకే కేటాయించాలని ఇరు పక్షాలూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ స్పందించారు. బుధవారం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధిచిన నోటిఫికేషన్‌ను జారీచేసిన ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు