Badruddin Ajmal
-
మోదీని దేశం నుంచి తరిమేస్తాం!
న్యూఢిల్లీ : ఏఐయూడీఎఫ్ నాయకుడు బద్రుద్దీన్ అజ్మల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. లోక్సభ ఎన్నికల తర్వాత మహాకూటమితో కలిసి తాను నరేంద్రమోదీని దేశం నుంచి తరిమేస్తామని ఆయన పేర్కొన్నారు. అసోంలోని డుబ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత మోదీ గద్దె దిగిపోతారని, ఆ తర్వాత ఆయన చాయ్ దుకాణం తెరిచి.. పకోడాలు అమ్ముకోవచ్చునని పేర్కొన్నారు. అజ్మల్ వ్యాఖ్యలపై ట్విటర్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశ ప్రధానిని కించపరిచేలా మాట్లాడిన అజ్మల్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అజ్మల్ గతంలోనూ పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల పొత్తు గురించి ప్రశ్నించిన ఓ జర్నలిస్టును.. తల పగలగొడతానంటూ అజ్మల్ హెచ్చరించారు. ఎన్నికల తర్వాత మోదీని గద్దె దింపే కూటమితో తాను చేతులు కలుపుతానంటూ అజ్మల్ ప్రకటనపై ప్రశ్నిస్తూ.. ఎన్నికల తర్వాత మరో కూటమిలో జంప్ చేయబోతున్నారా? అని జర్నలిస్టు అడగడం ఆయనకు కోపం తెప్పించింది. -
కాంగ్రెసే మా కొంప ముంచింది
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా చతికిలపడింది. కేరళ, అసోం రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోనుంది. కేరళలో ఎల్డీఎఫ్, అసోంలో బీజేపీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నాయి. ఇక పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలలో కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అంతేగాక కాంగ్రెస్తో పొత్తుపెట్టుకున్న పార్టీలు కూడా దెబ్బతిన్నాయి. అసోంలో తమ ఓటమికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ నిందించారు. ఘనవిజయం సాధించిన బీజేపీకి ఆయన అభినందనలు తెలిపారు. అసోంలో 15 ఏళ్లు వరుసగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకుంది. తమిళనాడులో డీఎంకేతో, పశ్చిమబెంగాల్లో కమ్యూనిస్టులతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేకపోయింది.