
ఐదు రాష్ట్రాల్లో బీజేపీదే విజయం...
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించడం ఖాయమని వెంకయ్యనాయు డు పేర్కొన్నారు
హైదరాబాద్: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించడం ఖాయమని వెంకయ్యనాయు డు పేర్కొన్నారు. ఎవరు ఎవరితో కలిసినా ఉత్తర ప్రదేశ్‌తోపాటు గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు.
దేశంలోని పేదలు మోదీని ఆప ద్భాంధవుడిగా చూస్తున్నారని, పెద్దనోట్ల రద్దు నిర్ణయం అంతిమంగా పేదలకే మేలు చేస్తుందని నమ్ముతున్నారని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఉనికి లోనైనా లేని కమ్యూ నిస్టులు మోదీపై పనికట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే బడ్జెట్‌లో పేదల కోసం మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రకటించే అవకాశముందన్నారు.