బద్రుద్దీన్ అజ్మల్
న్యూఢిల్లీ : ఏఐయూడీఎఫ్ నాయకుడు బద్రుద్దీన్ అజ్మల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మహాకూటమితో కలిసి తాను నరేంద్రమోదీని దేశం నుంచి తరిమేస్తామని ఆయన పేర్కొన్నారు. అసోంలోని డుబ్రి లోక్‌సభ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మోదీ గద్దె దిగిపోతారని, ఆ తర్వాత ఆయన చాయ్ దుకాణం తెరిచి.. పకోడాలు అమ్ముకోవచ్చునని పేర్కొన్నారు. అజ్మల్ వ్యాఖ్యలపై ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశ ప్రధానిని కించపరిచేలా మాట్లాడిన అజ్మల్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
అజ్మల్ గతంలోనూ పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల పొత్తు గురించి ప్రశ్నించిన ఓ జర్నలిస్టును.. తల పగలగొడతానంటూ అజ్మల్ హెచ్చరించారు. ఎన్నికల తర్వాత మోదీని గద్దె దింపే కూటమితో తాను చేతులు కలుపుతానంటూ అజ్మల్ ప్రకటనపై ప్రశ్నిస్తూ.. ఎన్నికల తర్వాత మరో కూటమిలో జంప్ చేయబోతున్నారా? అని జర్నలిస్టు అడగడం ఆయనకు కోపం తెప్పించింది.
Comments
Please login to add a commentAdd a comment