
ఐదుగురు సీఎంలు సేఫ్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు గెలుపొందారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు గెలుపొందారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు తాము పోటీ చేసిన నియోజకవర్గాల్లో విజయం సాధించారు. తమిళనాడు సీఎం జయలలిత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రమే అధికారం నిలబెట్టుకున్నారు. కేరళ సీఎం ఊమెన్ చాంది, అస్సాం సీఎం తరుణ్ గొగొయ్, పుదుచ్చేసి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి అధికారం కోల్పోయారు.
జయలలిత చెన్నైలోని రాధాకృష్ణా నగర్ నుంచి ఘన విజయం సాధించారు. భవానిపూర్ నుంచి బరిలోకి నిలిచిన మమతా బెనర్జీ విజయ కేతనం ఎగురవేశారు. ఇందిరా నగర్ నుంచి పోటీ చేసిన సీఎం రంగసామి 3,404 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
సీఎం ఊమెన్ చాంది.. కొట్టయం జిల్లా పుతుపల్లిలో 27,092 ఓట్లతో గెలిచారు. టీటబర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తరుణ్ గొగొయ్ వరుసగా నాలుగోసారి గెలుపొందారు. తన సమీప బీజేపీ అభ్యర్థి కామఖ్య ప్రసాద్ తాసాపై 17,495 ఓట్లతో విజయం సాధించారు. మాజీ సీఎంలు కరుణానిధి, పన్నీరు సెల్వం, వీఎస్ అచ్యుతానందన్ కూడా తమ సీట్లను నిలబెట్టుకున్నారు.