చరిత్ర తిరగరాయబోతున్న అమ్మ | Jayalalitha to set record win in tamilnadu | Sakshi
Sakshi News home page

చరిత్ర తిరగరాయబోతున్న అమ్మ

Published Thu, May 19 2016 10:39 AM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM

చరిత్ర తిరగరాయబోతున్న అమ్మ

చరిత్ర తిరగరాయబోతున్న అమ్మ

జాతీయ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు లెక్కతప్పాయి. ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం మారింది. 'అమ్మ' చరిత్ర తిరగరాయబోతోంది.

చెన్నై: జాతీయ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు లెక్కతప్పాయి. ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం మారింది. 'అమ్మ' చరిత్ర తిరగరాయబోతోంది. తమిళనాడులో అన్నాడీఎంకే చీఫ్‌ జయలలిత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టున్నారు. స్థానిక టీవీ చానళ్లు అంచనా వేసినట్టుగా అన్నాడీఎంకే మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది.

కొన్ని దశాబ్దాలుగా తమిళనాడులో అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఈ సారి జయలలిత ఈ సంప్రదాయాన్ని మార్చబోతున్నారు. అమ్మ వరుసగా రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాల ట్రెండ్ ప్రకారం తమిళనాడులో అన్నాడీఎంకే విజయం దాదాపు ఖాయం. 234 అసెంబ్లీ సీట్లు ఉన్న తమిళనాడులో ప్రస్తుతం అన్నాడీఎంకే 141 స్థానాల్లో ముందంజలో ఉంది. అధికారంలోకి వస్తుందని భావించిన డీఎంకే 86 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 5 చోట్ల ముందజంలో ఉన్నారు. కాగా రెండు స్థానాలకు ఎన్నికలు జరగలేదు.

డీఎంకే చీఫ్‌ ఎన్ని వాగ్ధానాలు చేసిన ప్రజలు నమ్మలేదు. మళ్లీ అమ్మ వైపే మొగ్గుచూపారు. అమ్మ పేరుతో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు జయలలితకు లబ్ధిచేకూర్చాయి. ముఖ్యమంత్రి పదవి అభ్యర్థిగా బరిలో దిగిన సినీ హీరో కెప్టెన్ విజయ్కాంత్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. ఇతర పార్టీలతో కలసి కూటమిగా బరిలో దిగినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement