న్యూఢిల్లీ: రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తంచేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కచి్చతంగా విజయం సాధిస్తుందన్న రాహుల్.. తెలంగాణలో నెగ్గే అవకాశాలున్నాయని చెప్పారు.
ఇక రాజస్థాన్‌లో రెండు పారీ్టల మధ్య హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పారీ్టయే విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిదిన్ మీడియా నెట్‌వర్క్ ఆఫ్ అసోమ్ సంస్థ ఆదివారం ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరైన రాహుల్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఐక్య పోరాటం చేస్తాయని, ఆ ఎన్నికల్లో బీజేపీని నివ్వెరపరిచే ఫలితాలు వస్తాయని అన్నారు. ఆయన ఇంకా ఏం అన్నారంటే..
‘ప్రజా సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికే బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న పాట పాడుతోంది. కులగణన వంటి అంశాలను పక్కదారి పట్టించడానికి బీజేపీ ఎన్నో వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ మరో ఎంపీ దాని‹Ùపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ప్రజా అంశాలను పక్కదారి పట్టించడానికే.
ఆదాయ అసమానతలు, కొందరి చేతుల్లోనే సంపద పోగుపడిపోవడం, నిరుద్యోగం తీవ్ర రూపం దాల్చడం, వెనుకబడిన కులాలు, ఓబీసీలు, ఆదివాసీల పట్ల చిన్నచూపు, అధిక ధరలు వంటి సమస్యలు దేశాన్ని బాధిస్తున్నాయి.
ఈ అంశాలపై దృష్టి సారించలేని బీజేపీ వాటిని పక్కదారి పట్టించే మార్గంలో నడుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల విషయానికొస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు గెలిచే అవకాశాలున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కచి్చతంగా గెలుస్తాం. రాజస్తాన్‌లో గట్టి పోటీ ఉంది. కానీ కాంగ్రెస్ పారీ్టయే గెలుస్తుంది. ఇది మా పార్టీ అంచనా కాదు. బీజేపీ చేసుకున్న అంతర్గత సర్వేల్లోనూ ఇదే విషయం తేలింది’ అని రాహుల్ గాంధీ వివరించారు.
జిమ్ అంటేనే ఇష్టం
విలేకరులు అడిగిన కొన్ని సరదా ప్రశ్నలకూ రాహుల్ హుషారుగా బదులిచ్చారు. తీరిక సమయాల్లో నెట్‌ఫ్లిక్స్ చూస్తారా, జిమ్ చేస్తారా అని ప్రశ్నిస్తే జిమ్ చేయడమంటేనే తనకు ఇష్టమని చెప్పారు. గెడ్డంతో ఉండడం ఇష్టమా, లేకపోతే ఇష్టమా అని అడిగితే కాంగ్రెస్ పారీ్టలో ఉన్నాను కాబట్టి వేసుకునే వీటిని పట్టించుకోవడం లేదని, ఎలా ఉన్నా ఫర్వాలేదని నవ్వారు. రాజకీయ నేత కాకపోయి ఉంటే ఏమై ఉండేవారు అని ప్రశ్నించగా ‘ఏదైనా అయి ఉండేవాడిని.
నా మేనల్లుడు, వాడి స్నేహితుల్ని కలిసినప్పుడు టీచర్‌గా మారతా. వంటగదిలోకి అడుగు పెడితే చెఫ్ అయిపోతా. ఇలా నేను బహుముఖ పాత్రలు పోషిస్తుంటా’ అని రాహుల్ చెప్పారు. ‘క్రికెట్ కంటే ఫుట్‌బాల్ అంటే ఇష్టం. క్రీడాకారుడు మెస్సి రొనాల్డో అంటేఇష్టమన్నారు. గాడ్‌ఫాదర్, డార్క్‌నైట్ వీటిల్లో ఏ సినిమా అంటే ఇష్టం అని అడగ్గా.. రెండూ నాకు ఇష్టమే’ అని చెప్పారు. ఇండియా, భారత్‌లో దేశానికి ఏ పేరు ఉండాలని ప్రశ్నించగా ఇండియా అంటేనే భారత్ అని రాహుల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment