కాంగ్రెసే మా కొంప ముంచింది | We have lost because of Congress party: Badruddin Ajmal, AIUDF Chief | Sakshi
Sakshi News home page

కాంగ్రెసే మా కొంప ముంచింది

Published Thu, May 19 2016 11:53 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

కాంగ్రెసే మా కొంప ముంచింది - Sakshi

కాంగ్రెసే మా కొంప ముంచింది

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా చతికిలపడింది. కేరళ, అసోం రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోనుంది. కేరళలో ఎల్డీఎఫ్, అసోంలో బీజేపీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నాయి. ఇక పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలలో కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అంతేగాక కాంగ్రెస్తో పొత్తుపెట్టుకున్న పార్టీలు కూడా దెబ్బతిన్నాయి.

అసోంలో తమ ఓటమికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ నిందించారు. ఘనవిజయం సాధించిన బీజేపీకి ఆయన అభినందనలు తెలిపారు. అసోంలో 15 ఏళ్లు వరుసగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకుంది. తమిళనాడులో డీఎంకేతో, పశ్చిమబెంగాల్లో కమ్యూనిస్టులతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement